• English
    • Login / Register

    ముసుగుతో ప్రొడక్షన్‌కు సిద్దంగా ఉన్న Mahindra BE.05-సునిశిత పరిశీలన

    మహీంద్రా బిఈ 6 కోసం ansh ద్వారా ఆగష్టు 22, 2023 01:36 pm ప్రచురించబడింది

    • 2.9K Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    అక్టోబర్ 2025లో భారత మార్కెట్‌లోకి ప్రవేశించనున్నBE.05

    Mahindra BE.05

    • దీని పూర్తి డిజైన్ కాన్సెప్ట్ؚకు సారూప్యంగా ఉంది. 

    • ప్రొడక్షన్‌కు సిద్దంగా ఉన్న వర్షన్ؚలో క్యాబిన్ తేలికపాటి మార్పులను పొందుతుందని అంచనా. 

    • ఇది INGLO ప్లాట్ఫార్మ్ పై ఆధారపడింది మరియు 450కిమీ కంటే ఎక్కువ పరిధిని అందించే 60kWh బ్యాటరీ ప్యాక్ؚతో వస్తుంది. 

    • ఇది అక్టోబర్ 2025లో విడుదల కానుంది, ధర రూ.25 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతుందని అంచనా. 

    మహీంద్రా డిజైన్ చీఫ్ ప్రతాప్ బోస్, ఇటీవల మహీంద్రా BE.05 ఎలక్ట్రిక్ SUV ప్రొడక్షన్‌కు సిద్దంగా ఉన్న వర్షన్ చిత్రాలను కొన్నిటిని విడుదల చేశారు. చూపించిన మోడల్ ఇప్పటికీ కప్పబడి ఉండగా, 2022లో ప్రదర్శించిన కాన్సెప్ట్ మోడల్‌కు చేసిన మార్పుల వివరాలను ఇక్కడ చూడవచ్చు. సరికొత్త ప్రివ్యూను మరింత వివరంగా చూద్దాం. 

    కాన్సెప్ట్ؚؚతో పోలిస్తే మరింత భిన్నంగా ఏమి లేదు

    ప్రదర్శించిన కాన్సెప్ట్ మోడల్ పూర్తి డిజైన్ లాంగ్వేజ్ؚను మహీంద్రా నిలుపుకోగలిగింది, ఇది మంచి పరిణామం ఎందుకంటే కాన్సెప్ట్ డిజైన్ పరంగా చూస్తే BE-05 ఆధునిక రూపాన్ని పొందింది. ఇరుకైన బోనెట్, ధృఢమైన మరియు నాజూకైన LED DRLలు మరియు సన్నని బంపర్ؚలతో ఫ్రంట్ ప్రొఫైల్ కాన్సెప్ట్ డిజైన్‌లో ఉన్నట్లుగానే కనిపిస్తోంది.

    Mahindra BE.05
    Mahindra BE.05

    కాన్సెప్ట్ మోడల్‌తో పోలిస్తే, వాస్తవంగా BE.05 పొందిన కొన్ని మార్పులను ప్రొఫైల్ؚలో గమనించవచ్చు. మరింత వాస్తవంగా-కనిపించే ఐదు-స్పోక్ؚల అలాయ్ వీల్స్ మరియు A-పిల్లర్‌లపై అమర్చిన కెమెరాల స్థానంలో సరైన ORVMలు వచ్చాయి. వీల్ ఆర్చ్ؚలకు ఎటువంటి క్లాడింగ్ ఉన్నట్లు లేదు మరియు B-పిల్లర్ మరింత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. 

    ఇది కూడా చదవండి: ఇప్పటి వరకు మనం చూసిన అన్ని మహీంద్రా ఎలక్ట్రిక్ SUVలు విడుదల కానున్నాయి 

    వెనుక భాగానికి వస్తే, ప్రొడక్షన్-స్పెక్ డిజైన్‌తో పోలిస్తే ఎటువంటి మార్పులు ఉన్నట్లు కనిపించడం లేదు. పై నుండి చూస్తే, స్ప్లిట్ రేర్ స్పాయిలర్ؚను మరియు ముందుకు వచ్చిన రేర్ ఎండ్ؚను చూడవచ్చు, ఇందులో LED DRLల స్టైలింగ్ؚను అనుసరించే నాజూకైన LED టెయిల్ ల్యాంపులు, భారీ రేర్ బంపర్ؚను కలిగీ ఉండటాన్ని గమనించవచ్చు.

    Mahindra BE.05
    Mahindra BE.05

    BE.05 పూర్తి డిజైన్ దాని కాన్సెప్ట్ వర్షన్ؚకు చాలా వరకు సారూప్యంగా ఉంటుందని నివేదించడానికి మాకు సంతోషంగా ఉంది. 

    ఇంటీరియర్ డిజైన్ 

    దీని క్యాబిన్ కూడా కాన్సెప్ట్ؚకు డిజైన్‌కు సారూప్యంగా ఉంది. కాన్సెప్ట్ؚ డిజైన్‌లో ఉన్నట్లుగానే డ్యూయల్ 12.3-అంగుళాల డిస్ప్లేలు, లేయర్డ్ డ్యాష్ؚబోర్డ్ డిజైన్, స్క్వారిష్ స్టీరింగ్ వీల్ మరియు కాన్సెప్ట్ؚలో ఉన్న పూర్తి కాక్ؚపిట్ డిజైన్ؚను మహీంద్రా కొనసగించింది.

    Mahindra BE.05 Cabin

    క్యాబిన్ కలర్ స్కీమ్ విషయంలో తేలికపాటి మార్పులను ఆశించవచ్చు మరియు ఆధునిక కాక్ؚపిట్ డిజైన్ؚను కొంతమేరకు మార్చువచ్చు. BE05 ఇంటీరియర్ ఇప్పటివరకు కెమెరాకు చిక్కలేదు, అయితే, వేరియెంట్‌పై ఆధారపడి మార్పులు ఉండవచ్చు. 

    పరిధి & పవర్ؚట్రెయిన్

    Mahindra INGLO Platform

    BE.05, మహీంద్రా INGLO ప్లాట్ఫారమ్ పై ఆధారపడిన మొదట EV ఆఫరింగ్. ఈ ఎలక్ట్రిక్ SUV 60kWh బ్యాటరీ ప్యాక్ؚతో రావచ్చు మరియు 450కిమీ క్లెయిమ్ చేసిన పరిధిని అందించవచ్చు. ఈ ప్రత్యేక ఎలక్ట్రిక్ SUVలో, రెండు-వీల్-డ్రైవ్ సిస్టమ్ؚను మాత్రమే ఆశించవచ్చు, అయితే ఆల్-వీల్-డ్రైవ్ؚకి కూడా మద్దతు ఉంటుంది. కొత్త మహీంద్రా బ్యాటరీ సాంకేతికత, 175kWh వరకు ఫాస్ట్ ఛార్జింగ్ؚకు అనుకూలంగా ఉంటుంది, 5 నుండి 80 శాతం ఛార్జింగ్ అయ్యేందుకు కేవలం 30 నిమిషాలు పడుతుంది. 

    విడుదల, ధర & పోటీదారులు

    First Spy Shots Of The Mahindra BE.05 Have Surfaced

    మహీంద్రా BE.05 అక్టోబర్ 2025లో వస్తుంది, దీని అంచనా ధర రూ.25 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇది హ్యుందాయ్ క్రెటా-ఆధారిత EV మరియు టాటా కర్వ్ EVలతో పోటీ పడుతుంది.

    was this article helpful ?

    Write your Comment on Mahindra బిఈ 6

    explore మరిన్ని on మహీంద్రా బిఈ 6

    సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

    *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

    ట్రెండింగ్‌లో ఉంది ఎలక్ట్రిక్ కార్లు

    • పాపులర్
    • రాబోయేవి
    ×
    We need your సిటీ to customize your experience