గ్రేట్ వాల్ మోటార్స్ దాని భారతదేశానికి రానున్న కారుతో ఊరిస్తుంది
జనవరి 07, 2020 02:58 pm sonny ద్వారా ప్రచురించబడింది
- 25 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
చైనా కార్ల తయారీసంస్థ 2020 ఆటో ఎక్స్‌పోలో మొదటిసారిగా అడుగుపెట్టనున్నది
- గ్రేట్ వాల్ మోటార్స్ త్వరలో భారతీయ ఆటోమార్కెట్‌లోకి ప్రవేశించనుంది.
- ఇది ఫిబ్రవరి 2020 లో ఆటో ఎక్స్‌పోలో SUV-హెవీ లైనప్‌ను ప్రదర్శిస్తుంది.
- టాటా హారియర్ మరియు MG హెక్టర్ వంటి వాటికి ప్రత్యర్థిగా GWM ఇండియా హవల్ H6 మిడ్-సైజ్ SUV తో మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది.
- హవల్ బ్రాండ్ 2021 లో మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది.
భారతీయ ఆటోమోటివ్ మార్కెట్లోకి ప్రవేశించాలనుకుంటున్న కొన్ని కొత్త పేర్లు రాబోయే 2020 ఆటో ఎక్స్‌పో కు హాజరవుతాయి. వాటిలో చైనా కార్ల తయారీ సంస్థ గ్రేట్ వాల్ మోటార్స్ (GWM) ఒకటి, ఇది తన అధికారిక రాకను కొత్త ట్విట్టర్ హ్యాండిల్ తో ట్వీట్ ద్వారా ఊరించింది: అదేమిటంటే ‘నమస్తే ఇండియా! ఆల్ సెట్ ఫర్ గ్రేట్ థింగ్స్ ఎహెడ్. ’
GWM తన విస్తృతమైన పోర్ట్‌ఫోలియో నుండి ఎక్స్‌పోకు 10 కి పైగా మోడళ్లను తీసుకువస్తుందని భావిస్తున్నారు. చైనీస్ కార్ల తయారీసంస్థ దాని కొన్ని EV లను కూడా ప్రదర్శించవచ్చు. GWM యొక్క ట్విట్టర్ కవర్ ORA R1 ఎలక్ట్రిక్ కాంపాక్ట్ కారును కలిగి ఉంది. ఇది మార్కెట్లోకి ప్రవేశించేటప్పుడు SUV లను ప్రవేశపెట్టడంపై దృష్టి పెడుతుంది.
చైనా కార్ల తయారీసంస్థ 2021 లో హవల్ H6 అనే SUV సమర్పణతో భారతదేశానికి చేరుకుంటారని భావిస్తున్నారు. H6 మిడ్-సైజ్ SUV, ఇది టాటా హారియర్ మరియు MG హెక్టర్ వంటి వాటికి పోటీగా ఉంటుంది. ఇది ప్రపంచ మార్కెట్ లో రెండు టర్బో-పెట్రోల్ ఇంజన్లతో లభిస్తుంది: ఒకటి 1.5-లీటర్ మోటారు (163Ps / 280Nm) మరియు రెండోది 2.0-లీటర్ యూనిట్ (190Ps / 340Nm), రెండూ 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ తో అందుబాటులో ఉంటాయి.
ఇవి కూడా చదవండి: MG హెక్టర్, టాటా హారియర్ ప్రత్యర్థి హవల్ H 6 రివీల్డ్; 2020 ఆటో ఎక్స్‌పోలో అరంగేట్రం