• English
    • Login / Register

    MG హెక్టర్, టాటా హారియర్ కి ప్రత్యర్థి అయిన హవల్ H6 రివీల్ అయ్యింది; 2020 ఆటో ఎక్స్‌పోలో అరంగేట్రం ఉండవచ్చు

    నవంబర్ 05, 2019 11:55 am dhruv attri ద్వారా సవరించబడింది

    • 27 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    హవల్ H6 మిడ్-సైజ్ SUV, ఇది MG హెక్టర్, టాటా హారియర్ మరియు మహీంద్రా XUV 500 వంటి వాటితో పోటీ పడుతుంది

    •  గ్రేట్ వాల్ మోటార్స్ గుజరాత్‌ లో తయారీ సదుపాయాన్ని ఏర్పాటు చేసింది.
    •  2020 ఆటో ఎక్స్‌పోలో హవల్ గొడుగు కింద SUV లను ప్రదర్శించగలదు.
    •  హవల్ H6 పెట్రోల్-ఆటోమేటిక్ తో మాత్రమే అందించబడుతుంది. 
    •  ఇందులో ఆల్-LED లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, 9-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ మరియు 12.3-ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి.
    •  GWM హవల్‌ లో విటారా బ్రెజ్జా నుండి టయోటా ఫార్చ్యూనర్‌ వరకూ పోటీని ఇచ్చే అన్ని SUV లు దీనిలో ఉన్నాయి.

    MG Hector, Tata Harrier Rival Haval H6 Revealed; Debut Likely At 2020 Auto Expo

    చైనా కార్ల తయారీ సంస్థ గ్రేట్ వాల్ మోటార్స్ గుజరాత్ లోని సనంద్ లో సుమారు రూ .7 వేల కోట్ల పెట్టుబడితో షాప్ ని ప్రారంభించింది. ఢిల్లీ లో జరిగే 2020 ఆటో ఎక్స్‌పోలో ఈ తయారీదారు భారత్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఆ యొక్క సంస్థ వద్ద మనం ఏమి ఆశించవచ్చు? అయితే, ఇది ఇటీవలే తన మిడ్-సైజ్ SUV అయిన హవల్ H 6 ను విడుదల చేసింది, ఇది గనుక భారతదేశానికి వస్తే  హెక్టర్, హారియర్ మరియు XUV 500 లకు పోటీగా ఉండే మంచి ప్రీమియం సమర్పణ అవుతుంది.   

    GWM హవల్ H 6 ఐదు-స్లాట్ హారిజాంటల్ ఫ్రంట్ గ్రిల్‌ లో క్రోమ్‌ను బాగా ఉపయోగించుకుంటుంది, ఫాగ్ ల్యాంప్ చుట్టూ DRL లతో ఆటో LED హెడ్‌ల్యాంప్‌లను కూడా పొందుతుంది. దీని సైడ్ వ్యూ విషయనికి వస్తే యూరోపియన్ డిజైన్‌ ను కలిగి ఉంటూ స్పోర్టి రియర్ స్లాపింగ్ రూఫ్‌లైన్, సైడ్ క్లాడింగ్ మరియు 19-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో ఉంటుంది. అవును, ఆఫర్‌ లో ‘అతి-ముఖ్యమైన’ పనోరమిక్ సన్‌రూఫ్ ఉంది. స్టబ్బీ రియర్ ఎండ్‌ లో ర్యాపారౌండ్ LED టైలాంప్‌లు, బూట్ మూత మధ్యలో హవల్ బ్యాడ్జింగ్ మరియు క్వాడ్ లేదా డ్యూయల్ ఎగ్జాస్ట్ సెటప్‌ తో స్పోర్టి బంపర్ లభిస్తుంది.  

    MG Hector, Tata Harrier Rival Haval H6 Revealed; Debut Likely At 2020 Auto Expo

    హవల్ H 6 లోపలి భాగం మీకు మంచి ప్రీమియం కార్ల ఇంటీరియర్ ని తలపిస్తుంది. చంకీ లెదర్ స్టీరింగ్ వీల్ ల్యాండ్ రోవర్ నుండి ప్రేరణ పొందింది, అయితే విస్తరించిన AC వెంట్స్ ఆడి మాదిరిగానే ఉంటాయి. యాంబియన్స్ మరింత పెంచేందుకు 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ (ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే లేదు) మరియు వర్చువల్ కాక్‌పిట్ సిస్టమ్‌ తో 12.3-అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ దీనిలో ఉంటాయి.    

    MG Hector, Tata Harrier Rival Haval H6 Revealed; Debut Likely At 2020 Auto Expo

    ఇతర సౌలభ్యం లక్షణాలలో డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ మరియు 8-వే పవర్-సర్దుబాటు డ్రైవర్ సీట్ ఉన్నాయి. భద్రతా పరికరాలు ఆన్‌బోర్డ్‌లో 360-డిగ్రీ కెమెరా, బ్లైండ్-స్పాట్ డిటెక్షన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఆరు ఎయిర్‌బ్యాగులు, ISOFIX మరియు మరిన్ని ఉన్నాయి.

    గ్లోబల్-స్పెక్ మోడల్ రెండు యూరో 5-కంప్లైంట్ పెట్రోల్ ఇంజన్లతో లభిస్తుంది: 1.5-లీటర్ టర్బో (163Ps / 280Nm) మరియు 2.0-లీటర్ టర్బో (190Ps / 340Nm). రెండు ఇంజన్లు 7-స్పీడ్ DCT ని పొందుతాయి, ఇది ముందు చక్రాలకు శక్తిని పంపుతుంది.

    MG Hector, Tata Harrier Rival Haval H6 Revealed; Debut Likely At 2020 Auto Expo

    GWM ప్రధానంగా దాని హోం మార్కెట్ లో పెద్ద వాహనాలు మరియు పికప్ ట్రక్కులకు ప్రసిద్ది చెందింది మరియు ఇది భారతదేశంలో కూడా అలానే అందించబోతోంది. H6 కాకుండా, చైనా కార్ల తయారీదారు తన టయోటా ఫార్చ్యూనర్-ప్రత్యర్థి హవల్ H9 ను కూడా ప్రదర్శిస్తుందని ఆశిస్తున్నాము.   

    మరింత చదవండి: హారియర్ డీజిల్
     

    was this article helpful ?

    Write your వ్యాఖ్య

    ట్రెండింగ్‌లో ఉంది కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience