• English
  • Login / Register

కొత్త చేవ్రొలెట్ ఎంజాయ్ ఎంపివిని రూ. 6.24 లక్షల వద్ద ప్రారంభించిన జనరల్ మోటార్స్

చేవ్రొలెట్ ఎంజాయ్ కోసం saad ద్వారా జూలై 06, 2015 01:54 pm ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: జనరల్ మోటార్స్ ఇండియా, ఒక కొత్త చెవ్రోలెట్ ఎంజోయ్ ఎంపివి ను కొద్ది కొద్ది మార్పులతో ఇటీవల ప్రవేశపెట్టాడు. ఈ సంస్థ యొక్క తయారీదారుడు, కొత్త చెవ్రోలెట్ ఎంజోయ్ ఎంపివి ను 6.24 లక్షల వద్ద ప్రవేశపెట్టాడు. దీనితో పాటుగా, ఈ మోడల్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ ను 8.79 లక్షల ఎక్స్-షోరూమ్, ఢిల్లీ వద్ద ప్రవేశపెట్టారు. అంతేకాకుండా, ఈ వాహనంలో 7-8 సీటర్ ల మార్పులను గమనించవచ్చు మరియు కొద్ది మార్పులు కాస్మటిక్ రూపంలో గమనించవచ్చు. కానీ, పాత దానిలో ఉండే అదే ఇంజన్ తో కొనసాగుతుంది.  

ఈ కొత్త చెవ్రోలెట్ ఎంజోయ్ యొక్క బాహ్య భాగాలు అంతగా మార్పు చేయబడలేదు. మనం బాహ్య బాగాలలో, వెలుపలి అనేక భాగాలపై క్రోం చేరికలను చూడవచ్చు. అంతేకాకుండా, వెనుక లైసెన్స్ ప్లేట్ పై క్రోం గార్నిష్ ను ప్రామాణికంగా గమనించవచ్చు. ఇతర మార్పులు ముఖ్యంగా బ్లాక్డ్ ఔట్ బి-స్తంభాలలో చూడవచ్చు.

ఈ కొత్త చెవ్రోలెట్ ఎంజోయ్ యొక్క అంతర్గత భాగాలలో అనేక మార్పులను గమనించవచ్చు. కొత్త లుక్ ను ఇవ్వడమే కాకుండా, అనేక కాస్మటిక్ మార్పులతో వచ్చింది. ఈ కొత్త చెవ్రోలెట్ ఎంజోయ్ లోపలి భాగాలలో, కొత్త లెధర్ మరియు ఫ్యాబ్రిక్ అపోలిస్ట్రీ, త్రీ స్పోక్ స్పోర్టీ స్టీరింగ్ వీల్ పై వెండి చేరికలు వంటి వాటిని అధనం గా చేర్చారు. డ్రైవింగ్ సమయం లో డ్రైవర్ సౌకర్యాలకు అనుగుణంగా, స్టీరింగ్ వీల్ పై ఆడియో నియంత్రణలను పొందుపరిచారు.   

ఈ కొత్త ఎంజోయ్ వాహనానికి రిచ్ లుక్ ను ఇవ్వాలని, తయారీధారుడు, లోపల డోర్ హ్యాండిల్స్, గేర్ నాబ్, ఎసి వెంట్స్, మరియు పార్కింగ్ లివర్ ల పై క్రోమ్ చేరికలతో అలంకరించాడు. అలాగే డోర్ ఆర్మ్రెస్ట్ లపై మరింత అందాన్ని చేకూర్చడానికి బ్లాక్ ముగింపును ఉంచారు 

హూడ్ క్రింది భాగానికి వస్తే ఎటువంటి మార్పులు జరగలేదు. అదే స్మార్ట్ టెక్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ తో మన ముందుకు అందుబాటులోకి వచ్చింది. 1.3 లీటర్ డీజిల్ ఇంజన్, అత్యధికంగా 78 PS పవర్ ను ఉత్పత్తి చేయగా, అత్యధికంగా 172.5 Nm గల టార్క్ ను విడుదల చేస్తుంది. అయితే, 1.4 లీటర్ ఫోర్ సిలండర్ల పెట్రోల్ ఇంజన్, అత్యధికంగా 100.2 PS పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా, 131 Nm గల పీక్ టార్క్ ను విడుదల చేస్తుంది. ఈ ఇంజన్ లు 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటాయి.  

జనరల్ మోటార్స్ ఇండియా యొక్క  అధ్యక్షుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్, అయిన మిస్టర్ అరవింద్ సక్సేనా మాట్లాడుతూ, ఈ కాంపాక్ట్ ఎంపివి విభాగంలో ఉన్న చెవ్రోలెట్ ఎంజాయ్ అత్యంత విలువలతో కొనసాగుతుంది అని వ్యాఖ్యానించారు. దీనిలో మనం కొత్తగా గమనించే మార్పులు ఏమిటంటే, త్రీ స్పోక్ స్పోర్టీ స్టీరింగ్ వీల్ పై ఆడియో నియంత్రణలను గమనించవచ్చు. అంతేకాకుండా ఈ వాహనం మరింత ఆకర్షణీయంగా ఉంది మరియు ఈ వాహనాన్ని, కుటుంబం సభ్యుల ప్రయాణం కొరకు మరియు వ్యాపార ఉపయోగం కొరకు రెండూ విధాలుగా ఈ వాహనాన్ని ఉపయోగించుకోవచ్చు.

was this article helpful ?

Write your Comment on Chevrolet ఎంజాయ్

ట్రెండింగ్‌లో ఉంది ఎమ్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience