రాబోయే వోక్స్వాగన్ - స్కోడా కార్లు ఒకదానికొకటి బిన్నమైనవి కనిపిస్తాయి, చూడండి
స్కోడా రాపిడ్ కోసం dinesh ద్వారా మార్చి 18, 2019 03:17 pm సవరించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
- స్కొడా & వోక్స్వాగన్లు అదే విభాగాలలో నుండి కార్లు అందించడం కొనసాగుతున్నాయి
- స్కోడా భారతదేశంలో వోక్స్వాగన్ గ్రూప్ కోసం ఎం క్యూబి మాడ్యులర్ వేదికను స్థానీకరణ చేస్తుంది
- వోక్స్వాగన్ & స్కోడా రెండూ కూడా ఎం క్యూ బి ఏ0- ఇన్ (స్థానికీకరించిన వెర్షన్) ప్లాట్ఫారమ్పై కార్లను తయారు చేస్తాయి
- రాబోయే కార్లు ప్రతీ ఒక్కటీ ఇతర కార్ల నుండి చాలా భిన్నంగా కనిపిస్తాయి
కార్దెకో తో జరిగిన ఒక ఇటీవల సంభాషణలో, భారతదేశంలో వోక్స్వాగన్ గ్రూప్ యొక్క హెడ్, గురుప్రతాప్ బొపారాయ్, భవిష్యత్తులో రాబోయే వోక్స్వాగన్ మరియు స్కోడా కార్లు ఒకదానికొకటి పోలి అదే విదమైన వెర్షన్లు ఉండవని నిర్ధారించింది. ప్రస్తుతం, బ్యాండ్ ఇంజనీరింగ్ను వెంటో- రాపిడ్ లలో చూడవచ్చు, వీటిని చూసినట్లైతే సైడ్ భాగాలు మరియు వెనుక భాగాలు ఒకదానిని ఒకటి చాలా వరకు పోలి ఉంటాయి.
కొత్త తరం స్కొడా రాపిడ్, వోక్స్వాగన్ పోలో, అమీయో, వెంటో ఇన్ పైప్లైన్ ఫర్ ఇండియా
వోక్స్వాగన్ - స్కోడా కోసం రాబోయే ఉత్పత్తులు మరియు బ్యాడ్జ్ ఇంజనీరింగ్ ల గురించి బొపారాయ్ మాట్లాడుతూ, "మేము అందించిన ప్రస్తుత మోడల్స్ ఒకే విషమైన బ్యాడ్జ్ ఇంజనీరింగ్ స్థాయి ఉంటుంది, కానీ ఉత్పత్తుల మధ్య చాలా తేడా ఉంటుంది. అదే విభాగాల్లో రాబోయే కార్లు విభిన్నంగా కనిపించే విధంగా ఉత్పత్తులను అందజేస్తామని వివరించారు. మీరు ఎంపిక చేసుకోవడానికి అవసరమైన విభిన్నత మరియు సారూప్యత మధ్య బేదం ఎల్లప్పుడూ ఉంటుంది. అంతేకాకుండా మనం చాలా సారూప్యతను కలిగి ఉన్న మంచి సంతులనాన్ని సాధించామని నేను అనుకుంటున్నాను, కాని ఉత్పత్తులను గణనీయంగా భిన్నంగా అందజేస్తాము".
ఒకే విభాగం నుండి రాబోయే వోక్స్వాగన్ మరియు స్కొడా కార్లు ఏ ఏ అంశాలలొ బిన్నంగా ఉంటాయో బొపారాయ్ ఇంకా సరిగ్గా వివరించలేదు. కానీ, ఈ రెండు కార్లు ఏ రకమైన భాగం నుండి కూడా పోలి ఉండవని మేము భావిస్తున్నాము. అయితే, మేము ఒకే విభాగంలో ఉన్న ఈ రెండు బ్రాండ్ల నుండి వేర్వెరు కార్లను చూడబోతున్నాము, అవి ఎం క్యూ బి ఏ0- ఇన్ వేదిక ద్వారా అందించబడతాయి.
ఈ రెండు తయారీదారులు భారతదేసం కోసం అందించే తరువాతి తరం ఉత్పత్తుల విషయంలో కొన్ని సంవత్సరాలు దూరంలో ఉన్నప్పటికీ, వారు తమ కార్లను ప్రపంచవ్యాప్తంగా వేర్వేరుగా చూడటం కోసం పని చేయడం ప్రారంభించారు. కారు తయారీదారులు, ఈ రెండు బ్రాండ్ల నుండి అందించబోయే టి- క్రాస్ మరియు విజన్ ఎక్స్ కాన్సెప్ట్ కాంపాక్ట్ ఎస్యూవి ల వెలుపలి రూపకల్పనను ఎలా ఉండబోతుందో పోల్చుకోండి వోక్స్వాగన్ అందించే కారు-బాక్సీ గా మరియు స్క్వారిష్ గా టైగన్ ను పోలి ఉండబోతుంది అదే స్కోడా విషయానికి వస్తే కోడియాక్ మరియు కరోక్ గా ఉండబోతుంది.
భారతదేశంలో ప్రస్తుత అందుబాటులో ఉన్న రాపిడ్ మరియు వెంటో లోపల కూర్చున్నట్లైతే, రూపకల్పన సంబంధించినంత వరకు చాలా సాధారణతను కనుగొనగలరు. అయితే, మేము స్కాలా (ఎంక్యూబి ఏ0- ఆధారిత స్కోడా) తో ఆరవ తరం పోలో మరియు టి- క్రాస్ (ఎంక్యూబి ఏ0 ప్లాట్ఫారమ్లో రెండు ఉత్పత్తుల) యొక్క అంతర్గత నమూనాను పోల్చినట్లయితే, అవి రెండూ కూడా చాలా భిన్నంగా ఉంటాయి. పోలో క్యాబిన్ వైవిధ్యమైనది మరియు డాష్ బోర్డ్లో పొందుపరచబడిన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అందించబడుతుంది అదే స్కాలా యొక్క క్యాబిన్ విషయానికి వస్తే చిన్నదిగా కనిపిస్తుంది మరియు ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ బయటకు అందించబడుతుంది.
ధృవీకరించబడింది: వోక్స్వాగన్ ఇండియా టియాగో, క్విడ్ ప్రత్యర్థిని ప్రారంభించటం లేదు
వోక్స్వాగన్ మరియు స్కోడా ఉత్పత్తి ముందు వైపు మార్పులు చేస్తున్నాయి కాబట్టి, ఈ రెండు బ్రాండ్ల వారి ధర వ్యూహాలు పెరుగుతాయని భావిస్తున్నాము. దీని అర్ధం ఏమిటంటే, భవిష్యత్తులో రాబోయే వోక్స్వాగన్ కార్ల ధరలు- స్కొడా నుండి వచ్చే అదే ఉత్పత్తులపై స్వల్ప ప్రీమియమ్ ధర ఎక్కువ ఉండబోతుందని అంచనా. ప్రస్తుతం అందుబాతులో ఉన్న స్కొడా సూపర్బ్ ధర రూ 27.49 లక్షలు మరియు రూ 32.99 లక్షల అదే వోక్స్వాగన్ పసత్ విషయానికి వస్తే, రూ. 29.99 లక్షల నుంచి 32.99 లక్షల రూపాయల ధరకే లభిస్తుంది. (అన్ని ధరలు, ఎక్స్ షోరూం పాన్-ఇండియా).
అలాగే చదవండి: భారతదేశంలో తయారయ్యే రాబోయే కార్ల కోసం స్కొడా ఐయింగ్ ఎక్స్పోర్ట్స్
0 out of 0 found this helpful