టాటా మోటార్స్ వారు ఉచిత వర్షాకాల చెక్ అప్ క్యాంప్ అందిస్తున్నారు

జూలై 22, 2015 03:16 pm konark ద్వారా ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఢిల్లీ: వారి ప్రయాణీకుల కార్లకు దేశవ్యాప్తంగా ఉచిత వర్షాకాల చెక్ అప్ శిబిరం 28 జూలై నుండి ప్రారంభమయ్యి 2వ ఆగష్టు, 2015 వరకు నిర్వహించబడతాయి.  585 కార్ఖానాలు 293 నగరాల్లో ఈ కార్యక్రమానికి ఆతిధ్యం ఇవ్వనున్నాయి. లేబర్ చార్జీలపై, లూబ్రికంట్స్ మరియూ టాటా వారి అసలు భాగాలపై డిస్కౌంట్ లతో పాటుగా వినియోగదారులకు ఉచితంగా చెకప్ మరియు వాష్ కూడా పొందవచ్చు.

టాటా మోటర్స్ వారు 25 కంటే ఎక్కువ పరికరాలు మరియూ లూబ్రికంట్స్ సరఫరాదారులతో అనుసంధానం అయ్యి వారి అన్ని ఉత్పత్తుల్లో 10% డిస్కౌంట్ ని అందిస్తున్నారు.

టాటా మోటార్స్ వారి ప్యాసింజర్ వాహన బిజినెస్ యూనిట్ కి అధ్యక్షుడు అయిన మయాంక్ పరీక్ మాట్లాడుతూ, "మొదటి మెగా సర్వీస్ క్యాంప్ విజయం తరువాత మేము రెండవ ఫేజ్ ప్రారంభాన్ని ప్రకటించడం గర్వంగా ఉంది అని అన్నారు. మేము మార్కెట్ తర్వాతి సేవలు కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి అత్యవసరమైనవి అని నమ్ముతాము. ఈ సేవ శిబిరం ప్రత్యేకంగా మా వినియోగదారులకు వర్షాకాలం ఫలితంగా ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి సహాయం చేసే లక్ష్యంగా పెట్టినది. టాటా మోటార్స్ నుండి సేల్స్ మరియు సర్వీస్ కంపెనీ కోసం కొత్త గుర్తింపు సృష్టిస్తుంది అని మరియు వినియోగదారుని సేవల విధానాన్ని అనుసరించడంలో నూతన ఒరవడిని సృష్టిస్తుంది అని అభిప్రాయపడ్డారు.

విజయవంతమైన మొదటి దశ తరువాత, ఈ వానాకాలం శిబిరంలో కార్మిక, లూబ్స్, భాగాలు, సురక్షితంగా డ్రైవింగ్ చేసే చిట్కాలతో పాటు టైర్లు మరియు బ్యాటరీలుపై దృష్టి పెడుతుంది. వినియోగదారులకు వానాకాలంలో వాహనాలు యొక్క శ్రద్ధ ఎలా తీసుకోవాలి అన్న జ్ఞానాన్ని కూడా అందిస్తారు.

మంచి ఎక్స్చేంజ్ బోనస్ అందించడంతో పాటుగా ప్రత్యేక ఇంటరెస్ట్ రేట్లతో స్పాట్ లోనే లోన్ ఆమోదాలు కూడా అందిస్తున్నరు. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience