Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

నాల్గవ తరం మెర్సిడెస్ బెంజ్ GLE LWB రూ .73.70 లక్షల వద్ద ప్రారంభమైంది

ఫిబ్రవరి 05, 2020 12:19 pm dinesh ద్వారా ప్రచురించబడింది

కొత్త-జెన్ SUV BS6 డీజిల్ ఇంజన్లతో మాత్రమే వస్తుంది.

  • మెర్సిడెస్ బెంజ్ SUV యొక్క లాంగ్ వీల్‌బేస్ వెర్షన్‌ను భారతదేశంలో విడుదల చేసింది.
  • ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది: GLE 300 d మరియు GLE 400 d హిప్-హాప్ ఎడిషన్.
  • దీని ధర రూ. 73.70 లక్షలు మరియు రూ. 1.25 కోట్లు.
  • దీని ప్రత్యర్థులు ఆడి Q7, BMW X5, వోల్వో XC 90 మరియు ల్యాండ్ రోవర్ డిస్కవరీ.

మెర్సిడెస్ బెంజ్ భారతదేశంలో నాల్గవ తరం GLE ని విడుదల చేసింది. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది: 300 d మరియు 400 d హిప్-హాప్ ఎడిషన్, వీటి ధర వరుసగా రూ .73.70 లక్షలు మరియు రూ .1.25 కోట్లు (ఎక్స్-షోరూమ్ ఇండియా).

ఇంజన్ విషయానికి వస్తే, 300D 2.0-లీటర్ ఇంజన్ తో 245Ps పవర్ మరియు 500Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు 400 d, 3.0-లీటర్ యూనిట్‌ను పొందుతుంది, ఇది 330PS పవర్ మరియు 700Nm టార్క్ ని అందిస్తుంది. రెండు ఇంజన్లు 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ తో జతచేయబడతాయి, ఇవి మెర్సిడెస్ 4 మాటిక్ ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ ద్వారా నాలుగు వీల్స్ కి పవర్ ని పంపుతాయి.

డిజైన్ పరంగా, కొత్త GLE దాని పెద్ద తోబుట్టువు అయిన GLS లాగా కనిపిస్తుంది. ముందు భాగం నిటారుగా కనిపిస్తుంది మరియు కొత్త స్లీకర్ హెడ్‌ల్యాంప్స్‌తో అమర్చబడిన భారీ ట్విన్-స్లాట్ గ్రిల్‌ను కలిగి ఉంది. వెనుక భాగంలో, వెనుక క్వాటర్ వంటి సిగ్నేచర్ డిజైన్ అంశాలు వెనుక విండ్‌షీల్డ్‌కు చుట్టూ ఉన్నట్టుగా ఉండే ఎఫెక్ట్ ని ఇస్తున్నాయి. టెయిల్ లాంప్స్ ఇప్పుడు కొంచెం సన్నగా ఉన్నాయి, కాని వెనుక ఫెండర్ వెంట సాగడం కొనసాగించాయి.

దీని యొక్క ఇంటీరియర్ పూర్తిగా తిరిగి డిజైన్ చేయబడింది. ఇది డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌తో మెర్సిడెస్ ట్విన్ స్క్రీన్ సెటప్‌ను పొందుతుంది. దీనిలో 9 ఎయిర్‌బ్యాగులు, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా, బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్, ఫోర్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎయిర్ సస్పెన్షన్ మరియు పార్కింగ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

కొత్త GLE రూ .73.70 లక్షల నుండి 1.23 కోట్ల రూపాయల వరకు ధరని కలిగి ఉండి, ఆడి Q 7, BMW X 5, వోల్వో S90, ల్యాండ్ రోవర్ డిస్కవరీ వంటి వాటితో పోటీ కొనసాగిస్తుంది.

ఇది కూడా చదవండి: మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ, ఎలక్ట్రిక్ మరియు AMG మిశ్రమాన్ని ఆటో ఎక్స్‌పో 2020 కి తీసుకొనిరానున్నది

దీనిపై మరింత చదవండి: GLE ఆటోమేటిక్

Share via

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
Rs.8.95 - 10.52 సి ఆర్*
కొత్త వేరియంట్
Rs.18.90 - 26.90 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.21.90 - 30.50 లక్షలు*
Rs.9 - 17.80 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.11.82 - 16.55 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర