• English
  • Login / Register

ఫోకస్ ఆరెస్ గురించి ఫోర్డ్ వారు అన్ని వివరాలను బహిర్గతం చేశారు!

ఫోర్డ్ ఫోకస్ కోసం raunak ద్వారా సెప్టెంబర్ 19, 2015 10:56 am సవరించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఇది గంటకి 0-100 కీ.మీ లను 4.7 సెకనుల్లో మరియూ గరిష్ట వేగం గంటకు 265 కీ.మీ లు చేరుకోగలదు; మస్టాంగ్ లాగా, 2016 ఫోకస్ ఆరెస్ కూడా ప్రపంచ పర్యటన చేస్తోంది!

జైపూర్: జరుగుతున్న 2015 ఫ్రాంక్ఫర్ట్ మోటర్ షోలో, ఫోర్డ్ వారు సూపర్ హ్యాచ్ బ్యాక్ అయిన 2016 ఫోకస్ ఆరెస్ యొక్క సాంకేతిక వివరాలను వెల్లడించారు. దాదాపుగా రూ. 24 లక్షల ధర పలికే ఈ ఫోకస్ ఆరెస్ 100 కీ.మీ లని 4.7 సెకనుల్లో మరియూ గంటకి 265 కీ.మీ ల గరిష్ట వేగాన్ని అందుకునే సామర్ధ్యం కలదు. ఈ ఏడాది మొదలులో జరిగిన గుడ్వుడ్ పండగ లో ఈ కారు యొక్క వివరాలను తెలపడం జరిగింది.

ఇంజిను నుండి మొదలు పెడితే, ఈ 2.3-లీటర్ ఇన్లైన్-4 టర్బో చార్జర్ మోటరు 350 Ps శక్తి ని 6800rpm వద్ద మరియూ 440Nm టార్క్ ని 2000-4500rpm వద్ద ఉత్పత్తి చేస్తుంది. కాకపోతే, ఓవర్ బూస్ట్ మోడ్ ఉండటం కారణంగా ఆరెస్ 470Nm ని 15 సెకనుల్లో విడుదల చేయగలదు.

"ఈ సరికొత్త ఫోకస్ ఆరెస్ దిగ్గజమైన నేం ప్లేట్ తో కొత్త తరం అంతర్జాతీయ కస్టమర్లకి మొట్టమొదటి సారిగా అందించబడుతుంది," అని ఫోర్డ్ పర్ఫార్మెన్స్ కి డైరెక్టర్ అయిన డేవ్ పెరికాక్ తెలిపారు. "ఇది అధ్బుతమైన సామర్ధ్యాన్ని మరియూ విన్నుత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని కలగలిపి సరసమైన ధరకి అందుబాటులో ఉంటుంది."

ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం అందించబడుతున్న మొట్టమొదటి ఆరెస్ ఇది. ఇది కారు ముందు/వెనుక భాగం టార్క్ విభజన కై మరియూ రేర్ ఆగ్జల్ సైడ్ టార్క్ పంపిణీకై ట్విన్ ఎలక్ట్రానికల్లీ కంట్రోల్డ్ క్లచ్ ప్యాక్లని కలిగి ఉంటుంది.

ఆల్-వీల్ డ్రైవ్ మల్టిపల్ వెహికల్ సెసర్స్ ని 100 సార్లు సెకనుకి మానిటర్ చేసే విధంగా ఏర్పాటు చేయడం అయ్యింది. ఆప్టిమం డ్రైవింగ్ డైనమిక్స్ ని అందించేందుకు గాను కారులో అధునాతన ఎలక్ట్రానిక్ స్టబిలిటీ కంట్రోల్ ని మరియూ బ్రేక్-బేస్డ్ టార్క్ వెక్టరింగ్ కంట్రోల్ ని కలగలుపుకుని ఆల్ వీల్ డ్రైవ్ తో పాటు అందించబడుతుంది.

was this article helpful ?

Write your Comment on Ford ఫోకస్

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience