ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్లిఫ్ట్ వాహనం యునైటెడ్ స్టేట్స్ లో రహస్యంగా పట్టుబడింది.
డిసెంబర్ 21, 2015 09:57 am sumit ద్వారా ప్రచురించబడింది
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: ఫోర్డ్ ఎకో స్పోర్ట్ ఫేస్లిఫ్ట్ వాహనం యొక్క పరీక్ష యునైటెడ్ స్టేట్స్ లో రహస్యంగా జరుపబడింది. ఈ కారు ఒక కవరుతో కప్పబడి ఉంది. అందువల్ల దీని యొక్క మార్పులు పూర్తిగా గమనించడం సాద్యం కాలేదు.
2017 లో రాబోయే ఎకో స్పోర్ట్ ముందు భాగం దాచబడి ఉన్నప్పుడు అమెరికా కంపనీ ముందు గ్రిల్ ని నవీకరించుకొని రాబోతోంది అనే ఊహాగానాలు వినిపించాయి. దీని యొక్క గ్రిల్ ఫోర్డ్ ఎడ్జ్ యొక్క గ్రిల్ కి దగ్గరగా ఉన్నట్లు ఊహించారు. ఇందులో భాగంగానే కారు యొక్క హెడ్లైట్లు మరియు లోపలి భాగాలు కుడా మార్పు చెందబోతున్నాయి అనే పుకార్లు వినిపించాయి.
ఫోర్డ్ ఈ మద్యనే వాహనం యొక్క ద్వని నియంత్రించే ఒక పరికరాన్ని నాలుగు అంగుళాల కలర్ డిస్ప్లే తో పాటు నవీకరించారు. ఈ అమెరికన్ వెర్షన్ కారు యురోపియన్ వెర్షన్ కారులలాగా కాకుండా వెనుక ఒక వీల్ మౌంటెడ్ భాగంతో వస్తుంది . ఇంజిన్ కొద్దిగా నవీకరించుకునే అవకాశం ఉంది అదేమిటంటే ఫోర్డ్ తన మునుపటి పవర్ ట్రైన్ల కంటే ఎక్కువ సామర్ద్యం తో రాబోతోంది. దీనియొక్క ఎకో బూస్ట్ ఇంజిన్ 123 hp గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 1.5L పెట్రోల్ ఇంజిన్ 110hp శక్తిని మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ 99 hpశక్తిని ఇస్తుంది. కారు యొక్క ఎకో బూస్ట్ ఇంజిన్ 2016 సంవత్సరం ప్రారంబించే అవకాశం ఉంది.
ఎకోస్పోర్ట్ వాహనం క్రిట మరియు డస్టర్ లతో పోటీపడి భారత మార్కెట్ లో ఘన విజయం సాదించింది. ఈ రహస్యంగా పట్టుబడిన కారు మొట్టమొదట యునైటెడ్ స్టేట్స్ లోనే విడుదల చేయబడుతుంది అనే ఊహాగానాలు పెరిగాయి. దీని ప్రారంభం 2016 చివర్లో గాని లేదా 2017 మొదట్లో గాని ఉండవచ్చు.
ఇది కుడా చదవండి;