• English
  • Login / Register

ఫోర్డ్ డీలర్స్ వారి "ఫిగో ఆస్పయిర్" బుకింగ్ ప్రారంభం

ఫోర్డ్ ఫిగో 2015-2019 కోసం sourabh ద్వారా జూన్ 02, 2015 12:31 pm సవరించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: వచ్చే నెలలో ప్రారంభించనున్న కాంపాక్ట్ సెడాన్ ఫిగో ఆస్పయిర్ కోసం ఎంపిక చేసిన నగరాల్లో ఫోర్డ్ డీలర్స్ నుండి బుకింగ్ తీసుకోవడం మొదలు పెట్టారు. మేము ముంబై లో ఫోర్డ్ డీలర్స్ తో మాట్లాడినపుడు వారు బుకింగ్ కి ఇనీషియల్ పేమెంట్ రూ .50,000 నుండి మొదలు అని చెప్పారు. కారు ఇంకా విడుదల కావలసి ఉంది కాబట్టి, కారు యొక్క వాస్తవ ధర గురించి మాకు ఏ సమాచారం లేదు, ఒకవేళ వారు కారు కొనడం రద్దు చేసుకొవాలంటే వారికి మేము పూర్తి మొత్తం ఎమౌంట్ ని తిరిగి వారికే ఇచ్చేస్తాము అని డీలర్లు చెబుతున్నారు. ఫోర్డ్ ఫిగో ఆస్పయిర్ ఒక కాంపాక్ట్ సెడాన్, కాబట్టి దీని ధర పరిధి సుమారుగా,మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్, హోండా అమేజ్ మరియు హ్యుందాయ్ ఎక్సెంట్ వంటి ధరకి దగ్గరగా ఉంటుందని భావిస్తున్నారు .

ఫోర్డ్ కంపనీ వీలయినంత ముందుగా ఆస్పయిర్ సెడాన్ ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి బ్రాండ్ అంబాసిడర్ గా, 'ఒక బహుముఖ నటుడు, గాయకుడు మరియు ఏస్ దర్శకుడు' అయినటువంటి ఫర్హాన్ అక్తర్ అధికారికంగా సంతకం చేశారు.

కాంపాక్ట్ సెడాన్ కి లెక్కలేనన్ని విభాగాలు అమర్చి రూపొందించారు, డ్యూయల్ క్లచ్ , సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్అసిస్ట్, ఎస్ వై ఎన్ సి లింక్ ఇంకా మరెన్నో అధునాతన పరికరాలతో దీనిని తయారు చేసారు.

ఫిగో ఆస్పయిర్ కి ఎన్నో కొత్త రకాలయిన తాజ వర్షన్ లను జతకూర్చి రూపొందించారు,దీనిలో ఉన్నఎస్ వై ఎన్ సి యాప్ లింక్ అనుసంధాన వ్యవస్థ డ్రైవర్లు వారి ఫోన్ని కంట్రోల్ చేసే విషయం లోను, వినోదానికి మరియు ఉచిత సాధారణ స్వర ఆదేశాలు విని ఆనందించడానికి బాగాఉపయోగపడుతుంది. ఈ కొత్త ఫిగో ఆస్పయిర్ 1.5 లీటర్ టి డి సి ఐ డీజిల్ ఇంజిన్ మరియు 1.2 లీటర్ టి విసిటి పెట్రోల్ ఇంజిన్ తో తయారు చేయబడి మనకి అందుబాటులో ఉంది.

ఫిగో ఆస్పయిర్ తన ఏకైక ప్రకటన ప్రచారంతో, వాహన తయారీ సంస్థ 8 మందిని ఎంపిక చేసి వారికిఒక లక్ష రూపాయలు రివార్డ్ గా ప్రకటించింది.మొత్తం ప్రచారం లో భాగంగా 56 మంది పాల్గొనగా వారు సంతోషపడేలా వారికి ఆశ్చర్యకరమైన బహుమతులను మరియు వారి యొక్క వ్యక్తిగత అభిప్రాయాలను,అనుభవాలను సేకరించింది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Ford Fi గో 2015-2019

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience