• English
  • Login / Register

రూ.2.5 కోట్ల ఖరీదు గల ఇటాలియన్ సూపర్ కారు న్యూ ఢీల్లీ లో అగ్నికి ఆహుతి అయ్యింది!

ఆగష్టు 25, 2015 10:33 am అభిజీత్ ద్వారా సవరించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

ఈ మధ్య కాలంలో ఇటాలియన్ కారు తయారీదారి అయిన లాంబోర్ఘినీ వారు కొంత కాలంగా భారతదేశం లో ప్రమాదాలను చవి చూస్తున్నారు. ఒక నారింజ రంగు గెల్లార్డో నిప్పులో ద్వంశం అవడంతో ఆ కోవలోకి మరొక ప్రమాదం చేరింది. బదర్పుర్ ప్రాంతంలో కారు సర్వీసు చేయించుకుని తిరిగి ఇంటికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

ఇంజిను నుండి మంట రాజుకోవడం మొదలైన తరువాత కారు కి నిప్పు అంటుకుంది అని తెలియ వచ్చింది. అదృష్టవ శాత్తూ కారు ఓనరు తప్పించుకుని మంటలార్పే వారు వచ్చే లోగా కారు దగ్ధం అవుతూ ఉండగా నిస్సహాయంగా చూస్తూ ఉండవలసి వచ్చింది. ఫోటోల ఆధారంగా 5.2-లీటరు వీ10 మోటరు ఉండే ముందు ప్రాంతం మాత్రమే కాలినట్టు కనపడుతోంది. ఇవి బాగుచేయలేని విధంగా ద్వంశం అయ్యాయి. మళ్ళీ కారు రోడ్డు ఎక్కాలంటే, ఇక ఇటలీకి వెళ్ళాల్సిందే.

ఇది కాకుండా, ఇదే సంవత్సరం రాజధానిలో ఈ కార్లు ప్రమాదానికి గురి కావడంతో, అసలు ఇంజినుకి మంట ఎలా అంటుకుందో అనే సమీక్ష చేయవలసిన అవసరం ఉంది. ఈ ఘటన, తయారీదారి పైఅనే కాకుండా కారుని నడిపే వారి పైన కూడా సందేహాన్ని ఉత్పన్నం చేసింది.

ఇంకో ఘటనలో ఒక ప్రత్యేక గెల్లార్డో కొద్ది సంవత్సరాల క్రితం ఒక ప్రమాదానికి గురయ్యి ఆ డ్రైవరు మరణించాడు. ఇంకో సారి, హొటెల్ పార్కింగ్ లో కారుని పార్క్ చేయబోయిన వాలే డ్రైవరి దానిని గుద్ది వేశాడు. ఇంకో ఘటనలో డ్రైవరు ఇండియా గేటు వద్ద అదుపు తప్పి అతని ముర్సియేలాగో ని చెట్టు కి గూద్ది వేశాడు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience