• English
  • Login / Register

వోల్వో ఎస్90 సెడాన్ యొక్క తుది డిజైన్ బయట పడింది

ఆగష్టు 31, 2015 02:47 pm manish ద్వారా సవరించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: ఆన్లైన్ లో బయటపడిన ఒక మోడల్ కారు ఫోటోలు రాబోయే వోల్వో ఎస్90 లాగే కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది విడుదల సందర్భంగా ఈ కారుని విస్తృతంగా పరీక్షిస్తున్నారు. ఇది వోల్వో ఎస్80 ని బర్తీ చేసి మరియూ రూపం విషయం లో వోల్వో కాన్సెప్ట్ కూపే ని పోలి ఉంటుంది. 

ఎస్90 కి వోల్వో యొక్క చతురాస్రాకార గ్రిల్లు మరియూ ఒక పెద్ద బంపర్ ఉంది. వెడల్పాటి ఎయిర్ డ్యం చుట్టూరా క్రోము పూత కలిగి ఉంది. వోల్వో ఎస్60 సెడాన్ మరియూ ఎక్స్సీ90 మోడల్స్ యొక్క పోలికలు కూడా ఇందులో కనపడతాయి. 'థార్స్ హ్యామఋ శైలి ఎలీడీ డేటైం-రన్నింగ్ లైట్స్. అదె లైట్లు ఎక్సీ901 లో కూడా కనపడ్డాయి. 

కారుకి వాలు కలిగిన రూఫ్-లైన్ మరియూ వాలు వెనుక అద్దం రావడం తో కూపే వంటి స్టైలు అందింది. వెనుక అద్దాన్ని చూస్తే, లోపల అంతర్ఘతంగా సరిపడ చోటు ఉండేట్టుగా అనిపిస్తోంది. సీ-ఆకారపు టెయిల్-ల్యాంప్స్ ని ఈ కారు తాజా వోల్వో కాన్సెప్ట్ కార్ల ఆధారంగా పొందింది మరియూ దీర్ఘచతురస్రాకార ఎగ్సాస్ట్స్ ఉన్నాయి.

ఇంజిన్ల విషయం లో, ఎస్90 కి బహుశా కొత్త ఎక్స్సీ90 కి ఉన్న 2.0-లీటర్ ట్విన్ టర్బో ఫోర్-సిలిండర్ల డీజిల్ మోటరు కలిగి ఉండవచ్చు. కారుకి టీ8 హైబ్రీడ్ సిస్టం కూడా ఉండవచ్చు. పుకార్ల ప్రకారం, వోల్వో వారు ఎస్90 సెడాన్ ఆధారిత వీ90 వాగెన్ ని కూడా విడుదల చేయవచ్చు. ఈ వాగెన్ షోరూముల్లో ఎస్90 సెడాన్ ప్రపంచవ్యాప్తంగ విడుదల అయ్యాకా రావొచ్చును. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience