• English
  • Login / Register

ఫిగో ఆస్పైర్: ఫోర్డ్ కోసం ఒక కొత్త ప్రారంభం

ఫోర్డ్ ఆస్పైర్ కోసం అభిజీత్ ద్వారా ఆగష్టు 03, 2015 11:26 am ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: ఈ దేశంలో ఫోర్డ్ ద్వారా అందించబడిన చివరి గ్రాండ్ ఉత్పత్తి ఫోర్డ్ ఈకోస్పోర్ట్. ఈ ఈకోస్పోర్ట్, ఫోర్డ్ కు సరైన సమయంలో వచ్చింది. ఇది గొప్ప ఉత్పత్తి కూడా. దీని పాత శ్రేణి లో ఉన్న ఫియస్టా అంత ఆకర్షించే విధంగా లేదు. ఈ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ప్రీ బుకింగ్స్ ఇవ్వబడ్డాయి. దీని వలన అమెరికన్ అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది. ఈ కాంపాక్ట్ ఎస్యువి లో ఈ ఈకోస్పోట్ కారే ఆదిపత్యత వహించడం వలన, డస్టర్ కు కళ్ళం వేయగలిగింది. ఈ 2015 వ సంవత్సరం లో ఫోర్డ్, భారతదేశంలో అనేక కొత్త కొత్త ఉత్పత్తులతో రాబోతుంది. దీనిలో మొదటిగా, ఫిగో అస్పైర్, తరువాత నెక్స్ట్ జనరేషన్ ఫిగో, కొత్త ఎండీవర్ చివరిగా ఐకానిక్ ముస్టాంగ్.   

కానీ, అది ద్రవ్యరాశి పరిమాణ విభాగంలో, ఫోర్డ్ మాత్రం అస్పైర్ పైన మాత్రమే దృష్ట్టి సారిస్తుంది. ఈ సంస్థ నుండి ఉత్పత్తి అయిన మొట్టమొదటి కాంపాక్ట్ సెడాన్, ఫిగో అస్పైర్. ఇదే మొట్టమొదటిది అవ్వడం వలన ఈ సంస్థకు అంచనాలు ఎక్కువగా ఉంటాయి.


ఈ కారు, కొన్ని ఎంపిక చేయబడ్డ డీలర్షిప్ల వద్దకు రివ్యూ కొరకు చేరుకుంది మరియు టెస్ట్ డ్రైవ్ కోసం బుకింగ్స్ మాత్రం అందుబాటులో లేవు. ఈ కారుని ఆగస్ట్టు 7 నుండి 10 మద్య లో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని బావిస్తున్నారు. ఫిగో ఆస్పైర్ కావలసిన కీర్తిని అందుకుంటూ ఉంది. 

ఈ కొత్త ఫిగో అస్పైర్, ఫోర్డ్ తాజా డిజైన్ వేదాంతం ఆధారంగా రాబోతుంది. ఈ డిజైన్ ను ఫియస్టా ఫేస్లిఫ్ట్ లో చూడవచ్చు. ఈ ఫోర్డ్ ఫియస్టా లో ఉన్న ముందరి భాగం లాగే ఇప్పుడు అస్పైర్ యొక్క ముందరి భాగం కూడా ఉండబోతుంద్. అయితే ఈ వాహనం కాంపాక్ట్ లుక్ ను కలిగి ఉంటుంది. ఈ వాహనం స్థూలమైనది కాదు. కానీ, దీని ముందరి భాగం పొట్టిగా మందంగా ఉన్నప్పటికీ సన్నగా ఉండబోతుంది. ఈ కారు ప్రక్క భాగంలో మరియు క్రింది భాగంలో సూక్ష్మ లైన్లతో రాబోతుంది. ఈ వాహనం, బూట్ నుండి వెనుక ప్రయాణీకుల విండ్స్క్రీన్ వరకు సజావుగా కనబడుతుంది. అప్పుడు వెనుక డోర్ యొక్క ఫ్రంటల్ భాగం లో విలీనం అయిపోతుంది. ఈ అస్పైర్ యొక్క బూట్ లిడ్ చాలా క్లీన్ గా ఉంటుంది మరియు క్రోమ్ గార్నిష్ అగ్రస్థానంలో, ఎక్కువ మొత్తం లో వెడల్పుగా విస్తరించబడి ఉంటుంది. వెనుక భాగంలో ఇరువైపులా టైల్ లైట్స్ టైలలిట్ క్లస్టర్ లో అమర్చబడి ఉంటాయి మరియు లుక్ పరంగా చెప్పాలంటే, రూబీ ఎరుపు రంగు తో అత్యుత్తమంగా కనిపిస్తోంది. దీనిలో ముఖ్యంగా చెప్పదలచుకున్నది ఏమనగా, ఫోర్డ్ యొక్క అన్ని వాహనాలలో ఉండే కామన్ ఫేచర్ దీనిలో లేదు. అది ఏమిటంటే, వీల్ ఆర్చెస్. ఈ ఫిగో అస్పైర్ లో వీల్ ఆర్చెస్ లేకపోవడం. అంతేకాకుండా, ఈ సంస్థ యొక్క డిజైనర్లు ఈ వాహనం యొక్క సైడ్ ప్రొఫైల్ ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. 

"ఈ వాహనం యొక్క బూట్ వ్యాశార్ధం 359 లీటర్లు, ఇది చాలా తక్కువ అని చెప్పవచ్చు, మరియు లోపల నుండి బూట్ ను తెరవడానికి సదుపాయం ఉంది."

ఈ వాహనం యొక్క అంతర్గత భాగాలను గమనించినట్లైతే, లోపలి నుండి కూడా ఈ వాహనం కాంపాక్ట్ సెడాన్ లా కనిపించబోతుంది. అంతేకాకుండా, ఈ వాహనం లో ఖచ్చితత్వం కలిగిన రూమీ నేచర్ ను కలిగి ఉంటుంది మరియు ఈ వాహనం లో గల సీట్లు ఎర్గొనోమికల్ గా పొందుపరచబడి ఉంటాయి. లోపలి భాగాలను గనుక చూసినట్లైతే, సింక్ స్క్రీన్ ను చూడవచ్చు (ఈ వాహనం యొక్క దిగువ శ్రేణి వేరియంట్ లలో ఫోర్డ్ మైడాక్ స్మార్ట్ ఫోన్ డాకింగ్ పాయింట్ ను గమనించవచ్చు), దీని క్రింది భాగంలో సెంట్రల్ కన్సోల్ బిగించబడి ఉంటుంది. క్రోమ్ ఏసి నియంత్రణ, లేదా ఏసి ప్రియుల కోసం అవి నిలువుగా ఇరువైపులా అమర్చబడి ఉంటాయి. ఇటువంటి విషయాలు ఫోర్డ్ లో గమనించవచ్చు. కానీ, కాంపాక్ట్ సెడాన్ లో గమనించలేము. అంతేకాక, అనేక నిల్వ ఖాళీలు పుష్కలంగా ఉన్నాయి. దీనిలో భాగంగాముందరి వైపు సైడ్ బాటిల్ హోల్డర్స్. దీనిలో 1.5 లీటర్ వాటర్ బాటిల్స్ ను ఉంచవచ్చు. అంతేకాకుండా, ఇరువైపులా కూడా సోడా యొక్క క్యాన్ లను కూడా పొందుపరచవచ్చు. వెనుక సీట్లు తగినంత గది ఉంటుంది మరియు దాని పోటీదారుల తో పోలిస్తే వాటి కంటే మెరుగైనది గా ఉంటుంది. దీని యొక్క బూట్ స్పేస్ 359 లీటర్లు, ఇది అంత ఆకర్షణీయంగా లేదు. కానీ, దీనిని లోపలి నుండి బూట్ ను తెరవడానికి సదుపాయాన్ని కలిగి ఉంటుంది.

ఈ అస్పైర్ మూడు ఇంజన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. అవి వరుసగా, 1.2 లీటర్ టి వి సి టి పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ అత్య్యధికంగా, 88 పిఎస్ పవర్ ను విడుదల చేస్తుంది. రెండవది, 1.5 లీటర్ టి డి సి ఐ డీజిల్ ఇంజన్, ఈ ఇంజన్ అత్యధికంగా 100 పిఎస్ పవర్ ను విడుదల చేస్తుంది. మూడవది 1.5 లీటర్ టి వి సి టి పెట్రోల్ ఇంజన్, ఈ ఇంజన్ అత్యధికంగా 112 పిఎస్ పవర్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మొదటి రెండు ఇంజన్ లు భారతదేశం లో అందిస్తున్నారు. ముడవ ఇంజన్ విషయానికి వస్తే, సనంద్ గుజరాత్ నుండి తీసుకోబడినది. ఈ రెండు కార్లతో పాటు 1.5 లీటర్ టి వి సి టి ఇంజన్ ను కలిగి ఉన్న వాహనాన్ని కూడా ఇదే సంస్థ నుండి ఎగుమతి చేయబడుతుంది. అంతేకాకుండా, ఫోర్డ్ లో ఈ ఫోర్డ్ అస్పైర్ అనేది ఒక స్పోర్టియర్ వెర్షన్ అని చెప్పవచ్చు.

ఇది చివరిగి కాదు, ఆస్పైర్ అధిక బలం కలిగిన స్టీల్ మోనోకోక్యూ తో తయారు చేయబడింది మరియు శ్రేణిలో అన్ని వేరియంట్ లు ప్రమాణంగా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ తో అందుబాటులో ఉన్నాయి. ఈ వాహనాల అగ్ర శ్రేణి వేరియంట్ లు అయిన డీజిల్ మరియు పెట్రోల్ రెండు  వేరియంట్ లలో ఆరు ఎయిర్బ్యాగ్స్ ప్రామాణికంగా అందించబడ్డాయి. ఈ సిరీస్ యొక్క 1.5 లీటర్ టి వి సి టి వేరియంట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈ ఎస్ పి), హిల్ లాంచ్ అసిస్ట్ (హెచ్ ఎల్ ఏ) మరియు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (టిసిఎస్)  వంటి అదనపు భద్రతా లక్షణాలను కలిగి ఉంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Ford ఆస్పైర్

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience