• English
    • లాగిన్ / నమోదు

    అక్టోబర్ 19 న అబార్త్ పుంటో ఈవో ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్న ఫియాట్ సంస్థ

    అక్టోబర్ 09, 2015 04:03 pm raunak ద్వారా ప్రచురించబడింది

    20 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    ఫియాట్ సంస్థ 145bhp శక్తిని అందించే అబార్త్ పుంటో ఈవో తో  దేశంలో అన్ని హ్యాచ్బ్యాక్ ల యొక్క తలరాత మార్చేందుకు సిద్ధంగా ఉంది. 

    జైపూర్: ఫియట్ సంస్థ సాధారణ పనితీరు కంటే ఎక్కువ పనితీరు గల కారుని దేశంలో మొదటిసారిగా ప్రారంభిస్తుంది. ఇటాలియన్ తయారీసంస్థ 595 కాంపిటిజోన్ తో అబార్త్ బ్రాండ్ విడుదల చేసింది. అయితే, బహుశా అబార్త్ పుంటో ఈవో దేశంలో అత్యుత్తమ పనితీరుని అందించే కారు అయ్యుండవచ్చు. ఫియట్ 10 లక్షల కంటే తక్కువ ధర పరిధిని అందించవచ్చు మరియు  గణనీయంగా తక్కువ శక్తివంతమైన విడబ్లు పోలో జిటి టిఎసై మరియు ఫోర్డ్ ఫిగో 1.5 లీటర్ టి-విసిటి తో పోల్చి చూస్తే పోటీగా ఉండవచ్చు. అంతేకాక, ఫియాట్ సంస్థ పుంటో ఈవో ప్రారంభం తరువాత, అబార్త్ అవెంచురా ని కూడా త్వరలో ప్రారంభిస్తుంది. అవెంచురా కూడా పుంటో ఈవో లో ఉన్నటువంటి మోటార్ తో మరియు అదే ట్యూనింగ్ వస్తుంది. 

    అబార్త్ పుంటో ఈవో వివరణలు కొద్ది రోజుల క్రితం గుప్పుమన్నాయి. ఈ హ్యాచ్  0-100 కిలోమీటర్లు 8.8 సెకెన్లలో చేరుకోగలదు. 1.4 లీటర్ టి-జెట్ టర్బో ఇంజిన్ 145bhp శక్తిని మరియు  212Nm టార్క్ ని అందిస్తుంది. ఈ వాహనం 16.3Kmpl మైలేజ్ ని కూడా అందిస్తుందని నివేదిక పేర్కొంది. గతంలో బహిర్గతం అయిన సమయంలో, కారు రైడ్ ఎత్తును తఅక్కువగా ఉంటుంది మరియు దీని గ్రౌండ్ క్లియరెన్స్ 155 మిల్లీమీటర్లు అని సంస్థ తెలిపింది. వాహనం 16 అంగుళాల అబార్త్ తేలు ఆకారపు అలాయి తో ఉంది. 

    was this article helpful ?

    Write your Comment on Abarth పుంటో EVO

    ట్రెండింగ్‌లో ఉంది కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    *న్యూ ఢిల్లీ లో ఎక్స్-షోరూమ్ ధర
    ×
    మీ అనుభవాన్ని అనుకూలీకరించడానికి మాకు మీ నగరం అవసరం