డిసెంబర్ 1 న ముంబై లో ఫెరారీ యొక్క కొత్త అవుట్లెట్ ప్రారంభోత్సవం
ఫెరారీ కాలిఫోర్నియా కోసం nabeel ద్వారా నవంబర్ 30, 2015 02:49 pm ప్రచురించబడింది
- 13 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
ఫెరారీ అను బ్రాండ్, ఇప్పుడు కొన్ని దశాబ్దాలుగా ఆటోమోటివ్ ప్రపంచ లో ఉన్న ఉన్నత వర్గానికి నిర్వచనాత్మకంగా ఉంది మరియు భారతదేశం లో వారి పునః ప్రవేశం తో ఫెరారీ, సమర్థవంతమైన కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షించింది. మొదట్లో ఈ ఫెరారీ, రెండు కేంద్రాలతో ఢిల్లీలో మాత్రమే ఏర్పాటు చేశారు కానీ ఇప్పుడు తమ భారత నెట్వర్క్ను విస్తరించేందుకు నిర్ణయించింది. వారి యొక్క కొత్త డీలర్షిప్ ను డిసెంబర్ 1, 2015 న ముంబై లో ప్రారంభించనుంది. ఈ అవుట్లెట్, ఒక ల్యాండ్ రోవర్ షోరూమ్ ముందు ఉన్న బాంద్రా కుర్లా కాంప్లెక్స్, వద్ద ఉంది. ఈ అవుట్లెట్, మొత్తం ఫెరారీ భారతదేశ వాహనాల పరిధిని ప్రదర్శించడానికి 3,000 చదరపు సౌకర్యాన్ని కలిగి ఉంది. నవ్నిత్ మోటార్లు, ఫెరారీ యొక్క ముంబై పంపిణీదారుడు మరియు ఈ సౌకర్యం యజమానులు అయిన వాద్వా గ్రూపుతో లీజు ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ షోరూమ్, ఫెరారీ కాలిఫోర్నియా టి (రూ 3.45 కోట్లు), ఫెరారీ 488 జిటిబి (రూ 3.99 కోట్లు), ఫెరారీ 458 స్పైడర్ (రూ 4.22 కోట్లు), ఫెరారీ 458 స్పెషల్ (రూ 4.40 కోట్లు), ఫెరారీ ఎఫ్12 బెర్లినెట్టా (రూ 4.87 కోట్లు) వంటి ఫెరారీ వాహనాలను ప్రదర్శిస్తోంది. ఈ ధరలు అన్నియూ కూడా ఎక్స్-షోరూమ్ ధరలు మరియు ఆఖరి రేట్లు, కస్టమైజేషన్ స్థాయి పై ఆధారపడి నిర్ణయించబడతాయి.
ఫెరారీ యొక్క కొత్త వేరియంట్ అయిన కాలిఫోర్నియా టి వేరియంట్, రూ. 3.45 కోట్ల ఎక్స్ షోరూం ఢిల్లీ వద్ద ఆగష్టు 26, 2015 న భారతదేశంలో ప్రవేశపెట్టబడింది. ఈ వాహనం, ఒక వేరియబుల్ బూస్ట్ నిర్వహణ వ్యవస్థ తో పాటు 3.9 లీటర్ బై టర్బో వి8 ఇంజన్ తో జత చేయబడి ఉంటుంది మరియు ఈ ఇంజన్, అత్యధికంగా 552 బి హెచ్ పి పవర్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.