ముంబై లో కొత్త డీలర్షిప్ తెరిచిన ఫెరారి సంస్థ
డిసెంబర్ 03, 2015 05:26 pm arun ద్వారా ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ముంబాయి:
కావాలినో రాంపాంటే, బాంద్రా కుర్లా కాంప్లెక్స్ వద్ద దాని అధికారిక డీలర్షిప్ తెరవడం ద్వారా కలల నగరంలోకి వెళ్తుంది. ఈ కొత్త షోరూం ముంబై లో ఫెరారీ యొక్క ఒకే ఒక అధికారిక డీలర్షిప్ అవుతుంది. ఈ స్టేట్ ఆఫ్ ద్ ఆర్ట్ ఫెరారి షోరూం బీకేసీ లో ప్లాటినా బిల్డింగ్ లో సుమారు 4000 చదరపు అడుగులతో G2 వద్ద లొకేట్ చేయబడింది.
ఫెరారీ Spa కమర్షియల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఎన్రికో గలేరా మాట్లాడుతూ " మేము ముంబాయి లో అనేక నమ్మకమైన యజమానులను మరియు ఫెరారీ అభిమానులను కలిగి ఉన్నాము. ఈ కొత్త షోరూం అభిమానులను ఐకానిక్ బ్రాండ్ కి దగ్గర చేస్తుంది. లగ్జరీ కార్ల మార్కెట్లో గొప్ప అనుభవం తో, నావింట్ మోటార్స్ ఈ ప్రాంతంలో భాగస్వామ్యంగా ఉండేందుకు మా ఇష్టపడే ఎంపిక మరియు మా కస్టమర్ బేస్ పెరగడంలో మా భాగస్వామ్యులు సహాయపడతారని చాలా నమ్మకంగా ఉన్నాము." అని వివరించారు.
ప్రారంభం గురించి నావింట్ మోటార్స్ ప్రైవేట్.లిమిటెడ్, మిస్టర్ శరద్ కచేలియా మాట్లాడుతూ " మేము ముంబై లో ఫెరారి యొక్క మొదటి షోరూం ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉన్నాము. ఫెరారీ యొక్క లెగసీ ని మనస్సులో ఉంచుకొని, మా వినియోగదారుల అంచనాలను నెరవేర్చే విధంగా ప్రతీ మార్గంలోని ప్రయత్నిస్తాము. ఈ షోరూం అసాధారణమైన కొనుగోలు అనుభవంతో కొత్త కార్లు అమ్మకాలు మరియు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందిస్తుంది." అని పేర్కొన్నారు.
ఈ షోరూం కాలిఫోర్నియా T (రూ. 3.45 కోట్లు), 488 GTB (రూ .3.99 కోట్లు), 458 స్పైడర్ (రూ. 4.22 కోట్లు), 458 స్పెషల్ (రూ . 4.40 కోట్లు) మరియు F12 బెర్లినెట్టా (రూ . 4.87 కోట్లు) కు స్థావరంగా ఉంది. ఈ షోరూం మూడు కార్ల వరకు సదుపాయాన్ని అందించగలదు. కొత్త ఫెరారి ని సపోర్ట్ చేసేందుకు ఇది ఒక మంచి స్థలం. నావింట్ గ్రూప్ ఫెరారీ డీలర్షిప్ ని దక్కించుకున్న కారణంగా మరింత బలాన్ని చేకూర్చుకుంది. నావింట్ క్రింద రోల్స్ రాయిస్, జాగ్వార్, BMW మరియు మినీ బ్రాండ్స్ కూడా ఉన్నాయి.
ఇంకా చదవండి
0 out of 0 found this helpful