ఉరుస్ Sగా పరిచయo చేయనున్న నవీకరించబడిన లంబోర్ఘిని SUV

లంబోర్ఘిని ఊరుస్ కోసం shreyash ద్వారా ఏప్రిల్ 14, 2023 02:24 pm ప్రచురించబడింది

 • 47 Views
 • ఒక వ్యాఖ్యను వ్రాయండి

నిలిపివేస్తున్న సాధారణ ఉరుస్‌తో పోలిస్తే ఉరుస్ S మరింత శక్తివంతమైనదిగా మరియు స్పోర్టియర్‌గా కనిపిస్తున్నపటికి పెర్ఫార్మంటే వేరియెంట్ కంటే దిగువ స్థానంలోనే ఉంది 

Lamborghini Urus S

 • ఉరుస్ ఇప్పుడు రెండు వేరియెంట్ؚలలో లభిస్తోంది: S మరియు పెర్ఫార్మంటే

 • 4.0-లీటర్ V8 టర్బో చార్జెడ్ పెట్రోల్ ఇంజన్ؚతో వస్తుంది, ఇది ప్రస్తుతం 666PS పవర్ మరియు 850Nm టార్క్‌ను అందిస్తుంది. 

 • ఆఫ్-రోడ్ డ్రైవ్ మోడ్ؚలతో ఆల్-వీల్-డ్రైవ్ (AWD) సిస్టమ్ؚను కలిగి ఉంది. 

 • ఉరుస్ పెర్ఫార్మంటే విధంగా కాకుండా, ఉరుస్ S యాక్టివ్ ఎయిర్ సస్పెన్షన్ సిస్టమ్ؚతో వస్తుంది. 

 • కొత్త బంపర్ మరియు అదనపు వెంట్ؚలతో కొత్త బోనెట్‌పై డిజైన్ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.  

 • ఉరుస్ S ధర రూ.4.18 కోట్లుగా ఉంది (ఎక్స్-షోరూమ్). 

లంబోర్ఘిని ఉరుస్ పెర్ఫార్మంటేని 2022 నవంబర్‌లో భారతదేశంలో ప్రవేశపెట్టింది, ప్రస్తుతం, దాదాపు నాలుగు నెలల తరువాత, ఈ సూపర్ కారు తయారీదారు ఉరుస్ Sను విడుదల చేసింది. దీని ధర రూ.4.18 కోట్లుగా (ఎక్స్-షోరూమ్) ఉంది. ఇది సాధారణ ఉరుస్ స్థానంలో వస్తున్న నవీకరించిన సూపర్ SUV ఎంట్రీ-లెవెల్ వర్షన్. ఉరుస్ పెర్ఫార్మంటేకు సమానమైన అవుట్ؚపుట్ؚను అందించే మెరుగైన పవర్‌ట్రెయిన్ؚతో వస్తుంది. కొత్త SUV గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు. 

ఎక్స్ؚటీరియర్ డిజైన్

Lamborghini Urus S

పెర్ఫార్మంటే సహచర వాహనం విధంగానే, ఉరుస్ S ముందు వైపు తేలికపాటి డిజైన్ మార్పులతో వస్తుంది. పేయింట్ చేసిన స్టెయిన్‌లెస్ స్టీల్ స్కిడ్ ప్లేట్ؚతో సవరించిన మాటే ఫ్రంట్ బంపర్ؚను కలిగి ఉంది, అలాగే మెరుగైన ఏరోడైనమిక్ సామర్ధ్యం కోసం ముందరి వీల్స్‌పై ఎయిర్ వెంటింగ్ ఫిన్ؚలు కూడా ఉన్నాయి. పెర్ఫార్మంటేలో ఉన్న విధంగానే ఉరుస్ S బోనెట్‌లో మాటే బ్లాక్ ఎయిర్ వెంట్ؚలు ఉన్నాయి. 

Lamborghini Urus S Alloy Wheels

ప్రొఫైల్ గురించి చెప్పాలంటే, ఉరుస్ 21-అంగుళాల ఆలాయ్ వీల్స్‌తో ప్రామాణికంగా వస్తుంది, కానీ ఈ సూపర్ కారు తయారీదారు 22-అంగుళాలు మరియు 23-అంగుళాల ఆలాయ్ వీల్స్‌ను ఎంపికలుగా అందిస్తున్నారు. మునుపటి ఉరుస్ కంటే మరింత క్రమబద్ధీకరించిన కొత్త వెనుక బంపర్‌తో వస్తుంది. అయితే, ఇందులో పొడిగించిన వెనుక స్పాయిలర్ లేదు, ఇది ఉరుస్ పెర్ఫార్మంటేలో ఉంది. 

ఇది కూడా చదవండి: ఏప్రిల్ 2023లో విడుదలకు సిద్దం కానున్న 5 కార్‌లు

వీటి భంగిమను బట్టి కూడా వాటి మధ్య తేడాని గమనించవచ్చు, పెర్ఫార్మంటే ఉరుస్ S కంటే 20మిమీ తక్కువ ఉంటుంది. దీనికి కారణం రెండు మోడ్ؚలలో ఉపయోగించిన విభిన్న సస్పెన్షన్ సిస్టమ్ؚలు. రెండిటిలో ఉరుస్ S మరింత సౌకర్యవంతమైన వర్షన్, మరొక వైపు పెర్ఫార్మంటే మరింత స్పోర్ؚటియర్ రైడ్ మరియు నిర్వహణ కోసం క్రిందికి దించిన, బిగించిన స్టీల్ స్ప్రింగ్ సస్పెన్షన్ సిస్టమ్ؚను కలిగి ఉంది. 

లోపలి భాగం

Lamborghini Urus S Cabin

ఇంటీరియర్ లేఅవుట్ మునుపటి ఉరుస్ విధంగానే ఉంటుంది, కానీ కొత్త చాక్లెట్ బ్రౌన్ డ్యాష్‌బోర్డ్ థీమ్ؚను కలిగి ఉంది, ఇది లెదర్ అప్హోల్ؚస్ట్రీతో మ్యాచ్ అవుతుంది. కారు డ్యాష్‌బోర్డ్ మరియు కన్సోల్ పరిచితమైన స్క్రీన్ లేఅవుట్ؚలను కలిగి ఉంటాయి కానీ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే మరియు టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ రెండిటి పైనా నవీకరించిన గ్రాఫిక్స్ ఉన్నాయి. అసలైన ఉరుస్ మోడల్ؚలో చూసినట్లు క్లైమెట్ కంట్రోల్ ఫంక్షన్‌ల కోసం మూడవ డిస్ప్లే కూడా టచ్ؚస్క్రీన్‌ను ఉపయోగించారు. లంబోర్ఘిని సొంత అప్లికేషన్‌తో, ఈ సూపర్ SUV కార్ లొకేషన్ ఫైండర్ మరియు జియో-ఫెన్సింగ్ వంటి కనెక్టెడ్ నావిగేషన్ ఫీచర్‌లను అందిస్తుంది. 

మెకానికల్స్ మరియు పవర్ؚట్రెయిన్ 

Lamborghini Urus S Multi-Drive Mode Selector Console

ఉరుస్ S కూడా పెర్ఫార్మంటే విధంగానే 4.0-లీటర్ టర్బో చార్జెడ్ V8 పెట్రోల్ ఇంజన్ؚతో వస్తుంది ఇది 666PS మరియు 850Nm టార్క్ؚను అందిస్తుంది. ఈ యూనిట్ 8-స్పీడ్‌ల ఆటోమ్యాటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది, మొత్తం నాలుగు వీల్స్‌కు ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ ద్వారా శక్తిని అందిస్తుంది. రిఫరెన్స్ కోసం, క్రింది పట్టికలో ఉరుస్ S సాంకేతిక స్పెసిఫికేషన్‌లను ఉరుస్ పెర్ఫార్మంటేతో పోల్చాము. 

స్పెసిఫికేషన్‌లు

ఉరుస్ S

ఉరుస్ పెర్ఫార్మంటే

పవర్/టార్క్

666PS మరియు 850Nm

666PS మరియు 850Nm

ట్రాన్స్ؚమిషన్

8-స్పీడ్ ఆటోమ్యాటిక్ 

8-స్పీడ్ ఆటోమ్యాటిక్ 

యాక్సెలరేషన్ (0-100kmph)

3.5 సెకన్‌లు

3.3 సెకన్‌లు

అధిక స్పీడ్ 

305kmph

306kmph

కర్బ్ బరువు 

2,197kg

2,150kg

పెర్ఫార్మంటే కార్బన్ ఫైబర్ కాంపొనెంట్ؚలు దీనిని ఉరుస్ S కంటే 47కిలోలు తేలికగా ఉంచుతాయి దీని వలన పనితీరు మెరుగుపడింది. సున్నా నుండి 100kmph వేగాన్ని ఉరుస్ S, పెర్ఫార్మంటే కంటే 0.2 సెకన్‌లు నెమ్మదిగా ఉంటుంది. 

ఇది కూడా చదవండి: సల్మాన్ ఖాన్ కొత్త చిత్రంలో అనేక బ్లాక్ SUVలను చూడవచ్చు 

ధర & పోటీదారులు

Lamborghini Urus S Rear

లంబోర్ఘిని, ఉరుస్ Sను రూ.4.16 కోట్ల ధరతో (ఎక్స్-షోరూమ్) విక్రయిస్తుంది. దీని స్పోర్టియర్ వర్షన్ ఉరుస్ పెర్ఫార్మంటే ధర రూ.4.22 కోట్లుగా ఉంది (ఎక్స్-షోరూమ్). ఇది పోర్స్చే కయేన్ టర్బో, ఆడి RS Q8 మరియు మెర్సెడెస్ బెంజ్ GLE 63 S వంటి వాటితో పోటీ పడుతుంది. 

ఇక్కడ మరింత చదవండి: ఉరుస్ ఆటోమ్యాటిక్ 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన లంబోర్ఘిని ఊరుస్

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

 • లేటెస్ట్
 • రాబోయేవి
 • పాపులర్
×
We need your సిటీ to customize your experience