Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

మారుతి జిమ్నీ సమ్మిట్ సీకర్ యాక్సెసరీ ప్యాక్‌ను ఈ 8 చిత్రాలలో వీక్షించండి

మారుతి జిమ్ని కోసం tarun ద్వారా మే 25, 2023 07:21 pm ప్రచురించబడింది

మీ జిమ్నీ మరింత స్టైల్‌గా కనిపించడానికి, ఎక్కువ లగేజీని ఉంచదానికి మరియు మరింత సౌకర్యాన్ని జోడించడానికి యాక్సెసరీలను కొనుగోలు చేయవచ్చు

మారుతి జిమ్నీ కొనుగోలుదారులలో అనేక మంది ఇప్పటికే తమ కొత్త జీవనశైలి ఆఫ్-రోడర్ؚను అలంకరించాలని కోరుకోవచ్చు. మార్పులు చేయడానికి మీ స్థానిక స్టోర్‌కు వెళ్ళే ముందు, మారుతి సుజుకి నుండి నేరుగా కొనుగోలు చేయగల కొన్ని యాక్సెసరీలను చూడండి. జిమ్నీ విడుదలకు ముందు మారుతి, సమ్మిట్ సీకర్ అని పిలిచే యాక్సెసరీ ప్యాక్ؚను ప్రదర్శించింది.

View this post on Instagram

A post shared by CarDekho India (@cardekhoindia)

యాక్సెసరీలతో వస్తున్న ఈ ప్రత్యేక జిమ్నీ వర్షన్ విడుదల అయిన ప్రకాశవంతమైన పసుపు రంగులో ఫినిషింగ్ తోనే వస్తుంది, అయితే మరింత దృఢమైన లుక్ కోసం అనేక అనుకూలీకరణలను పొందింది.

ముందు వైపు, బలమైన మెటల్ లుక్ؚను కలిగించేలా స్కిడ్ ప్లేట్‌పై స్టైల్ؚగా ఉన్న అలంకరణను కలిగి ఉంది.

జిమ్నీ బాడీ క్లాడింగ్‌ను ప్రామాణికంగా పొందుతుంది, అయితే యాక్సెసరీలలో భాగంగా మీరు అదనపు డోర్ క్లాడింగ్ؚను పొందవచ్చు. ‘జిమ్నీ’ అని రాసి ఉన్న ముదురు క్రోమ్ అలంకరణను కూడా పొందుతుంది. అంతేకాకుండా, పర్వతాలలో కూడా జిమ్నీ మెరుగైన అనుభూతిని అందిస్తుంది అని సూచించే విధంగా, స్టిక్కర్‌లను కూడా పొందింది.

ఈ సమ్మిట్ సీకర్ ప్యాక్‌లో డోర్ వైజర్ మరియు ORVM అలంకరణను కూడా ఉన్నాయి.

ఇది కూడా చదవండి: మారుతి జిమ్నీ Vs మహీంద్రా థార్ పెట్రోల్ – ఇంధన సామర్ధ్య గణాంకాల పోలిక

వెనుక వైపు, బూట్ؚకు అమర్చిన స్పేర్ వీల్ కవర్ కోసం లుక్ పరంగా మరొక అలంకరణ సెట్ కూడా వస్తుంది. అయితే, ఇది సమ్మిట్ సీకర్ ప్యాక్ؚలో భాగం కాదు.

ఇందులో భాగంగా వచ్చే మరొక యాక్సెసరీ, రూఫ్ రైల్స్ؚతో రూఫ్ؚకు అమర్చిన లగేజ్ ర్యాక్.

రూఫ్ రైల్స్ నుండి విడతీసేలా కనిపిస్తున్న ఈ టెంట్/కానొపీని కూడా కొనుగోలుదారు పరిశీలించాలి. ఈ సెట్అప్ؚతో, మీరు వాతావరణంతో సంబంధం లేకుండా సరైన క్యాంపింగ్ అనుభవాన్ని పొందవచ్చు.

అలంకరణలు మరియు సిల్ ప్లేట్ؚతో క్యాబిన్ؚను కూడా మరింత స్టైలిష్ؚగా మార్చవచ్చు. పై చిత్రంలో ఉన్న విధంగా విభిన్న సీట్ కవర్ؚలను ఎంచుకోవచ్చు. ఇది నలుపు మరియు గోధుమ రంగు థీమ్ؚలో లెదర్ అప్ؚహోల్ؚస్ట్రీతో కవర్ చేయబడింది. గోధుమ రంగు మరియు నలుపు రంగు సీట్ కుషన్ؚలను కూడా చూడవచ్చు.

యాక్సెసరీలు మరియు సమ్మిట్ సీకర్ ప్యాక్ؚల ధరలను ప్రస్తుతానికి వెల్లడించలేదు, ఈ యాక్సెసరీలు మీ జిమ్నీ ధరకు రూ. 70,000 వరకు అదనపు ఖర్చును జోడిస్తాయని అంచనా.

జిమ్నీకి 105PS పవర్ అందించే 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్, 4WD ప్రామాణికంగా ఉంటుంది. ట్రాన్స్ؚమిషన్ ఎంపికలలో 5-స్పీడ్ మాన్యువల్ మరియు 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమ్యాటిక్ ఉంటాయి. ఈ ఆఫ్-రోడర్ ధర సుమారు రూ.10 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ఉండవచ్చని అంచనా, ఇది జూన్ 2023 ప్రారంభంలో విడుదల కావొచ్చు.

Share via

Write your Comment on Maruti జిమ్ని

explore మరిన్ని on మారుతి జిమ్ని

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
కొత్త వేరియంట్
Rs.11.11 - 20.42 లక్షలు*
కొత్త వేరియంట్
కొత్త వేరియంట్
Rs.15.50 - 27.25 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.15 - 26.50 లక్షలు*
కొత్త వేరియంట్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర