చాలా స్పష్టంగా బయటకు వచ్చిన హ్యుందాయ్ క్రెటా రహస్య చిత్రాలు
హ్యుందాయ్ క్రెటా 2015-2020 కోసం raunak ద్వారా జూన్ 24, 2015 06:15 pm ప్రచురించబడింది
- 11 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
2015 యొక్కఅత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న కారు హ్యూందాయ్ క్రెటా అని నిస్సందేహంగా చెప్పవచ్చు. వచ్చే నెల దీని ఆవిష్కరణ ఉంది, అయితే దానికంటేముందే ఇక్కడ రాబోయే ఈ కొరియన్ కాంపాక్ట్ ఎస్ యువి యొక్క స్పష్టమైన మరియు ప్రత్యేకమైన రహస్య చిత్రాలను ఇక్కడ చిత్రీకరించారు.
జైపూర్: హ్యుందాయ్ ఇండియా కాంపాక్ట్ ఎస్ యువి విభాగంలో క్రెటా తో ప్రవేశించబోతుంది. మరియు నివేదిక ప్రకారం ఈ వాహనాన్ని వచ్చే నెల 21 న ప్రారంభించనున్నారు. మార్కెట్ లో ఒక కొత్త వాహనం కోసం ఎదురుచూస్తున్న వారి కోసం తాము ప్రపంచ వ్యాప్తంగా ఈ క్రెటాను పరిచయం చేయబోతున్నాము అని హ్యూందాయ్ సంస్థ తెలిపింది. అయితే, ఇది చైనా లో ప్రత్యేకమైన గుర్తింపు పొందిన ఐ ఎక్స్25 పోలికలు కలిగి ఉన్నట్లు కనిపిస్తోందని భావిస్తున్నారు.
క్రెటాను, ఐ ఎక్స్25 కి భిన్నంగా చేయడానికి ఈ కార్ల తయారీ సంస్థ క్రోమ్ ఆడాన్స్ తో కాంపాక్ట్ ఎస్ యువి ని ఒక ప్రపంచ ప్రీమియర్ కారుగా తయారు చేసారు. ఈ కారు పేరు 'క్రెటా' అన్న విషయం ప్రక్కన పెడితే, దీని వెనుక లైసెన్స్ ప్లేట్ మీద కూడ క్రోమ్ తో అలంకరించారు. ఇప్పుడు ఈ వాహనం గత సంవత్సరం నుండి చైనా లో అమ్మకానికి ఉన్న ఐఎక్స్ 25 ని తలపిస్తుంది.
ఈ రహస్య చిత్రాలను చూసినట్లైతే గ్రే కలర్ క్రెటా ఎక్కువ ఉపకరణాలను కలిగి ఉన్నట్లుగా కనబడుతోంది, హ్యూందాయ్ క్రోం డోర్ విజర్స్ ని, వెనుక వైపు మరియు ముందు వైపు ఆకర్షణీయమైన ఫాగ్ లైట్లతో కూడిన టెయిల్ లైట్లను దీనిలో మనకు అందిస్తుంది. ఈ గ్రే కలర్ వాహనానికి డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ను ఆప్షనల్ గా ఎంపిక చేసుకోవచ్చు. ఈ హ్యూందాయ్ మూడు కార్లు 'ఎస్ఎక్స్' వేరియంట్ కార్లే.
లోపలివైపు, అంతర నిర్మిత లింకుల తో ఒక పెద్ద టచ్ స్క్రీన్ సమాచార వ్యవస్థను దీనిలో పొందుపరిచారు. దీని డాష్బోర్డ్ ని, ఎలైట్ ఐ 20 లాగా కంపించే డ్యుయల్ టోన్ థీమ్ తో అమర్చారు. ఈ ఇంజిన్ కి స్టాట్-స్టాప్ బటన్లు కూడా అమర్చారు, మరియు ఐ ఎక్స్25 లో ఉన్నటు వంటి (క్రింద చిత్రాన్ని చూడండి) ఎల్ ఈడి సూచికను (వార్మ్ మరియు కోల్డ్ కలర్ ఎల్ఈడి ని మార్చడం) అందించే వాతావరణ నియంత్రణ ఎసి ని కలిగి ఉంది. అంతేకాక, దీనిని చూసినట్లయితే ఒక ఆటోమేటిక్ గేర్ బాక్స్ ని కూడా కలిగి ఉంది, ఇంతవరకు ఏ టాప్ ఎండ్ ఎస్ యువి కూడా ఇలాంటి గేర్ బాక్స్ ని అందించలేదు.
మేము ఆశిస్తున్న ప్రకారం హ్యుందాయ్ మూడు ఇంజన్ ఎంపికలతో మన ముందుకి వస్తుంది. వెర్నా నుండి తీసుకోబడిన - రెండు డీజిల్ మరియు ఒక పెట్రోల్ ఇంజిన్ లతో మనకి అందుబాటులో ఉంటుంది. చాలా చాలా శక్తివంతమైన సీఅర్ డి ఐ 1.6 లీటర్ ఇంజిన్ ఒక 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ తో జతచేయబడి ఉంటుంది మరియు ధరల విషయాన్ని పక్కన పెడితే ఇది ఒక 1.4-లీటర్ సి ఆర్ డి ఐ ఇంజిన్ తో రానుంది. అంతేకాక, వెర్నా లో ఉండే 1.6 లీటర్ విటివిటి పెట్రోల్ మోటార్ తో రాబోతుంది మరియు ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటుంది. హ్యుందాయ్, డీజిల్, పెట్రోల్ రెండు ఇంజన్లు ఆటోమేటిక్ ఎంపికలతో వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
క్రెటా యొక్క ఉత్పత్తిని ఇప్పటికే ప్రారంభించారు , మరియు దీనిని వాటి ప్రత్యర్థులైన రెనాల్ట్ డస్టర్ , నిస్సాన్ టెర్రినో, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ (అగ్ర శ్రేణి వేరియంట్లు) మరియు రాబోయే మారుతి సుజుకి ఎస్-క్రాస్ లతో పాటు గా మహీంద్రా స్కార్పియో మరియు 2015 టాటా సఫారి స్టోర్మ్ లకు గట్టి పోటీ ఇవ్వడానికి త్వరలో రానుంది.