ప్రత్యేకం: సన్ؚరూఫ్ మరియు మెటల్ హార్డ్ టాప్ؚను పొందనున్న 5-డోర్‌ల మహీంద్రా థార్
మహీంద్రా థార్ రోక్స్ కోసం tarun ద్వ ారా మే 31, 2023 08:41 pm ప్రచురించబడింది
- 49 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఈ ఫ్యామిలీ-ఫ్రెండ్లీ థార్ 2024లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది
-
పూర్తిగా కప్పబడిన 5-డోర్‌ల థార్ టెస్ట్ వాహనం సింగిల్-పేన్ ఎలక్ట్రిక్ సన్ؚరూఫ్ؚతో కనిపించింది.
-
పూర్తి మెటల్ హార్డ్ టాప్ ఉంటుందని సన్ؚరూఫ్ ద్వారా నిర్ధారణ అయ్యింది, SUV విభాగంలో ఇది మొదటిసారిగా వస్తోంది.
-
8-అంగుళాల టచ్ؚస్క్రీన్ డిస్ప్లే, LED లైటింగ్, ఆటో AC, ఆరు వరకు ఎయిర్ؚబ్యాగ్ؚలు ఉంటాయని అంచనా.
-
3-డోర్‌ల థార్ؚలో ఉన్న అదే టర్బో-పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్‌ను ఇది కొనసాగిస్తుంది; RWD మరియు 4WD ఎంపికలతో వస్తుందని అంచనా.
-
ధరలు సుమారు రూ.15 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం కావచ్చు.
మహీంద్రా 5-డోర్‌ల థార్ మోడల్ మళ్ళీ రహస్యంగా టెస్టింగ్ చేయబడుతూ కనిపించింది. ఈసారి, దీన్ని టాప్-డౌన్ యాంగిల్ నుంచి చూడగలిగాము, ఇది SUVలోని రెండు ముఖ్యమైన హైలైట్‌లను ధృవీకరించింది.
మా ప్రత్యేకమైన రహస్య చిత్రాల ఆధారంగా, 5-డోర్‌ల థార్ సింగిల్-పేన్ ఎలక్ట్రిక్ సన్ؚరూఫ్ؚతో వస్తుంది. ఈ ఫీచర్ పూర్తి మెటల్ హార్డ్ టాప్ ఉంటుందని కూడా ధృవీకరిస్తుంది. ఎందుకంటే, ప్రస్తుత మూడు-డోర్‌ల మోడల్ؚలో ఉండే కాంపోజిట్ రూఫ్ؚను సన్ؚరూఫ్ؚకు అమర్చలేరు. అసాధారణంగా, సన్ؚరూఫ్‌ను సరిగ్గా రెండు వరుసల మధ్య అమర్చబడింది.
ఇది కూడా చదవండి: మారుతి జిమ్నీ Vs మహీంద్రా థార్ పెట్రోల్ – ఇంధన సామర్ధ్య గణాంకాల పోలిక
పొడిగించిన థార్ ఇతర విజువల్ హైలైట్‌లలో పొడిగించిన వీల్ؚబేస్, C పిల్లర్ؚకు అమర్చిన డోర్ హ్యాండిల్స్, స్పేర్ వీల్ వెనుక అమర్చిన రేర్ వైపర్ ఉన్నాయి. కొత్త SUV విడుదల సమయంలో అంచనా వేసిన కొన్ని ఫీచర్ జోడింపులను మినహాయించి దీని క్యాబిన్ 3-డోర్‌ల వర్షన్ؚకు సారూప్యంగా ఉంటుందని అంచనా. కొన్ని కొత్త సౌకర్యాలలో కనెక్టెడ్ కార్ సాంకేతికలతో 8-అంగుళాల టచ్ؚస్క్రీన్ సిస్టమ్ మరియు ఓవర్-ది-ఎయిర్ అప్ؚడేట్ؚలు, ఆటోమ్యాటిక్ AC, రేర్ పార్కింగ్ కెమెరా, ఆరు వరకు ఎయిర్ؚబ్యాగ్ؚలు ఉంటాయని ఆశించవచ్చు.
5-డోర్‌ల థార్ బోనెట్ క్రింద అధిక సమర్ధతతో ప్రస్తుతం ఉన్న 2-లీటర్‌ల టర్బో-పెట్రోల్ మరియు 2.2-లీటర్ డీజిల్ ఇంజన్‌లు ఉండవచ్చు. 3-డోర్‌ల వర్షన్‌లో, పెట్రోల్ ఇంజన్ 150PS పవర్ రేటింగ్‌తో, డీజిల్ 130PS పవర్ రేటింగ్‌తో అందిస్తున్నారు. ట్రాన్స్ؚమిషన్ ఎంపికలలో రెండు ఇంజన్‌లలో 6-స్పీడ్‌ల మాన్యువల్ మరియు ఆటోమ్యాటిక్ యూనిట్‌లు ఉన్నాయి. ఈ థార్ؚలో కూడా రేర్-వీల్ మరియు ఫోర్-వీల్ డ్రైవ్ؚట్రెయిన్ ఎంపికలను అందిస్తారని అంచనా.
ఇది కూడా చదవండి : రూ.10 లక్షల కంటే తక్కువ ధరలో వచ్చే ఈ 7 సెకండ్ హ్యాండ్ SUVలు
ఈ ఆఫ్-రోడర్ మరింత ఆచరణాత్మక వర్షన్ 2024లో విడుదల కానుంది మరియు దీని ధర సుమారు రూ.15 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా. రాబోయే ఐదు-డోర్‌ల గూర్ఖాతో నేరుగా పోటీ పడుతుంది మరియు మరొక ఐదు-డోర్‌ల ఆఫ్-రోడర్ అయిన మారుతి జిమ్నీకి ఇది మరింత సమర్ధమైన ప్రత్యామ్నాయం అవుతుంది.
ఇక్కడ మరింత చదవండి: థార్ డీజిల్