• English
  • Login / Register

ఫోర్డ్ ఇండియా వెబ్సైట్ లో ప్రదర్శింపబడిన ఎండీవర్!

ఫోర్డ్ ఎండీవర్ 2015-2020 కోసం అభిజీత్ ద్వారా ఆగష్టు 11, 2015 03:47 pm ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్ :

బలమైన ఎండీవర్ ను ఇప్పుడు ఫోర్డ్ యొక్క అధికారిక వెబ్ సైట్ లో ప్రదర్శించారు. దీని ప్రకారం ఈ కారు త్వరలోనే ప్రారంభం అవ్వచ్చు. ఎందుకంటే, ముందు ఫిగో ఆస్పైర్ రెండు నెలలో ప్రారంభం కానున్నదని తెలిపారు. కానీ ఆస్పైర్ రెపే ప్రారంభం కానున్నది. ఇదే విధంగా ఎండీవర్ కూడా త్వరలో ప్రారంభం కావచ్చని భావన.

 కొత్తగా ప్రారంభించబడిన పేజీ, కార్ల యొక్క ప్రధాన లక్షణాలను హైలైట్ చేయడానికి మాత్రమే, కానీ కొన్ని రోజుల క్రితం థాయిలాండ్ లో మేము కారుని నడిపినప్పుడుమరింత మార్పులు ఉన్నట్టుగా గుర్తించాము. డాష్బోర్డ్ మరియు కొన్ని స్థలాలలో ఎవరెస్ట్ బాడ్జింగ్ వంటివి తీసివేయడం వంటి మార్పులను గమనించాము. దీని టెయిల్ గేట్ లో ఎండేవర్ లెటరింగ్ ఉండవచ్చని అనుకుంటున్నాము. ఇవన్నీ పక్కన పెడితే, ఈ కారు థాయ్ స్పెక్ వేరియంట్ లానే ఉంటుంది.

కొత్త కారు గురించి మాట్లాడుకుంటే, దీని అంతర్భాగాలు మరియు ఇంజిన్ చూడడానికి దీని మునుపటి ఎండీవర్ కి ఉన్నట్టుగానే ఉనాయి. ఈ ఎస్యువి అమెరికన్ తయారీదారుడు నుండి తయారుచేయబడిన ఎకోస్పోర్ట్ కి ఉన్నట్టుగానే స్టబ్బీ నోస్ తో ఉంటుంది. దీని ముందర మరియు వెనుక బంపర్లు ఒకే విధంగా అమర్చబడి మంచి లుక్ ని ఇస్తుంది. అలానే దీని ముందస్తు భాగానికి ఫాగ్లాంప్స్ మరియు వెనుక భాగానికి రిఫ్లెక్టర్లు అమర్చబడి ఉంటాయి. దీని ప్రక్క భాగంలో 20 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ అందజేయబడి ఉంటాయి.

ఈ కొత్త ఎండీవర్ రెండు ఇంజిన్ ఎంపికలలో అందుబాటులో ఉన్నాయి. మొదటిది ఇన్-లైన్ 5 సిలిండర్ టిడిసి ఐ డీజిల్ ఇంజిన్. ఇది 470Nm టార్క్ ని అందిస్తుంది. దీనిలో రెండవది 2.2 లీటర్ టిడిసి ఐ ఇంజిన్. ఈ ఇన్-లైన్ 5 సిలిండర్ టిడిసి ఐ డీజిల్ ఇంజిన్ ఆటోమేటిక్ మరియు మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎంపికలతో వస్తుంది. దీనిలో రెండవ 2.2 లీటర్ టిడిసి ఐ ఇంజిన్ మాన్యువల్ తో అందుబాటులో ఉంది.

was this article helpful ?

Write your Comment on Ford ఎండీవర్ 2015-2020

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience