• English
  • Login / Register

భారత ఆటో ఎక్స్పోలో ప్రదర్శించబడిన డస్టర్ ఫేస్లిఫ్ట్ ; 2016 మొదటి భాగం లో ప్రారంభం

రెనాల్ట్ డస్టర్ 2016-2019 కోసం manish ద్వారా డిసెంబర్ 07, 2015 03:07 pm ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

రెనాల్ట్ డస్టర్ ఫేస్లిఫ్ట్ వెర్షన్ ను "గేరింగ్ అప్" తో 2016 ప్రథమార్థంలో భారత మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఈ నవీకరించబడిన కాంపాక్ట్ ఎస్యువి, వచ్చే ఏడాది ఫిబ్రవరి లో ప్రారంభం కానుంది. ఈ ఫేస్లిఫ్ట్ వెర్షన్ ను, రాబోయే 2016 భారత ఆటో ఎక్స్పోలో లో ప్రదర్శించనున్నారు. ఈ వాహనం యొక్క బాహ్య మరియు అంతర్గత భాగాలలో నవీకరించబడిన అంశాల గురించి మాట్లాడటానికి వస్తే, రెనాల్ట్ యొక్క డైమండ్ లోగో పొదగబడిన సింగిల్ స్లాట్ గ్రిల్ డిజైన్, పునఃరూపకల్పన చేయబడిన అల్లాయ్ వీల్స్, పునరుద్దరించబడిన బంపర్ మరియు ఒక కొత్త హెడ్ లైట్ క్లస్టర్ & టైల్ లైట్ క్లస్టర్ వంటి నవీకరించబడిన అంశాలు అందించబడ్డాయి. మరోవైపు అంతర్గత భాగం విషయానికి వస్తే, బ్రాండ్ యొక్క కొత్త ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఒక కొత్త స్టీరింగ్ వీల్ మరియు నావిగేషన్ అలాగే బ్లూటూత్ వంటి కనెక్టవిటీ లకు మద్దతిచ్చే ఒక ఆప్షనల్ మీడియా నావ్ టచ్స్క్రీన్ సమాచార వ్యవస్థ వంటి నవీకరించబడిన అంశాలు అందించబడ్డాయి.

హుడ్ క్రింది భాగానికి వస్తే, ఈ రెనాల్ట్ డస్టర్ ఫేస్లిఫ్ట్ వెర్షన్ వెర్షన్ అదే 1.5 లీటర్ డి సి ఐ డీజిల్ ఇంజన్ తో వస్తుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 89 బి హెచ్ పి పవర్ ను అలాగే 109 బి హెచ్ పి పవర్ ను విడుదల చేసే మోడళ్ళను కలిగి ఉంటుంది. మరోవైపు పెట్రోల్ వేరియంట్ల విషయానికి వస్తే, అదే 1.6 లీటర్ ఇంజన్ అందించబడుతుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 102 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 148 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ రెనాల్ట్ డస్టర్ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ లో అత్యంత ప్రముఖ మెకానికల్ నవీకరణ ఎక్కడ అంటే, ఫ్రెంచ్ ఆటో తయారీదారుడు ద్వారా ఈజీ -ఆర్ ఏ ఎంటి ను తీసుకోవడం జరిగింది. సంస్థ ఈ వాహనాన్ని, ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (ఏ ఎం టి), తో మొదటిసారిగా తీసుకురాబోతుంది.

ఈ నవీకరణలు, ఎస్యువి మరియు కాంపాక్ట్ ఎస్యువి విభాగంలో పోటీ కోసం అందించబడ్డాయి. అంతేకాకుండా, ఇటీవల విడుదల అయిన మహింద్రా ఎక్స్యువి 500 ఏటి వేరియంట్ మరియు హ్యుందాయ్ క్రెటా వంటి వాహనాలకు గట్టి పోటీ ను ఇవ్వడానికి ఈ వాహనం, ట్రాన్స్మిషన్ నవీకరణతో వస్తుంది. నిస్సాన్ టెర్రినో లో ఉండే 5- స్పీడ్ యూనిట్ ఈజీ -ఆర్ ఏ ఎం టి తో వస్తుంది. ఈ డస్టర్ ఫేస్లిఫ్ట్, హ్యుందాయ్ క్రెటా, ఫోర్డ్ ఈకోస్పోర్ట్, మారుతి సుజుకి ఎస్ క్రాస్ మరియు మహింద్రా స్కార్పియో వంటి వాహనాలకు గట్టి పోటీ ను ఇస్తుంది.    

ఇది కూడా చదవండి:

తరువాతి తరం రెనాల్ట్ డస్టర్ 2018 లో రానుంది

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Renault డస్టర్ 2016-2019

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience