DC అవంతి 310 స్పెషల్ ఎడిషన్ బహిర్గతం
డిసి అవంతి కోసం nabeel ద్వారా డిసెంబర్ 15, 2015 03:33 pm ప్రచురించబడింది
- 27 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
భారతదేశం యొక్క సొంత స్పోర్ట్స్ కారు, DC అవంతి, ఒక ప్రదర్శన నవీకరణను పొందింది. ఇది DC అవంతి 310 గా పిలబడుతుంది మరియు ఈ లిమిటెడ్ ఎడిషన్ 31 యూనిట్లు మాత్రమే తయారు అవుతుంది. దీనికి 310 అనే పేరు 310bhp శక్తిని అందించడం వలన వచ్చింది, ఇది సాధారణ వెర్షన్ కంటే ఒక భారీ 60bhp శక్తిని ఎక్కువగా అందిస్తుంది. మునుపటి వలే అదే ఇంజిన్ తో ఈ లిమిటెడ్ ఎడిషన్ అవంతి రూ. 44 లక్షల, ఎక్స్-షోరూమ్, ధరను కలిగి ఉంటుంది. ఇది సాధారణ వెర్షన్ కంటే సుమారు రూ.8 లక్షల కంటే ఎక్కువ ధరను కలిగి ఉంది. అవంతి 310 కోసం బుకింగ్స్ మరియు డెలివరీస్ 2016 లో మొదలవుతాయి. మొదటి DC అవంతి 2012 ఆటో ఎక్స్పోలో తొలిసారి ప్రదర్శింపబడిన తరువాత ఏప్రిల్ 16, 2015లో ప్రారంభించబడింది.
60bhp శక్తిని అధికంగా అందించడం వలన ఈ వాహనం మరింత అద్భుతంగా ఉంది. ఇది ఇప్పుడు వెనుక డిఫ్యూజర్ తో పాటుగా కార్బన్ ఫైబర్ ఫ్రంట్ స్ప్లిట్టర్ తో, కొత్త రంగు పథకంతో, కొత్తగా జోడించిన స్పాయిలర్ తో మరియు నల్లని షేడ్ తో కొత్త అలాయ్ వీల్స్ ని కలిగి వస్తుంది. అంతర్భాగాలలో అవంతి అల్సంటరా లెథర్ స్పోర్టీ సీట్లు మరియు పునః రూపకల్పన చేయబడిన ఇన్స్ట్రుమెంట్ డిస్ప్లే తో పాటు స్టీరింగ్ వీల్ ని కలిగి ఉంటుంది. ఈ కారు ఆకుపచ్చ తో బూడిద రంగు, నీలం తో తెలుపు మరియు ఆరెంజ్ తో గ్రే అను మూడు రంగులతో వస్తుంది.
ఈ లిమిటెడ్ ఎడిషన్ మునుపటి అదే ఇంజిన్ బ్లాక్ ని ఉపయోగిస్తుంది. రెనాల్ట్ అధారిత 2.0 లీటర్ నాలుగు సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఇప్పుడు 310bhp శక్తిని అందిస్తుంది మరియు ప్యాడిల్ షిప్టర్స్ తో సిక్స్ స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ గేర్బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. ఫలితంగా, ఇది 6 సెకెన్లలో 0 నుండి 100kmph సమయం చేరుకుంటుంది మరియు గరిష్టంగా 200kmph వేగం చేరుకుంటుంది. ఈ ఎడిషన్ యాంటీ రోల్ బార్లను కూడా కలిగి ఉంటుంది మరియు రైడ్ హైట్ తక్కువగా 150mm కంటే ఉండి, దాని ముందు దాని కంటే 20mm గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువగా ఉంది.
ఇంకా చదవండి
0 out of 0 found this helpful