క్రెటా: హ్యుందాయ్ యొక్క బెస్ట్ బెట్
హ్యుందాయ్ క్రెటా 2015-2020 కోసం konark ద్వారా జూలై 14, 2015 05:25 pm సవరించబడ ింది
- 16 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఢిల్లీ: ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న రోజు త్వరలోనే రాబోతుంది. దేని గురించా అనుకుంటున్నారా? జూలై 21 న విడుదల అవుతున్న క్రెటా గురించే. దీని రాకతో కొరియన్ క్రాస్ ఓవర్ పరిసర ప్రాంతాలు వేడెక్కుతున్నాయి. హ్యుందాయ్ క్రెటా కోసం ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అవ్వడం తో, కాంపాక్ట్ ఎస్యువి విభాగంలో ఉన్న, రెనాల్ట్ డస్టర్, నిస్సాన్ టెర్రినో మరియు ఫోర్డ్ ఈకోస్పోర్ట్ తో పాటు రాబోయే మారుతి సుజుకి ఎస్-క్రాస్ వాహనాల తయారీదారులు బయపడుతూ శ్వాసను పీల్చుకుంటున్నాయి. ముందుగా చైనా లో విడుదల ఐఎక్స్25 వేదిక ఆధారంగా, క్రెటా క్రోం అటాచ్మెంట్స్ ను మినహాయించి చైనీస్ క్రాస్ఓవర్ ను పోలి రాబోతుంది.
నేటి వినియోగదారుల కొరకు అధిక పనితీరు కలిగిన మరియు అనేక భద్రతా సూచనలను కలిగిన వాహనాలను హ్యుందాయ్ ప్రవేశపెడుతున్నారు. అంతేకాకుండా, హ్యుందాయ్ భారతీయ కారు కొనుగోలుదారుల కోసం అనేక ఎంపికలను అందుబాటులో ఉంచుతుంది మరియు అది తప్పనిసరిగా హ్యుందాయ్ ఉత్తమ పందెం తో రాబోతుంది!
ఇప్పుడు రాబోతున్న క్రెటా, సమర్థవంతమైన మరియు శక్తివంతమైన ఇంజిన్లతో పాటు హ్యుందాయ్ యొక్క ఫ్యూడిక్ డిజైన్ తో రాబోతుంది. అంతేకాకుండా, డ్రైవర్ కొరకు ప్రయాణీకుల కొరకు అనేక అంశాలతో రాబోతుంది. వీటితో పాటు, కార్యాచరణతో, వైవిద్యంతో మరియు సౌకర్యవంతమైన లక్షణాలతో జూలై 21 న రాబోతుంది.
ఇంజిన్ మరియు పనితీరు
హ్యుందాయ్ క్రెటా యొక్క నిర్దేశాల విషయానికి వస్తే, ఈ మోడల్, వెర్నా లో ఉండే ఇంజన్ లతో రాబోతుంది. రాబోయే ఇంజన్ లు ఏమిటంటే, 1.6 లీటర్ డ్యూయల్ విటివిటి పెట్రోల్ ఇంజన్ మరియు 1.4 సిఆర్ డిఐ అండ్ 1.6 లీటర్ సిఆర్ డిఐ విజిటి డీజిల్ ఇంజన్ లతో రాబోతుంది. 1.6 లీటర్ విటివిటి పెట్రోల్ ఇంజన్, అత్యధికంగా 126 PS పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. అయితే 1.6 సిఆర్ డిఐ విజిటి (మాన్యువల్ / ఆటోమేటిక్) డీజిల్ ఇంజన్ 131 PS పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండింటిలో ఇది ఉత్తమమైనది అని చెప్పవచ్చు. అంతేకాకుండా, క్రెటా 1.6 లీటర్ సిఆర్ డిఐ విజిటి ఇంజన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో రాబోతుంది.
లక్షణాలు మరియు భద్రత
క్రెటా, 7 అంగుళాల ఆడియో వీడియో నావిగేషన్ వ్యవస్థ (ఏవిఎన్), 5 అంగుళాల టచ్ స్క్రీన్ ఆడియో సిస్టమ్, సూపర్విజన్ క్లస్టర్ మరియు పుష్ బటన్ స్టార్ట్ తో స్మార్ట్ కీ వంటి అనేక ఆధునిక తరం లక్షణాలను కలిగి ఉంది.
భద్రతా లక్షణాల విషయానికి వస్తే, డ్యూయల్ ఎయిర్బ్యాగ్స్, సైడ్ & కర్టెన్ ఎయిర్బ్యాగ్స్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), రివర్స్ పార్కింగ్ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈ ఎస్ సి), వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ (వి ఎస్ ఎం) మరియు హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ (హెచ్ ఏ సి) వంటి అంశాలతో రాబోతుంది.
హ్యుందాయ్ క్రెటా యొక్క మొదటి లుక్ వీడియో ను వీక్షించండి