టాటా జైకా వర్సెస్ చెవ్రోలెట్ బీట్ వర్సెస్ హ్యుందాయ్ ఐ10 వర్సెస్ మారుతి సెలిరియో వాహనాల మధ్య పోలిక
డిసెంబర్ 09, 2015 12:49 pm manish ద్వారా ప్రచురించబడింది
- 19 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
ఇండికా వాహనం యొక్క ప్లాట్ఫాం ఆధారంగానే, ఈ టాటా జైకా వాహనం కూడా వచ్చింది. కానీ ఈ జికా వాహనం యొక్క డిజైన్ ను చూసినట్లైతే, ఇంగ్లాడ్, ఇటలీ మరియు పూనే ఆధారంగా వెలువడలేదు. అంతేకాకుండా, ఈ వాహనం ఖచ్చితంగా తరువాతి హాచ్బాక్ సారూప్యతతో వచ్చింది అని చెప్పవచ్చు. ఈ టాటా వాహనంలో, టాటా యొక్క డిజైన్ నెక్స్ట్ డిజైన్ లాంగ్వేజ్ అందించబడింది. ఈ వాహనం యొక్క స్టైలింగ్ అంశాల విషయానికి వస్తే, దూకుడు వైఖరితో అలాగే వంపు సౌజణ్యం కలిగిన హుడ్ తో రాబోతుంది. ఈ వాహనం బోల్డ్ అలాగే మెరుపులతో చెక్కబడిన లుక్ ను కలిగి ఉంది. అంతేకాకుండా ఈ వాహనం, డైమండ్ డి ఎల్ ఓ, హ్యుమానిటీ లైన్ మరియు స్లింగ్ షాట్ లైన్ వంటి వాటిని కలిగిన డిజైనెక్స్ట్ క్రెడోస్ తో జత చేయబడుతుంది. ఈ వాహనం, పోటీదారులకు వ్యతిరేకంగా అనేక కీలకమైన అంశాలతో రాబోతుంది. నవీకరించబడిన వాహనాలలో ఇది ఒకటి అని ఖచ్చితంగా చెప్పవచ్చు. కాబట్టి అనేక లక్షణాలతో ఈ వాహనం, ఇతర వాహనాలతో ఎలా పోటీ పడుతుందో చూద్దాం
పవర్ ప్లాంట్లు:
ఈ టాటా జైకా వాహనం, ఈ విభాగం లో ఉండే చెవ్రోలెట్ బీట్, హ్యుందాయ్ ఐ 10, మారుతీ సెలిరియో వంటి వాహనాలకు గట్టి పోటీ ను ఇస్తుంది. ఈ అన్ని కార్లు, హ్యుందాయ్ ఐ10 వాహనం తప్ప మిగిలిన అన్ని వాహనాలు పెట్రోల్ మరియు డీజిల్ రెండు ఇంజన్ ఎంపికలతో అందుబాటులో ఉన్నాయి.
ఈ టాటా జైకా యొక్క పెట్రోల్ వాహనాల విషయానికి వస్తే, అత్యంత శక్తివంతమైఅన్ రెవోట్రాన్ 1.2 లీటర్ మూడు సిలండర్ల పెట్రోల్ ఇంజన్ అందించబడుతుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 84 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 116 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. తరువాత స్థానం లో ఉన్నది, రాబోయో చెవ్రోలెట్ హాచ్బాక్. ఈ వాహనం అత్యధికంగా, 76.8 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 106.5 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంది. మూడవ స్థానంలో ఉన్నది హ్యుందాయ్ వాహనం. ఈ వాహనం, 1.1 లీటర్ నాలుగు సిలండర్ల ఇంజన్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 68 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 99 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు సెలిరియో లో ఉండే పెట్రోల్ వేరియంట్ విషయానికి వస్తే, ఈ 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ అత్యధికంగా 67 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 90 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.
హ్యుందాయ్ ఐ10 యొక్క డీజిల్ ఇంజన్ లో కూడా ఇదే పవర్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఈ అన్ని కార్లలో ఉండే అన్ని ఇంజన్లు, 5- స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో ప్రామాణికంగా జత చేయబడి ఉంటాయి. ఈ సెలిరియో వాహనం లో ఉండే పెట్రోల్ ఇంజన్ మాత్రం, ఏ ఎం టి గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. మరోవైపు ఈ జైకా వాహనం కూడా, ఆట్రోమేటిక్ గేర్ బాక్స్ తో వచ్చే అవకాశాలు ఉన్నాయి.
భద్రత:
ఈ జైకా వాహనం యొక్క అగ్ర శ్రేణి వేరియంట్, ముందు రెండు ఎయిర్బాగ్లు, ఏబిఎస్ తో ఈబిడి మరియు కార్నర్ సేఫ్టీ కంట్రోల్ వంటి భద్రతా అంశాలతో వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు చెవ్రోలెట్ బీట్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్, ఏబిఎస్ మరియు ముందు రెండు ఎయిర్బాగ్లు వంటి అంశాలతో వస్తుంది. అదే సెలిరియో వాహనం విషయానికి వస్తే, ఏబిఎస్ మరియు ముందు రెండు ఎయిర్బాగ్లు వంటివి ఆప్షనల్ గా అందించబడతాయి. అదే హ్యుందాయ్ ఐ10 విషయానికి వస్తే, ఎయిర్బాగ్లు కాని ఏబిఎస్ వంటి అంశాలు అందించబడవు.
ఇవి కూడా చదవండి: