• English
  • Login / Register

సరిపోల్చుట: మారుతి సుజుకి బాలెనో Vs ఎలైట్ ఐ20 Vs జాజ్ Vs పోలో Vs పుంటో ఈవో

మారుతి బాలెనో 2015-2022 కోసం raunak ద్వారా అక్టోబర్ 27, 2015 11:13 am ప్రచురించబడింది

  • 17 Views
  • 7 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: హ్యాచ్బ్యాక్ లు ఎల్లప్పుడూ మారుతి సంస్థ కి ఒక గొప్ప బలాన్ని చేకూరుస్తాయి. ఈ విభాగంలో మూడు విప్లవాత్మకమైన మోడల్స్ ఉన్నాయి, అవి ఐకానిక్ మారుతి 800, ఆల్టో మరియు స్విఫ్ట్. కొత్త బాలెనో మొదటిగా అనేక అంశాలతో ఆశక్తికరంగా ఉంది. ఇప్పటి నుంచి ఇది స్విట్ నుండి బాద్యతలు తీసుకొని సంస్థ యొక్క ఫ్లాగ్షిప్ హ్యాచ్బ్యాక్ గా మారబోతున్నది మరియు ఇది మొత్తం ప్రపంచానికి భారతదేశం నుండి ఎగుమతి చేయబడుతుంది. ఇది స్థానికంగా తయారుచేయబడిన కారణంగా తక్కువ ధరకు అందించబడుతుంది. బాలెనో బేస్ మోడల్ నుండి ఏబిఎస్ మరియు ఇబిడి తో పాటూ ప్రామాణికంగా డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ ని కలిగియుండి దేశంలో అత్యంత అద్భుతమైన కారుగా ఉండడం మెచ్చుకోదగ్గ విషయం. ఇక్కడ బాలెనో ప్రీమియం హ్యాచ్బ్యాక్ స్పేస్ నుండి దాని ప్రత్యర్థులతో ఏ విధంగా పోటీ పడుతుందో చూద్దాము.

 

భద్రత మరియు లక్షణాలు: 

మొదటిగా భద్రత అంశాలతో ప్రారంభిస్తే, పైన తెలిపిన విధంగా బేస్ వేరియంట్ నుండి ఏబిఎస్+ఇబిడి మరియు ప్రమాణికంగా డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ ని పెట్రోల్ మరియు డీజిల్ రెండిటిలో అందిస్తున్న వాహనం ఇది ఒక్కటే. మరే ఇతర వాహనం కూడా ఈ విభాగంలో ప్రామాణిక డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ లేదా కనీసం డ్రైవర్ ఎయిర్బ్యాగ్స్ ని కూడా అందించడం లేదు. బాలెనో కాకుండా జాజ్ మాత్రమే ఏబిఎస్ ని ప్రమాణికంగా అందిస్తుంది, అది కూడా డీజిల్ ట్రిం లో మాత్రమే. అంతేకాకుండా, పుంటో ఈవో మరియు పోలో పక్కన పెడితే మిగిలిన మూడు కార్లు బాలెనో, జాజ్ మరియు ఎలైట్ ఐ20 కార్లు అంతర్నిర్మిత నావిగేషన్ మరియు వెనుక వ్యూ కెమెరా తో టచ్ స్క్రీన్ సమాచార యూనిట్ ని అందిస్తున్నాయి. బాలెనో ఆపిల్ కార్ ప్లే ని కూడా అందిస్తుంది. దీని ప్రకారం మారుతి సంస్థ భారతదేశంలో ఆపిల్ కార్ ప్లే ని అందిస్తున్న మొదటి సంస్థగా చెప్పవచ్చు. 

మారుతి సుజికి బాలెనో ని పోటీతత్వ ధరకు అందిస్తుంది. ఇది హ్యుందాయ్ ఎలైట్ ఐ 20 మరియు హోండా జాజ్ వంటి వాటితో పోలిస్తే చవుక ధరను కలిగి ఉంది. అది మాత్రమే కాకుండా,ఏబిఎస్ + ఇబిడి తో పాటు ప్రామాణిక డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ అందిస్తోంది. దీనిలో ఒక ప్రతికూలత ఏమిటంటే, స్విట్ లో ఉన్న అదే ఇంజిన్లను కలిగియుండడం. కానీ ఈ హ్యాచ్బ్యాక్ దాని పోటీదారులతో పోలిస్తే స్విఫ్ట్ కంటే కూడా దగ్గరగా 100 కిలోలు తేలికగా ఉంది. అయితే, మారుతి బాలెనో 10K విక్రయాల మార్కును దాటుతుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. ప్రస్తుతం హ్యుందాయ్ సంస్థ ఎలైట్ ఐ20 తో నెలవారి ఆ మార్క్ ని చేరుకోగలుగుతుంది. అంతేకాకుండా, భారతదేశం ఈ కారు కొరకు మాత్రమే తయారీ కేంద్రంగా ఉంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Maruti బాలెనో 2015-2022

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience