• English
  • Login / Register

సరిపోల్చండి: మహీంద్రా KUV100 VS గ్రాండ్ ఐ 10 VS స్విఫ్ట్ VS ఫిగో

మహీంద్రా కెయువి 100 ఎన్ఎక్స్టి కోసం raunak ద్వారా జనవరి 18, 2016 03:18 pm ప్రచురించబడింది

  • 13 Views
  • 2 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మహీంద్రా మరియు మహీంద్రా వాహనం  KUV 100 ని రూ.4.42 లక్షల(ఎక్స్-షోరూమ్, పూనే) ధర వద్ద దేశంలో ప్రారంభించింది. మహీంద్రా KUV100 భారతదేశం యొక్క మొదటి మైక్రో SUV మరియు కొత్త విభాగాన్ని పరిచయం చేసింది. అయితే, దీనికి ప్రత్యక్ష పోటీ లేనప్పటికీ మహీంద్రా దీనిని మారుతి సుజుకి స్విఫ్ట్, రెండవ తరం ఫోర్డ్ ఫిగో మరియు హ్యుందాయి గ్రాండ్ ఐ10 వంటి బి-సెగ్మెంట్ హ్యాచ్‌బ్యాకులకు పోటీగా ఉంచింది.    

 Compare: Mahindra KUV1OO vs Grand i10 vs Swift vs Figo

లక్షణాల గురించి మాట్లాడుకుంటే, KUV 100 అన్ని 6 సీట్లలో సీటుబెల్ట్ తో 6 ప్రయాణీకులు కూర్చోగలిగే ఎంపికతో వస్తుంది. దీనిలో సమాచారవినోద వ్యవస్థ బ్లూటూత్ కనెక్టివిటీ, ఆక్స్-ఇన్ మరియు మహీంద్రా బ్లూ సెన్స్ యాప్ తో పాటుగా యుఎస్బి తో వస్తుంది. ఇది సిక్స్ స్పీకర్ సిస్టమ్ తో వస్తుంది. అధనంగా ఇది కూలెడ్ గ్లోవ్ బాక్స్, LED క్యాబిన్, మూడ్ లైట్లు మరియు అన్ని నాలుగు డోర్స్ కి పడుల్ ల్యాంప్స్ వంటి అంశాలతో వస్తుంది. అంతేకాక, ఇది రెండు ఇంజిన్లకు ఇంజిన్ స్టార్ట్-స్టాప్ లక్షణాన్ని కలిగి ఉన్న మహీంద్రా మైక్రో- హైబ్రిడ్ టెక్ లక్షణాన్ని కలిగి ఉంటుంది. అయితే, డీజిల్ ECO (ఎకానమీ) మరియు PWR (పవర్)వంటి డ్రైవింగ్ మోడ్ లను కలిగి ఉంది.   

భద్రత పరంగా, KUV100 వాహనం ఇబిడి తో ఏబిఎస్, అన్ని మోడళ్లు అంతటా డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్ ని ఆప్ష్నల్ గా కలిగి ఉంది. ఇది వెనుక పిల్లల సీటు వద్ద విభాగంలో మొదటి  Isofix ని మరియు  పానిక్ బ్రేకింగ్ హజార్డ్ లైట్లను అందిస్తుంది. పోటీదారుల గురించి మాట్లాడుకుంటే, మారుతి సుజికి స్విఫ్ట్ కూడా అన్ని వేరియంట్లలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ మరియు ఇబిడితో ఏబిఎస్ ని అందిస్తుంది. మరోవైపు హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 అగ్ర శ్రేణి వేరియంట్ లో  ఎయిర్బ్యాగ్స్ మరియు ABS ని మాత్రమే అందిస్తుంది. ఫోర్డ్ ఫిగో అగ్ర శ్రేణి వేరియంట్ లో  విభాగంలో మొదటి 6 ఎయిర్బ్యాగ్స్ ని కలిగి ఉంటుంది. అయితే డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్  లైనప్ అంతటా ప్రామాణికంగా ఉంటుంది మరియు ద్వంద్వ ఎయిర్బ్యాగ్స్ బేస్ వెర్షన్ తప్ప మిగతా వాటిలో ప్రామాణికంగా వస్తాయి. EBD తో ABS గత రెండు వేరియంట్లలో లభ్యమవుతోంది, అయితే ఆటోమెటిక్ పెట్రోల్ వేరియంట్ ESC, TCమరియు హిల్ లాంచ్ అసిస్ట్ వంటి వాటిని కలిగి ఉంటుంది.  

ఇంకా చదవండి

మహీంద్ర కే యు వి 100 రూ.4.42 లక్షల ధరతో ప్రారంభం అయ్యింది .

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Mahindra కెయువి 100 ఎన్ఎక్స్టి

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience