సెగ్మెంట్ల యొక్క పోరు: రెనాల్ట్ క్విడ్ 1.0L టాటా టియాగో - ఏ కార్ కొనుగోలు చేసుకోవాలి?
టాటా టియాగో 2015-2019 కోసం khan mohd. ద్వారా మే 08, 2019 02:53 pm ప్రచురించబడింది
- 49 Views
- ఒక వ్యాఖ్ యను వ్రాయండి
క్విడ్ యొక్క అధిక వేరియంట్స్ టియాగో తో కలుస్తాయి కాబట్టి ఈ రెండు హ్యాచ్బ్యాక్లు లో ఏ హ్యాచ్బ్యాక్ కొనుగోలుదారులు కొనుగోలు చేసుకొనేందుకు బాగుంటుందో చూద్దాము
రూ.3 నుండి 5 లక్షల ధర పరిధిలో ఉన్న కారుని ఎంచుకోవాలంటే అది కొంచెం కష్టమైన పని అని చెప్పవచ్చు, ఎందుకంటే చాలా కార్లు ఈ ధర పరిధిలో ఉన్నాయి కాబట్టి. అటువంటి వాటిలో రెనాల్ట్ క్విడ్ మరియు టాటా టియాగో ఈ రెండు కార్లు కూడా ఉన్నాయి. టియాగో ఖచ్చితంగా క్విడ్ తో పోలిస్తే రెండు విభాగాల పైన ఉంటుంది కానీ ఈ ధర అనేది ఒకేలా ఉండడం వలన పోల్చడం తప్పడం లేదు. కాబట్టి, మీ బడ్జెట్ లో ఈ రెండిటిలో ఏది మంచిది? అవగాహన కోసం, మేము కార్లు రెండింటి యొక్క ధరలను మాత్రమే పరిశీలిస్తున్నాము. మేము ఈ పోలిక నుండి 0.8 లీటర్ క్విడ్ మరియు టియాగో డీజిల్ ని మినహాయించాము.
కొలతలు |
రెనాల్ట్ క్విడ్ 1.0 |
టాటా టియాగో |
పొడవు |
3679mm |
3746mm |
వెడల్పు |
1579mm |
1647mm |
ఎత్తు |
1478mm |
1535mm |
వీల్బేస్ |
2422mm |
2400mm |
గ్రౌండ్ క్లియరెన్స్ |
180mm |
170mm |
బూట్ స్పేస్ |
300 లీటర్స్ |
242 లీటర్స్ |
టాటా హ్యాచ్ దాని ఫ్రెంచ్ కౌంటర్ పార్ట్ కంటే పెద్దదిగా, ఎత్తుగా మరియు వెడల్పుగా ఉన్నందున ఈ క్విడ్ కి టియాగో కి 22mm పొడవైన వీల్ బేస్ ఉంటుంది. దీని వలన క్యాబిన్ లోపల మంచి స్థలం ఉంటుంది. 300 లీటర్ల వద్ద, క్విడ్ లో పెద్ద బూట్ కూడా ఉంది మరియు 10mm గ్రౌండ్ క్లియరెన్స్ ఖచ్చితంగా పెద్ద స్పీడ్ బంప్స్ వచ్చినా సరే సులభంగా దానిని దాటేయవచ్చు.
ఇంజిన్లు
లక్షణాలు |
రెనాల్ట్ క్విడ్ 1.0 |
టాటా టియాగో |
ఇంజిన్లు |
1.0 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ |
1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ |
పవర్ |
68PS |
85PS |
టార్క్ |
91Nm |
114Nm |
ట్రాన్స్మిషన్ |
5MT / AMT |
5MT / AMT |
ఇంధన సామర్ధ్యం |
23.01kmpl / 24.04kmpl |
23.84kmpl |
ఇంధన ట్యాంక్ సామర్థ్యం |
28 లీటర్లు |
35 లీటర్లు |
టాటా టియగో ఇక్కడ స్పష్టమైన సామర్ధ్యం కలిగి ఉంది: ఇది మరింత శక్తివంతమైనది, అధిక సామర్థ్యం గల 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ని పొందుతుంది, ఇది క్విడ్ యొక్క 1.0 లీటర్ మోటార్ కంటే ఎక్కువ శక్తిని మరియు టార్క్ ని అందిస్తుంది. పెద్ద ఇంజిన్ ఉన్నప్పటికీ, టియాగో యొక్క మైలేజ్ సంఖ్యలు క్విడ్ తో పోలిస్తే బాగా భిన్నంగా అయితే ఏమీ లేవు, ఇది ఆకట్టుకుంది.
రెనాల్ట్ క్విడ్ RXT Vs టాటా టియాగో XE
లక్షణాలు మరియు ధరలు
లక్షణాలు |
రెనాల్ట్ క్విడ్ 1.0 RXT |
టాటా టియాగో XE |
ధర |
రూ.3.92 లక్షలు |
రూ.3.88 లక్షలు |
పవర్ స్టీరింగ్ |
అవును |
అవును (టిల్ట్ సర్దుబాటుతో) |
మల్టీ డ్రైవ్ రీతులు |
లేదు |
అవును |
అంతర్గతంగా సర్దుబాటు చేయగల ORVM |
లేదు |
అవును |
టాకోమీటర్ |
లేదు |
అవును |
పవర్ విండోస్ |
ఫ్రంట్ |
లేదు |
టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్ |
అవును |
లేదు |
కీలెస్ ఎంట్రీ |
అవును |
లేదు |
సెంట్రల్ లాకింగ్ |
అవును |
లేదు |
డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ |
లేదు |
లేదు |
ఫాగ్‌ల్యాంప్స్ |
అవును |
లేదు |
క్విడ్ 1.0 RXT మరియు టియాగో XE ల మధ్య ధర వ్యత్యాశం అనేది చాలా తక్కువ(ఎక్స్-షోరూమ్ ధరలో రూ .4,000 మాత్రమే), క్విడ్ అనేది ఇక్కడ ఎక్కువ ఖరీదు గల కారు అని చెప్పవచ్చు. కానీ టియాగో XE తో పోల్చితే ఇది మరింత విస్తృతమైన ఫీచర్ జాబితాను కలిగి ఉంది. ముఖ్యమైన లక్షణాలు క్విడ్ లో ఉన్నవి మరియు టియాగో లో లేనివి ఏమిటంటే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, సెంట్రల్ లాకింగ్, కీలెస్ ఎంట్రీ మరియు ఫ్రంట్ పవర్ విండోస్ వంటి లక్షణాలు. టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థ ఎంట్రీ-లెవల్ హాచ్బాక్ స్పేస్ లో ఒక తప్పక కావలసిన లక్షణంగా ఉండకపోవచ్చు, అయితే ఆడియో సిస్టమ్ మాత్రం ఖచ్చితంగా కావాలి మరియు అది టియాగో XE లో కనపడదు. కాబట్టి, క్విడ్ RXTఅనేది కావలసిన లక్షాణాలు కలిగి ఉండడం వలన కొనుగోలు దారులు ఎక్కువ డబ్బులు పెడతారు. దీనివలన ఈ క్విడ్ RXT ని కొనడం టియాగో కంటే ఎక్కువ మంచిదని చెప్పవచ్చు. తరువాత వేరియంట్ నుండి రెండు కార్లకి ఎయిర్బ్యాగ్ ఆప్షన్ అనేది ఉంటుంది. భద్రత విషయంలో రాజీపడకూడదు ఆ వేరియంట్స్ ఎంచుకోమని మేము సిఫార్సు చేస్తున్నాము.
కొనుక్కోవాలనుకొనే కారు: మెరుగైన భద్రత కోసం అధిక వేరియంట్లను కొనండి లేదా క్విడ్ RXT కోసం వెళ్ళండి.
రెనాల్ట్ క్విడ్ RXT (O) Vs టాటా టియాగో XE (O)
ధరలు మరియు లక్షణాలు
లక్షణాలు |
రెనాల్ట్ క్విడ్ 1.0 RXT (O) |
టాటా టియాగో XE (O) |
ధర |
రూ .4.04 లక్షలు |
రూ 4.10 లక్షలు |
డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ |
డ్రైవర్ వైపు మాత్రమే |
అవును |
ఎత్తు సర్దుబాటు డ్రైవర్ సీటు |
లేదు |
అవును |
లెదర్ ర్యాప్ తో స్టీరింగ్ వీల్ |
అవును |
లేదు |
ప్రెటెన్షనర్ మరియు లోడ్ పరిమితితో సీట్బెల్ట్ |
అవును |
అవును |
వారి ఆప్ష్నల్ వేరియంట్స్ లో టియాగో మరియు క్విడ్ మూడు అధనపు లక్షణాలను పొందుతున్నాయి. డ్రైవర్-సైడ్ ఎయిర్బాగ్ మరియు లెదర్ ర్యాప్ తో స్టీరింగ్ వీల్ తో , క్విడ్ RXT (O) ప్రధానంగా నగరంలో వ్యక్తిగత ఉపయోగం కోసం ఒక కారుగా మంచి ఎంపికగా ఉంటుంది. టియాగో XE (O) డ్యుయల్ ఎయిర్బ్యాగ్స్, ఎత్తు సర్దుబాటు డ్రైవర్ సీటు మరియు టిల్ట్-సర్దుబాటు స్టీరింగ్ తో సురక్షితమైన కారు మాత్రమే కాకుండా డ్రైవర్-దృష్టిని కూడా కలిగి ఉంటుంది. టియాగో యొక్క పెద్ద మరియు మరింత శక్తివంతమైన ఇంజిన్ దానిని కొంచెం క్విడ్ కంటే కూడా కొంచెం స్పీడ్ గా ఉండేలా చేస్తుంది అని చెప్పవచ్చు. మరోవైపు టియాగో ఆడియో వ్యవస్థ మరియు పవర్ విండోస్ వంటి లక్షణాలను కోల్పోవడం కొనసాగుతుంది. ఈ పవర్ విండోస్ ని కొనుగోలుదారులు తరువాత అమర్చుకోవచ్చు.
కొనుక్కోవాలనుకొనే కారు: టియాగో XE
రూ. 4.1 లక్షల కంటే ఎక్కువ
క్విడ్ RXT (O)అనేది ఎంట్రీ లెవల్ రెనాల్ట్ హాచ్బ్యాక్ యొక్క అత్యంత ఫీచర్-లోడ్ చేయబడిన వేరియంట్. క్విడ్ క్లైంబర్ మరియు సూపర్ హీరో ఎడిషన్స్ కూడా ఉన్నాయి,ఇవి క్విడ్ RXT (O)కన్నా ఖరీదైనవి, కానీ సౌందర్య విస్తరింపులను మాత్రమే కలిగి ఉంటాయి మరియు అదనపు ఉపకరణాలు పొందలేవు. మీరు క్విడ్ యొక్క ఏ వేరియంట్స్ ని కొనుగోలు చేసుకోవాలో ఇక్కడ చూడవచ్చు.
మీ బడ్జెట్ ఇంకా ఎక్కువగా ఉంటే, XE (O) కంటే కూడా టియాగో లో చాలా వేరియంట్స్ ఉన్నాయి. ఈ వేరియంట్స్ మరిన్ని లక్షణాలతో లోడ్ అవుతాయి, వాటిలో కొన్ని క్విడ్ యొక్క టాప్ వేరియంట్ లో కూడా లేవు. టియగో యొక్క టాప్ XZ వేరియంట్ లో మనకి టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, స్టీరింగ్ మెంటెడ్ కంట్రోల్, అల్లాయ్ వీల్స్, డే/ నైట్ IRVM, ABS, EBD మరియు కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, వెనుక డిఫేగ్గర్, వెనుక వైపర్ మరియు వాషర్, కూలెడ్ గ్లోవ్ బాక్స్, మరియు ఎలక్ట్రికల్ సర్దుబాటు ORVM లు వంటి లక్షణాలు ఉన్నాయి. ఇక్కడ టియాగో యొక్క అన్ని వేరియంట్ల గురించి మరింత తెలుసుకోండి.
ధరలు (ఎక్స్-షోరూమ్ న్యూఢిల్లీ):
రెనాల్ట్ క్విడ్ 1.0- లీటర్ |
టాటా టియాగో పెట్రోల్ |
1.0 RXL – రూ. 3.58 లక్షలు |
XE – రూ. 3.88 లక్షలు |
1.0 RXL AMT – రూ. 3.88 లక్షలు |
XE(O) – రూ. 4.10 లక్షలు |
1.0 RXT – రూ. 3.92 లక్షలు |
XM – రూ. 4.19 లక్షలు |
1.0 RXT(O) – రూ. 4.04 లక్షలు |
XM(O) – రూ. 4.41 లక్షలు |
క్లైంబర్ – రూ. 4.29 లక్షలు |
XT – రూ. 4.50 లక్షలు |
RXT(O) AMT – రూ. 4.34 లక్షలు |
XT AMT – రూ. 4.86 లక్షలు |
క్లైంబర్ AMT – రూ. 4.59 లక్షలు |
XT(O) – రూ. 4.72 లక్షలు |
XZ – రూ. 5.06 లక్షలు |
|
XZ AMT - రూ. 5.44 లక్షలు |
మీరు ఆటోమాటిక్ ని కొనుగోలు చేయాలనుకుంటే, మీరు క్విడ్ RXT (O) AMT మరియు టాప్-ఎండ్ టియాగో XZA (ఆటోమేటిక్ వేరియంట్) మధ్య మాత్రమే నే మీరు చూసుకోవాలి, ఎందుకంటే టియాగో AMT (టియాగో XTA) యొక్క తక్కువ వేరియంట్ ఒక ఆప్ష్నల్ గా కూడా ఎయిర్బ్యాగ్స్ ని పొందడం లేదు! అయితే, క్విడ్ RXT (O) AMT మరియు టియాగో XZ AMT ల మధ్య ధర గ్యాప్ అనేది (రూ 1.10 లక్షలు).
కానీ టియాగో XZA క్విడ్ RXT (O) AMT కంటే ఎక్కువ లక్షణాలను కలిగి ఉంది, ఉదాహరణకు LED టర్న్ ఇండికేటర్స్ తో ORVMs,స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ప్రయాణీకుల వైపు ఎయిర్‌బ్యాగ్, ఫాలో-మీ- హోమ్ హెడ్‌ల్యాంప్స్, వెనుక పార్కింగ్ సెన్సార్స్, డే / నైట్ IRVM, EBD తో ABS, వెనుక వైపర్ మరియు వాషర్, స్పోర్ట్ మోడ్ మరియు క్రీప్ ఫంక్షన్ తో ఆంట్, టిల్ట్ సర్దుబాటు స్టీరింగ్ వీల్, ఎత్తు సర్దుబాటు డ్రైవర్ సీటు, వెనుక పవర్ విండోస్, విద్యుత్ సర్దుబాటు ORVMs, మరియు కూలెడ్ గ్లోవ్ బాక్స్ వంటి లక్షణాలను కలిగి ఉంది. అన్ని ప్రాధమిక భద్రతా లక్షణాలు మరియు కొన్ని అదనపు సౌకర్య లక్షణాలతో, టియాగో ఆటోమేటిక్ మేము రెండు హాచ్బాక్స్ మధ్య సిఫార్సు చేస్తున్న కారు.
అదనంగా, టియాగో పై AMT గేర్బాక్స్ మాన్యువల్ మోడ్ ని కలిగి ఉంటుంది, అయితే క్విడ్ ఆంట్ ఒక షిఫ్ట్ లీవర్ కి బదులుగా ఒక రోటరీ డయల్ (ఒక డ్రైవ్ రీతితో మాత్రమే 'D') లభిస్తుంది. అయితే రోటరీ డయిల్ ఒక క్యూబిహోల్ కోసం అదనపు ఖాళీ ని ఇస్తుంది కానీ ఇది గేర్ షిఫ్ట్లపై డ్రైవర్ మాన్యువల్ నియంత్రణను అందించదు. రహదారులపై అధిగమించేందుకు మాన్యువల్ మోడ్ బాగా ఉపయోగపడుతుంది.
చివరి పదాలు: మొత్తంమీద, XE వేరియంట్ ని మినహాయించి, టియాగో పరిగణించదగిన మంచి కారు. ఇది పెద్దది, మరింత విశాలమైనది, మరింత శక్తివంతమైన ఇంజిన్ కలిగి ఉంది మరియు ఎక్కువ ఆచరణాత్మక లక్షణాలతో లోడ్ చేయబడింది. కానీ చాలా ముఖ్యంగా, ఇది మా అభిప్రాయం లో మరింత తెలివైన కొనుగోలు గా ఉంటుంది, ఎందుకంటే దీనిలో ఇది డ్యుయల్ ఎయిర్‌బ్యాగ్స్ అందించడం జరుగుతుంది.
Read More on : Tiago AMT