సెగ్మెంట్ల మధ్య పోరు: మహీంద్రా మారాజో VS UV500 - ఏ కారు కొనుగోలు చేసుకోవాలి?
మహీంద్రా మారాజ్జో కోసం raunak ద్వారా జూన్ 17, 2019 12:23 pm ప్రచురించబడింది
- 39 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఇది రెండు మహీంద్రా కార్లు మధ్య యుద్ధం - ఒకటి MPV మరియు మరొకటి మధ్యతరహా SUV. డబ్బుకి తగ్గట్టు మంచి విలువను ఏది అందిస్తుంది? మేము కనుక్కుంటాము
డీజిల్ ఆధారిత మహీంద్రా మారాజ్జో ధర రూ. 9.99 లక్షల నుండి రూ. 13.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, పాన్ ఇండియా) వరకూ ధరను కలిగి ఉంటుంది. ఇది రెనాల్ట్ లాడ్జీ మరియు రాబోయే రెండవ తరం మారుతి సుజుకి ఎర్టిగా వంటి MPV లకు పోటీగా వెళుతుంది. అయితే, ధర చార్ట్ లో, XUV500 తో పోటీ పడే మారాజ్జో వేరియంట్లను మీరు కనుగొంటారు, XUV500 రూ. 12.55 లక్షల నుంచి రూ. 19.26 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధరకే లభిస్తుంది.
ఈ రెండు మహీంద్రా కార్లలో లక్షణాల పరంగా మీకు ఏది ఉత్తమంగా ఉంటుంది అనేది లోతుగా చూద్దాము. కానీ వివరాలు లోకి వెళ్ళే ముందు, ఇక్కడ రెండిటి మధ్య ప్రాథమిక తేడాలు ఉన్నాయి:
మహీంద్రా మారాజ్జో |
మహీంద్రా XUV500 |
ఒక MPV: మరాజ్జో ఇక్కడ ఒక MPV గా ఉంది, ఎక్కువగా ప్రయాణికుల యొక్క సౌకర్యం దృష్టిలో పెట్టుకొని రూపొందించబడింది. |
ఒక SUV: XUV500 ఒక SUV, ఇది కఠినమైన రహదారులలో కూడా సులభంగా వెళ్ళే విధంగా రూపొందించబడింది. అయినప్పటికీ, ఇది మరాజ్జో వలే 7 సీటర్ గా ఉంటుంది. |
బాడీ-ఫ్రేమ్: ఇది ఒక లాడర్ ఫ్రేమ్ సెటప్ లో ఉంటుంది. మీకు ఇది పాత దాని లాగా అనిపిస్తుంది, కానీ ఈ సెటప్ ఎక్కువ మంది జనాలని తీసుకెళ్ళడానికి ఉత్తమమైనదిగా ఉంటుంది. |
మోనోకోక్: మహీంద్రా XUV 500 యూనిబాడీ నిర్మాణాన్ని కలిగి ఉంది, ఇది నిర్వహణకు సహాయపడుతుంది |
విశాలమైనది: మరాజ్జో XUV500 తో పోలిస్తే మంచి కాబిన్ స్పేస్ మరియు మంచి కార్గో సామర్థ్యం అందిస్తుంది. ఇది దాని SUV తోబుట్టువుల వలె కాకుండా 8-సీటర్ గా కూడా లభిస్తుంది. |
మూడవ వరుసలో ఇరుకైనది: మరాజ్జో తో పోలిస్తే, XUV500 యొక్క మూడవ వరుస ఇరుకైనది మరియు ఇది పిల్లలు కోసం మాత్రమే ఉత్తమమైనదిగా ఉంటుంది. |
డీజిల్-మాన్యువల్ మాత్రమే: మారాజ్జో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ తో మాత్రమే లభిస్తుంది, 2020 చివర వరకూ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో మాత్రమే జత చేయబడుతుంది. |
బహుళ పవర్ ట్రైన్ ఎంపికలు: XUV500 ఒక పెట్రోల్ ఇంజిన్ తో పాటుగా డీజిల్ ఆటోమెటిక్ పవర్‌టెయిన్ తో కూడా అందించబడుతుంది, డీజిల్-శక్తితో కూడిన XUV500 ఆల్-వీల్-డ్రైవ్ సెటప్ ని కూడా కలిగి ఉంటుంది. |
ఇంజిన్:
కొలతలు
ధర (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)
మహీంద్రా మారాజ్జో |
మహీంద్రా XUV500 |
M2 రూ. 9.99 లక్షలు |
|
M4 రూ. 10.95 లక్షలు |
|
M6 రూ. 12.40 లక్షలు |
W5 రూ. 12.55 లక్షలు |
M8 రూ. 13.90 లక్షలు |
W7 రూ. 13.81 లక్షలు |
W7 AT రూ. 15.01 లక్షలు |
|
W9 రూ. 15.47 లక్షలు |
|
W9 AT రూ. 16.67 లక్షలు |
|
W11 రూ. 16.71 లక్షలు |
|
W11 AT రూ. 17.91 లక్షలు |
|
W11 (O) రూ. 16.96 లక్షలు |
|
W11 (O) AT రూ. 18.16 లక్షలు |
|
W11 (O) AWD రూ. 18.06 లక్షలు |
|
W11 (O) AWD AT రూ. 19.26 లక్షలు |
వేరియంట్స్
రెండు కార్ల యొక్క ఒకే విధంగా ధర గల వేరియంట్లను (ధర వ్యత్యాసం <రూ .50,000) పోల్చడం మాత్రమే న్యాయం. కాబట్టి మేము మరాజ్జో యొక్క M6 మరియు M8 వేరియంట్లను XUV500 యొక్క W5 మరియు W7 వేరియంట్లతో పోల్చాము.
మహీంద్రా మరజ్జో M6 vs XUV500 W5
మహీంద్రా మార్జోజో M6 |
రూ. 12.40 లక్షలు |
మహీంద్రా XUV500 W5 |
రూ. 12.55 లక్షలు |
తేడా |
రూ. 15,000 (XUV500 ఖరీదైనది) |
సాధారణ లక్షణాలు:
లైట్స్: డ్యుయల్-బ్యారెల్ ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ (తక్కువ-బీం) మరియు మల్టీ-రిఫ్లెస్టర్ (హై-బీం) కార్నరింగ్ ల్యాంప్స్, ఫాలో మీ హోం హెడ్‌ల్యాంప్స్ తో
ఆడియో: బ్లూటూత్ ఫోన్ ఇంటిగ్రేషన్ తో ఆడియో సిస్టమ్
సౌకర్యాలు: హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్, ఫాబ్రిక్ అప్హోల్స్టరీ, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ORVMs, మాన్యువల్ ఎయిర్ కండిషనింగ్ మరియు వెనుక ఎయిర్ కండీషనింగ్ వంటి సౌకర్య లక్షణాలు ఉన్నాయి.
భద్రత: డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్ బాగ్స్, EBD తో ABS మరియు నాలుగు డిస్క్ బ్రేక్లు, వాషర్ మరియు వైపర్ తో రేర్ డెమిస్టర్ వంటి భద్రత లక్షణాలు ఉన్నాయి.
XUV500 పై మరాజ్జో ఏమిటి పొందుతుంది:
రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, అత్యవసర సహాయం (ఎయిర్బాగ్స్ బయటకి వచ్చేసేటప్పుడు ప్రమాదానికి సంబంధించి కనెక్ట్ చేయబడిన ఫోన్ ద్వారా ఆటోమెటిక్ గా అత్యవసర సేవలకు కాల్ వెళిపోతుంది), ఫ్రంట్ మరియు రేర్ ఫాగ్ ల్యాంప్స్, రెండవ వరుస కోసం కెప్టెయిన్ సీట్లు, అదనపు రూ. 5000 8 సీట్ ఆప్షన్, ముందు మరియు వెనుక USB ఛార్జర్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ISOFIX చైల్డ్ సీటు యాంకర్స్, డ్రైవర్ సీటు కోసం లంబర్ సపోర్ట్, బిల్ట్-ఇన్ నావిగేషన్ తో 7-ఇంచ్ రెసిస్టివ్ టచ్ స్క్రీన్ ఇంఫోటైన్మెంట్ వ్యవస్థ, 1GB బిల్ట్-ఇన్ మెమరీ మరియు మహీంద్రా బ్లూ సెన్స్ యాప్ మద్దతు, 4.2-అంగుళాల కలర్ డ్రైవర్ బహుళ-సమాచార ప్రదర్శన, అల్లాయ్ వీల్స్ వంటి లక్షణాలు ఉన్నాయి.
మరాజ్జోపై XUV500 ఏమి పొందుతుంది: ఇంజన్ స్టార్ట్-స్టాప్ తో మైక్రో హైబ్రిడ్ టెక్
తీర్పు: మహీంద్రా మారాజ్జో ఇక్కడ మా ఎంపికగా ఉంది, ఇది స్పష్టంగా ఈ రెండిటి మధ్య చక్కగా అమర్చబడిన కారుగా తెలుస్తుంది. సాపేక్షంగా ఖరీదైన SUV యొక్క బేసిక్ వేరియంట్ గా ఉండటంతో, XUV500 W5 మరాజ్జో M6 అందించే కొన్ని ప్రీమియం లక్షణాలను మిస్ అవుతుంది.
మహీంద్రా మారాజ్జో M8 vs XUV500 W7
మహీంద్రా మారాజ్జో M8 |
రూ. 13.90 లక్షలు |
మహీంద్రా XUV 500 W7 |
రూ. 13.81 లక్షలు |
తేడా |
రూ. 9000 (మరాజో ఖరీదైనది) |
సాధారణ లక్షణాలు (మునుపటి వేరియంట్స్ లో):
లైట్: ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, డే టైం రన్నింగ్ LED లు
ఆడియో: ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ తో 7 అంగుళాల కెపాసిటివ్ టచ్స్క్రీన్ (స్మార్ట్ఫోన్ లాంటి) ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, మహీంద్రా బ్లూ సెన్స్ అప్లికేషన్ సపోర్ట్ మరియు స్మార్ట్ వాచ్ కనెక్టివిటీ
సౌకర్యాలు: మాన్యువల్ రియర్ ఎయిర్ కండిషనింగ్ తో ఆటో క్లైమేట్ కంట్రోల్ ఎయిర్ కండిషనింగ్, క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ మరియు సర్దుబాటు చేయగల బయటి రియర్ వ్యూ మిర్రర్స్ మరియు ఎంట్రీ అసిస్ట్ లాంప్స్
భద్రత: అత్యవసర సహాయం (ఎయిర్బాగ్స్ బయటకి వచ్చేసేటప్పుడు ప్రమాదానికి సంబంధించి కనెక్ట్ చేయబడిన ఫోన్ ద్వారా ఆటోమెటిక్ గా అత్యవసర సేవలకు కాల్ వెళిపోతుంది), రివర్స్ పార్కింగ్ సెన్సార్స్
XUV500 పై మరాజ్జో ఎటువంటి లక్షణాలను అందిస్తుంది: లెదర్ అప్హోల్స్టరీ మరియు రియర్ విండో సన్షేడ్, మెషిన్ ఫినిషెడ్ అల్లాయ్ వీల్స్ వంటి లక్షణాలను అందిస్తుంది.
మరాజ్జో పై XUV500 ఎటువంటి లక్షణాలను అందిస్తుంది: ఇంజన్ పుష్ బటన్ స్టార్ట్-స్టాప్, అర్కమిస్ ధ్వని ట్యూనింగ్, ఆటో హెడ్ల్యాంప్స్, రెయిన్-సెన్సింగ్ వైపర్స్, గ్లాస్ యాంటెన్నా, బిల్ట్-ఇన్ దిక్సూస్, కన్వెర్జేషన్ మిర్రర్ వంటి లక్షణాలను అందిస్తుంది.
తీర్పు
మహీంద్రా XUV500 W7 ఇక్కడ ప్రధాన స్థానం తీసుకుంటుంది, ఇది ఈ రెండిటిలో డబ్బు కోసం మంచి విలువని అందిస్తుంది. W7 వేరియంట్లో, XUV500 టాప్-స్పెక్స్ మారాజ్జో కంటే ఎక్కువ లక్షణాలను అందిస్తుంది మరియు ఇది కూడా తక్కువ ధర వద్ద ఉంటుంది. అంతేకాక, మారాజో యొక్క ధరలు ప్రారంభంలో ఉన్నాయి మరియు ఇవి త్వరలో పెంచబడతాయి.
మహీంద్రా మరాజోను ఎందుకు కొనుగోలు చేసుకోవాలి?
విశాలమైన క్యాబిన్: మహీంద్రా చెప్పింది మరాజ్జో తన ఉత్పత్తుల్లో అత్యధిక అమ్ముడుపోయే వాహనం అని. నిజానికి, దాని వీల్ బేస్ XUV500 కంటే ఎక్కువ!
ఉపయోగపడే మూడవ వరుస: ప్రామాణిక ఫ్రంట్-వీల్-డ్రైవ్ సెటప్ తో మెరుగ్గా అమర్చబడిన ఇంజిన్ కి ధన్యవాదాలు తెలుపుకోవాలి మరియు అందువలన వెనకాతల డెడ్ రేర్ ఆక్సిల్ ఉంటూ మరాజ్జో ఫ్లాట్ ఫ్లోర్ అందిస్తుంది మరియు ముగ్గురు ఆరడుగుల మౌనుషులని ఒకరు తరువ్తా ఒకరిని కూర్చోబెట్టుకోగలదు, అలాగే పుష్కలమైన నీ(మోకాలు) రూం ని అందిస్తుంది.
ప్రయాణికులకు మంచి అనుభవం: మహీంద్రా మారాజ్జో రెండింటిలోనూ మరింత విశాలమైనది ఏమీ కాదు, కానీ వెనుక ప్రయాణీకులకు కొంచెం మెరుగ్గా ఉంటుంది. ఇది బేస్ M2 వేరియంట్ నుండి రెండవ వరుసకు కెప్టెన్ సీట్లను పొందుతుంది. అంతేకాక మరాజ్జో మధ్య మరియు వెనుక ప్రయాణీకులకు సరైన A.C యూనిట్ కలిగి ఉంది మరియు అది క్యాబిన్ ని చాలా త్వరగా చల్లబరుస్తుంది.
ఎందుకు 2018 మహీంద్రా XUV500 కొనుగోలు చేసుకోవాలి?
రోడ్డు పై మంచి ఉనికిని ప్రదర్శిస్తుంది: ఒక SUV గా ఉండడంతో, XUV500 చూడడానికి బచ్ గా కనిపిస్తుంది మరియు మరింత నిటారుగా కనిపిస్తోంది, ఇది మరజ్జో MPV తో పోలిస్తే మరింత గంభీరమైన వైఖరినిస్తుంది.
హై సీటింగ్ స్థానం: ఉన్నత రైడర్ కావడంతో, XUV500 మీకు మారాజ్జోతో పోలిస్తే కమాండింగ్ డ్రైవింగ్ స్థానాన్ని అందిస్తుంది.
పెట్రోల్ ఎంపిక:
మరాజ్జో లా కాకుండా, XUV500 పెట్రోల్ ఇంజిన్ ఎంపికతో కూడా వస్తుంది. ఇది 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ తో సమానమైన వాల్యూమ్ ని కలిగి ఉంటుంది మరియు ఇది టర్బో రీఛార్జిగా కూడా ఉంటుంది. ఇంజిన్ 140Ps శక్తిని / 320Nm వద్ద టార్క్ రేట్ చేయబడింది మరియు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటుంది. మహీంద్రా XUV500 పెట్రోల్ ధర రూ. 15.59 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వద్ద ఉంది.
డీజిల్-ఆటోమేటిక్ ఎంపిక: అలాగే XUV5OO డీజిల్-ఆటోమేటిక్ ఎంపికను కలిగి ఉంటుంది. మహీంద్రా సంస్థ చెబుతుంది 'మారాజ్జోతో ఆటో' బాక్స్ ని కూడా ఆఫర్ చేస్తామని, కానీ అది 2020 వరకు రాదు అని మాకు తెలుసు.
Read More on : Mahindra Marazzo diesel