• English
  • Login / Register

అత్యంత చౌకైన Citroen C3 Aircross You vs Maruti Grand Vitara Sigma కాంపాక్ట్ SUVల మధ్య వ్యత్యాసం

సిట్రోయెన్ aircross కోసం rohit ద్వారా సెప్టెంబర్ 27, 2023 03:53 pm ప్రచురించబడింది

  • 237 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

సిట్రోయెన్ C3 ఎయిర్ క్రాస్ భారతదేశపు చౌకైన కాంపాక్ట్ SUV కారు, ఇది మరో చౌకైన కారు అయిన మారుతి గ్రాండ్ విటారా సిగ్మా వేరియంట్ తో పోటీ పడుతోంది, రెండింటి మధ్య వ్యత్యాసం ఏమిటో తెలుసుకుందాం

Citroen C3 Aircross vs Maruti Grand Vitara

సిట్రోయెన్ C3 ఎయిర్ క్రాస్ ఇటీవల కాంపాక్ట్ SUV సెగ్మెంట్ లోకి ప్రవేశించింది. ఈ సెగ్మెంట్లో చౌకైన కార్లలో ఒకటైన దీని బేస్ వేరియంట్ ధర రూ .9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ సెగ్మెంట్లో 5-సీటర్ మరియు 7-సీటర్ లేఅవుట్లలో వచ్చే ఏకైక మోడల్ ఇది. 5-సీటర్ మరియు 7-సీటర్ వెర్షన్ లో మూడవ వరుస సీట్లను రిమూవ్ చేసుకోగల ఎంపిక ఉంటుంది. సిట్రోయెన్ C3 ఎయిర్ క్రాస్ యొక్క బేస్ యు వేరియంట్ 5-సీటర్ లేఅవుట్ లో మాత్రమే లభిస్తుంది.

C3 ఎయిర్క్రాస్ విడుదలకు ముందు, అత్యంత సరసమైన కాంపాక్ట్ SUV కారు మారుతి గ్రాండ్ విటారా, దీని బేస్ వేరియంట్ ధర రూ .10.70 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). మారుతి గ్రాండ్ విటారా SUV కంటే రూ.71,000 తక్కువ ధరకు లభించే ఈ ఈ ఫ్రెంచ్ SUV లో ఏ ఫీచర్లు ఉంటాయో, ఏవి ఉండవో తెలుసుకుందాము.

ఏ కారు పెద్దది?

పరామితి

సిట్రోయెన్ C3 ఎయిర్ క్రాస్

మారుతి గ్రాండ్ విటారా

వ్యత్యాసం

పొడవు

4323 మిల్లీమీటర్లు

4345 మిల్లీమీటర్లు

(22 మిల్లీమీటర్లు)

వెడల్పు

1796 మిల్లీమీటర్లు (ORVMలు లేకుండా)

1795 మిల్లీమీటర్లు

+1 మిల్లీమీటర్లు

ఎత్తు

1665 మిల్లీమీటర్లు

1645 మిల్లీమీటర్లు

+20 మిల్లీమీటర్లు

వీల్ బేస్

2671 మిల్లీమీటర్లు

2600 మిల్లీమీటర్లు

+71 మిల్లీమీటర్లు

చక్ర పరిమాణం

17 అంగుళాల వీల్

17 అంగుళాల వీల్

  • SUV పొడవు మినహా అన్ని పారామీటర్లలో C3 ఎయిర్ క్రాస్ మారుతి గ్రాండ్ విటారా కంటే పెద్దది.

  • దీని అధిక ఎత్తు మరియు అధిక వీల్ బేస్ 5-సీటర్ SUV సెగ్మెంట్ లో మంచి 3-వరుసల ఎంపికగా సామర్థ్యాన్ని చూపిస్తుంది.

పనితీరు పోలిక

స్పెసిఫికేషన్లు

సిట్రోయెన్ C3 ఎయిర్ క్రాస్

మారుతి గ్రాండ్ విటారా

ఇంజను

1.2-లీటర్ టర్బో-పెట్రోల్

1.5 లీటర్ పెట్రోల్

పవర్ 

110PS

103PS

టార్క్

190Nm

137Nm

ట్రాన్స్మిషన్

6-స్పీడ్ MT

5-స్పీడ్ MT

క్లెయిమ్  ఇంధన సామర్థ్యం

లీటరుకు 18.5 కి.మీ.

లీటరుకు 21.11 కి.మీ.

డ్రైవ్ ట్రైన్

FWD

FWD

Citroen C3 Aircross turbo-petrol engine

  • సిట్రోయెన్ C3 SUVలో కేవలం ఒక ఇంజన్-గేర్ బాక్స్ ఎంపిక ఉంది, కానీ మారుతి గ్రాండ్ విటారా లో మైల్డ్ మరియు స్ట్రాంగ్-హైబ్రిడ్ పవర్ట్రెయిన్ ఎంపికలు ఉంటాయి.

  • C3 ఎయిర్ క్రాస్ గ్రాండ్ విటారా కంటే మెరుగైన పనితీరును అందిస్తుంది, అయితే మైలేజ్ పరంగా, ఇది గ్రాండ్ విటారా కంటే వెనుకబడి ఉంది. గ్రాండ్ విటారాలో ఇంటెలిజెంట్ స్టార్టర్ మోటార్ యొక్క ప్రయోజనం ఉంది.

  • మారుతి గ్రాండ్ విటారాలో మ్యాన్యువల్ గేర్ బాక్స్ మరియు టాప్-స్పెక్ ఆల్ఫాతో ఆల్-వీల్ డ్రైవ్ ట్రెయిన్ (AWD) ఎంపిక చేయబడుతుంది.

  • మారుతి గ్రాండ్ విటారా SUVలో 1.5-లీటర్ స్ట్రాంగ్-హైబ్రిడ్ సెటప్ (116PS) ఆప్షన్ కూడా ఉంది, ఇది లీటరుకు 27.97 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

ఇది కూడా చదవండి: సిట్రోయెన్ C3 ఎయిర్క్రాస్ ఇమేజ్ గ్యాలరీ: యు, ప్లస్ మరియు మ్యాక్స్ వేరియంట్లలో ప్రత్యేకత ఏమిటి, ఇక్కడ తెలుసుకోండి

ప్రత్యేక ఫీచర్లు

ఫీచర్ హైలైట్స్

సిట్రోయెన్ C3 ఎయిర్ క్రాస్ యూ

మారుతి గ్రాండ్ విటారా సిగ్మా

ఎక్స్ టీరియర్

బాడీ కలర్ బంపర్లు మరియు ఎక్స్ టీరియర్ డోర్ హ్యాండిల్స్, టర్న్ ఇండికేటర్లతో కూడిన బ్లాక్ ORVMలు, ఫుల్ కవర్ లతో స్టీల్ వీల్స్ మరియు హాలోజెన్ హెడ్ లైట్లు

బాడీ కలర్ బంపర్లు, డోర్ హ్యాండిల్స్, LED DRLలతో హాలోజెన్ ప్రొజెక్టర్ హెడ్లైట్లు, LED టెయిల్లైట్లు, టర్న్ ఇండికేటర్లతో ORVMలు, ఫుల్ కవర్లతో స్టీల్ వీల్స్

ఇంటీరియర్

బ్లాక్ అండ్ గ్రే క్యాబిన్ థీమ్, 2-టోన్ ఫ్యాబ్రిక్ అప్ హోల్ స్టరీ, బ్లాక్ ఇన్ సైడ్ డోర్ హ్యాండిల్స్, ప్రయాణీకులందరికీ ఫిక్స్ డ్ హెడ్ రెస్ట్ లు మరియు ఫ్లాట్-ఫోల్డింగ్ రెండవ వరుస సీట్లు

2-టోన్ క్యాబిన్ థీమ్, క్రోమ్ ఇన్ సైడ్ డోర్ హ్యాండిల్స్, ఫ్రంట్ స్లైడింగ్ ఆర్మ్ రెస్ట్, కప్ హోల్డర్లతో రియర్ సెంటర్ ఆర్మ్ రెస్ట్, 2-టోన్ ఫ్యాబ్రిక్ సీట్లు, 60:40 స్ప్లిట్ ఫోల్డింగ్ రియర్ సీట్లు మరియు ప్రయాణీకులందరికీ సర్దుబాటు చేయగల హెడ్ రెస్ట్ లు

సౌకర్యం మరియు సౌలభ్యం

మాన్యువల్ ఏసీ, 1 టచ్ డౌన్ తో కూడిన నాలుగు పవర్ విండోలు, కీలెస్ ఎంట్రీ, డే-నైట్ IRVM, 7 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, టిల్ట్ స్టీరింగ్, డ్రైవర్ డిస్ ప్లే కోసం స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, పవర్ అడ్జస్టబుల్ ORVMలు

టిల్ట్ మరియు టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్, కీలెస్ ఎంట్రీ, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, వెనుక వెంట్ లతో ఆటో AC, ఎత్తు-సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు, మొత్తం నాలుగు పవర్ విండోలు మరియు పవర్డ్ ORVMలు (ఫోల్డ్ మరియు సర్దుబాటు)

ఇన్ఫోటైన్మెంట్

N.A.

N.A.

భద్రత

డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), హిల్ హోల్డ్ అసిస్ట్, రేర్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి.

డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, ESP, హిల్ హోల్డ్ అసిస్ట్, ప్రయాణికులందరికీ 3 పాయింట్ సీట్ బెల్ట్ లు, ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజ్ లు, రేర్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి.

Maruti Grand Vitara Sigma LED DRLs

  • ఈ రెండు SUV కార్ల బేస్ వేరియంట్లు ఎక్స్ టీరియర్ మరియు ఇంటీరియర్ లో దాదాపు ఒకే విధమైన ఫీచర్లు ఉన్నాయి. అయితే, మారుతి గ్రాండ్ విటారా సిగ్మా వేరియంట్ అదనపు ధరతో మరింత మెరుగైన ఫీచర్లతో వస్తుంది. సిట్రోయెన్ C3 ఎయిర్ క్రాస్ తో పోలిస్తే గ్రాండ్ విటారా LED DRLలు, LED టెయిల్ లైట్లు, ఫ్రంట్ మరియు రియర్ ఆర్మ్ రెస్ట్ లు, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ వంటి ఫీచర్లు అదనంగా ఉన్నాయి.

Citroen C3 Aircross digital driver's display

  • కంఫర్ట్ పరంగా, మారుతి గ్రాండ్ విటారా SUV సిట్రోయెన్ C3 ఎయిర్ క్రాస్ కారు కంటే మెరుగ్గా ఉంటుంది. సిట్రోయెన్ C3 ఎయిర్ క్రాస్ తో పోలిస్తే ఇది ఆటో AC, ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ ORVM లు మరియు ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు వంటి అదనపు కంఫర్ట్ ఫీచర్లు ఉన్నాయి. అదే సమయంలో, గ్రాండ్ విటారా సిగ్మా వేరియంట్తో పోలిస్తే C3 ఎయిర్క్రాస్ కారు 7 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లేతో వస్తుంది.

  • ఈ రెండు కార్ల బేస్ వేరియంట్లలో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అందుబాటులో లేదు.

  • డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, ESP, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఈ రెండు SUVల బేస్ వేరియంట్లలో కామన్. గ్రాండ్ విటారాతో పోలిస్తే C3 ఎయిర్క్రాస్ లో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) ఉంటుంది, గ్రాండ్ విటారా 3-పాయింట్ సీట్ బెల్ట్ మరియు ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజ్ వంటి భద్రతా లక్షణాలు ఉన్నాయి.

తీర్పు

Citroen C3 Aircross You variant rear

సిట్రోయెన్ C3 ఎయిర్ క్రాస్ ఒక విశాలమైన ఫ్యామిలీ SUV కారు. కొన్ని కంఫర్ట్ ఫీచర్స్ తో పాటు శక్తివంతమైన ఇంజిన్ తో వస్తున్న ఈ కారు ప్రవేశ ధర రూ .9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ).

Maruti Grand Vitara Sigma rear

దాని సమీప ధర పోటీదారుతో పోలిస్తే, మారుతి గ్రాండ్ విటారా అదనపు సౌలభ్యాలు మరియు సౌకర్యాలతో మెరుగైన మొత్తం ప్యాకేజీని అందిస్తోంది. ఈ SUV కారులో అనేక పవర్ ట్రైన్ ఎంపికలు ఉన్నాయి మరియు అధిక మైలేజీని కూడా ఇస్తుంది. ధర పెరిగేకొద్ది మరింత బలమైన పరికరాలతో వస్తుంది. 

ఇది కూడా చదవండి: ఆడి A8L సెక్యూరిటీ: VIPలకు ఈ కారు ఎలా సరిపోతుందో ఇక్కడ తెలుసుకోండి

ఇది కూడా చూడండి: సిట్రోయెన్ C3 ఎయిర్క్రాస్ ఆన్ రోడ్ ధర

was this article helpful ?

Write your Comment on Citroen aircross

explore similar కార్లు

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience