• English
  • Login / Register

చెవ్రొలెట్ ట్రెయిల్‌బ్లేజర్ VS టయోటా ఫార్చ్యూనర్ VS మిత్సుబిషి పజెరో స్పోర్ట్ - ఏది శక్తివంతమైనది?

చేవ్రొలెట్ ట్రైల్ కోసం అభిజీత్ ద్వారా అక్టోబర్ 23, 2015 05:34 pm సవరించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

చెవ్రొలెట్ రూ. 26,40 లక్షల  ధర ట్యాగ్ వద్ద ఎంతగానో ఎదురుచూస్తున్న ట్రయల్బ్లేజర్ ని ప్రారంభించింది. ఈ ఏడు సీట్లు ఎస్యువి ఇప్పుడు దాని విభాగంలో అతిపెద్ద ఎస్యువి మరియు చాలా శక్తివంతమైనది. మేము ఈ విభాగంలో అధిపతైన టయోటా ఫార్చ్యూనర్ మరియు మిత్సుబిషి పజెరో స్పోర్ట్ తో పోల్చి చూస్తాము.  

బాహ్యభాగాలు:

పరిమాణం విషయానికి వస్తే, ఎటువంటి కారు బాడీ కూడా దీనితో పోటీ పడలేని విధంగా పొడవైనది మరియు చాలా విశాలమైనది. అంతేకాకుండా, ఇది విభాగంలో ఉత్తమమైనటువంటి 231mm గ్రౌండ్ క్లియరెన్స్ తో అందించబడుతుంది. అలానే వెనుక వీల్ అమరిక తో మాత్రమే అందించబడుతుంది. ఈ శ్రేణిలో ట్రెయిల్‌బ్లేజర్ ఒక తాజా సమర్పణ మరియు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అందరి దృష్టిని ఆకర్షించేలా ఉంటుంది.

అంతర్భాగాలు:

ట్రైల్బ్లేజర్ యొక్క అంతర్భాగాలలో ముఖ్యమైన అంశం ఈ విభాగంలో అత్యంత అభివృద్ధి గల మీడియా-నావిగేషన్ యూనిట్ ని కలిగియున్న మై లింక్ సమాచార వ్యవస్థను కలిగి ఉండడం. అంతేకాకుండా టొయోటా ఫార్చ్యూనర్ మరియు పజెరో స్పోర్ట్ రెండిటితో పోలిస్తే దీనిలో అంతర్భాగాలు చాలా కొత్తగా కనిపిస్తాయి. అంతేకాకుండా అత్యుత్తమ బాహ్య కొలతలు, మొదటి మరియు రెండవ వరుసలో ప్రయాణికుల కోసం విశాలమైన స్థలం అందుబాటులో ఉన్నాయి. అయితే, వెనుక వరుసలో స్థలం అంత మంచిగా లేదు, కానీ ఫార్చ్యూనర్ మరియు పజెరో కంటే ఉత్తమంగా ఉంది.

ఇంజిను వివరాలు

ఇందులో సరికొత్త 2.8-లీటర్ ఇంజిను ఉండి ఇది కొత్త తరం జీఎం ఇంజిన్ల నుండి పునికి వచ్చింది. ఇది 200ps శక్తి మరియూ 500Nm టార్క్ విడుదల చేయగలదు. ఇవి కాకుండా, 6-స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషంతో జత చేయబడుతుంది. ఇది పజెరో ఇంకా ఫార్చునర్ కి ఉన్న 5-స్పీడ్ యూనిట్ కంటే మెరుగైనది.

లోపాలు

ఎవరైనా 4x4 ఎస్‌యూవీ కావాలి అనుకుంటే, వారికి నిరాశే ఎందుకంటే ట్రెయిల్‌బ్లేజర్ కేవలం 4x2 సెటప్ తో వస్తుంది. కానీ పజెరో మరియూ ఫార్చునర్ లకి 4x4 ఎంపిక ఉంది. ఈ 4x4 ఆప్షన్ కాకుండా టొయోటా వారు ఆటోమాటిక్ ఆప్షన్ ని 4x4 రూపంలో అందిస్తున్నారు. పజెరో వారు కేవలం 4x2 ని అందిస్తున్నారు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Chevrolet ట్రైల్

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience