చెవ్రొలే ఇండియా వారి ట్రెయిల్‌బ్లేజర్ వివరాలు వారి వెబ్‌సైట్ లో!
అక్టోబర్ 12, 2015 01:54 pm raunak ద్వారా సవరించబడింది
- 13 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఇది క్యాప్టివా తరువాత ప్రీమియం ఎస్‌యూవీ విభాగంలో జీఎం ఇండియా వారు ప్రవేశపెడుతున్న రెండవ వాహనం
జైపూర్:
రాబోయే ట్రెయిల్‌బ్లేజర్ ఇప్పుడు చెవ్రొలే వారి అధికారిక వెబ్‌సైట్ లో ఉంది . ఈ ఎస్‌యూవీ అక్టోబరు 21న విడుదల కానుంది. దీని పోటీగా టొయోటా ఫార్చునర్ ఇంకా మిత్సుబిషి పజెరో స్పోర్ట్ ఇంకా రాబోయే ఫోర్డ్ ఎడెవర్ లు నిలవనున్నాయి. ఇది CBU దిగుమతి అని మరియూ కేవలం ఒకే ఒక్క వేరియంట్ లో లభ్యూం అని ఇంకా రూ. 29 లక్షలకు (ఎక్స్-షోరూం) లభ్యం అవచ్చు అని వినికిడి.
ఇందులో 2.8-లీటర్ Duramax డీజిల్ మోటరు ఉంటుంది. ఈ 4-సిలిండర్ మోటరు 3600rpm వద్ద 200Ps శక్తిని ఇంకా 2000rpm వద్ద 500Nm టార్క్ ని విడుదల చేస్తుంది. ఇప్పటికి, ఇది 4x2 తో 6-స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ కలిగి ఉంటుంది. పైగా, ఇందులో చెవ్రొలే మైలింక్ టచ్‌స్క్రీన్ ఇంఫొటెయిన్‌మెంట్ సిస్టము ని మొదటి సారిగా ప్రవేశపెట్టనున్నారు. దీనికి 7 అంగుళాల యూనిట్ జత ఉంటుంది. ఈ ఇంఫొటెయిన్‌మెంట్ సిస్టము శాటిలైట్ నావిగేషన్, రివర్స్ పార్కింగ్ క్యామెరా తో సెన్సార్స్ ఇంకా ఎన్నో కనెక్టివిటీ ఎంపికలను కలిగి ఉంటుంది.
రక్సణ విషయానికి వస్తే, ఇందులో డ్యువల్-ఫ్రంట్ ఎయిర్-బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ మరియూ ఏబీఎస్+ఈబీడీ వంటివి ఉంటాయి. కంపెనీ వారు 4x4 వెర్షంతో పాటుగా తరువాతి కాలంలో మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్స్ ని కూడా అందించవచ్చును.