షెవ్రోలే వారి బీట్ ఎసన్షియా కొత్త సబ్-4 మీటర్ సెడాన్ విభాగంలో ప్రవేశపెట్టబడబోతోంది
ఫిబ్రవరి 01, 2016 03:42 pm అభిజీత్ ద్వారా ప్రచురించబడింది
- 19 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
షెవ్రోలే వారు వారి యొక్క సరికొత్త కాంపాక్ట్ సెడాన్ శ్రేణి వాహనం అయిన షెవర్లే ఎసన్షియా ను ప్రదర్శించబోతున్నారు. సంస్థ యొక్క ఈ వాహనం 2013 ఇండియన్ ఆటో ఎక్స్పో లో తొలిసారి ప్రదర్శితం అయి ఉత్పత్తిలో ఉంది. ఈ వాహనానికి ఇప్పటివరకూ వెలువడిన ప్రకటనల ప్రకారం ఎసన్షియా అని నామకరణం చేయడం జరిగింది. ఇది ఈ శ్రేణి లోని స్విఫ్ట్ డిజర్, హ్యుందాయి ఆక్సెంట్, హ్యుందాయి అమేజ్ మరియు ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ వాహనాలకు పోటీగా రాబోతోంది.
ఎసన్షియా గురించి చెప్పాలంటే ఈ వాహనంలో 1.0 లీటర్ డీజిల్ మోటార్ మరియు 1.2 లీటర్ పెట్రోల్ యూనిట్లను కలిగిన ఎంపికలతో శక్తిని అందుకొని ఇప్పుడు ఉన్నటువంటి బీట్ కు సమానంగా ఉండబోతోంది. వాహనం యొక్క బాహ్య రూపు రేఖలు గురించి ఎటువంటి వివరాలు లేనప్పటికీ ఇది ప్రస్తుతం ఉన్నటువంటి బీట్ కి భిన్నంగా ఉండవచ్చని అంచనా. కానీ ఈ వాహనం 2013 నుంచి ఉత్పత్తిలో ఉన్నందున బహుశా అంతర్గత భాగాలు బీట్ ను పోలి ఉండవచ్చని భావిస్తున్నారు.
అంతేకాకుండా ఈ అమెరికన్ తయారీసంస్థ రాబోయే కాలంలో వారి యొక్క మరిన్ని ఉత్పత్తులను ప్రవేశపెట్టే అవకాసం ఉంది. ఉదాహరణకు MPV స్పిన్, స్పోర్ట్స్ కారు కేమరో మరియు కొలరాడో ఎస్యువి. అయితే స్పిన్ వాహనం 2017 సంవత్సరంలో ప్రవేశపెట్టబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా కేమరో మరియు కొలరాడో వాహనాలు వాహన ప్రియులను ఉత్తేజపరిచే విధంగా ఉండబోతున్నాయని అంచనా. బహుశా అందుకనే ఈ తయారీసంస్థ మరిన్ని నవీకరించబడిన ఉత్పత్తులను తీసుకువస్తూ షెవీ యొక్క భారతీయ అమ్మకాలను పెంచే ప్రయత్నం చేస్తోంది అని కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుత దేశీయ పరిస్తితులలో షెవ్రోలే వారి స్థానం పట్టు తప్పుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి.
ఇటీవలి షెవ్రోలే వారి వాహనం యొక్క విశేషాలు: రూ. 14.68 లక్షల ధర వద్ద ప్రారంభించబడిన 2016 చేవ్రొలెట్ క్రుజ్