• English
  • Login / Register

2016 భారత ఆటో ఎక్స్పో లొకి రాబోతున్న చెరోకీ ఎస్ ఆర్ టి

జీప్ గ్రాండ్ చెరోకీ 2016-2020 కోసం manish ద్వారా జనవరి 13, 2016 11:40 am ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

చెరోకీ ఎస్ ఆర్ టి అనునది జీప్ యొక్క హాలో ఉత్పత్తి. ఈ చెరోకీ వాహనం, వచ్చే నెల 5 నుండి  వ తేదీలలో జరుగనున్న 2016 భారత ఆటో ఎక్స్పోలో ప్రదర్శించబడే అవకాశాలు ఉన్నాయి. అమెరికన్ వాహన తయారీదారులు, ఈ చెరోకీ వాహనం చివరికి భారతదేశం లో ప్రారంభించబడుతుంది అని వెల్లడించారు. ఈ చిరోకీ వాహనం, దేశంలో ఉండే అధికార్ వెబ్సైట్ లో ఈ స్పోర్ట్స్ ఎస్యువి విభాగంలో ఈ వాహనం ప్రదర్శింపబడుతుంది. దీనితో పాటు వీరి లైనప్ లో ప్రామాణిక గ్రాండ్ చెకోరీ మరియు వ్రాంగ్లర్ వాహనాలు ప్రదర్శింపబడతాయి. ఈ ఎస్యువి వాహనం, అధిక స్థానభ్రంశాన్ని కలిగిన ఇంజన్ తో అదే విధంగా అనేక గాడ్జెట్ లతో రాబోతుంది మరియు శక్తివంతమైన ఇంజన్ తో అలాగే వాహన ఆకర్షణీయమైన క్యాబిన్ తో రాబోతుంది.

హుడ్ క్రింది భాగం విషయానికి వస్తే, ఈ జీప్ గ్రాండ్ చెరోకీ ఎస్ ఆర్ టి వాహనం 6.4 లీటర్ హెచ్ ఈ ఎం ఐ ఇంజన్ తో రాబోతుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 475 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 644 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ పవర్ ప్లాంట్లు, 8- స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. దీని ద్వారా, విడుదల అయిన టార్క్ ఉత్పత్తి వాహనం యొక్క అన్ని చక్రాలకు పంపిణీ చేయబడుతుంది. మరోవైపు ఈ వాహనం యొక్క త్వరణం విషయానికి వస్తే, 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 5 సెకన్ల సమయం పడుతుంది. 

మొత్తం లేఅవుట్ పరంగా, ఈ చెకోరీ ఎస్ ఆర్ టి వాహనం, పోర్చే కయేన్, బిఎండబ్ల్యూ ఎక్స్ 5 ఎం వంటి వాహనాలతో గట్టి పోటీ ను ఇస్తుంది.  

క్యాబిన్ లోపలి భాగం విషయానికి వస్తే, క్యాబిన్ లోపలి భాగంలో లెధర్ తో కప్పబడిన సీట్లు అలాగే లెధర్ తో కప్పబడిన డాష్బోర్డ్ కన్సోల్ వంటి సౌకర్య అంశాలు క్యాబిన్ లో ఉండే ప్రయాణికులకు ఆహ్లాదకరమైన వారావరణాన్ని సృష్టిస్తాయి. వినోద విభాగం విషయానికి వస్తే, ఈ వాహనం లో 19 స్పీకర్ల సంగీత వ్యవస్థ తో కూడిన 8.4 అంగుళాల టచ్ స్క్రీన్ సమాచార వ్యవస్థ అందించబడుతుంది. 

ఈ సమాచార ప్రదర్శన కూడా ఈ స్పోర్ట్స్ ఎస్యువి యొక్క పనితీరు గణాంకాలను ప్రతిబింబిస్తుంది

ఇవి కూడా చదవండి:

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Jeep గ్రాండ్ చెరోకీ 2016-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience