• English
  • Login / Register

రాబోయే వోల్వో ఎస్60 క్రాస్ కంట్రీ - ఎస్‌యూవీ వంటి గ్రౌండ్ క్లియరెన్స్ కలిగిన సెడాన్!

వోల్వో ఎస్60 2015-2020 కోసం konark ద్వారా అక్టోబర్ 13, 2015 03:54 pm ప్రచురించబడింది

  • 16 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

Volvo S60

వోల్వో వారు ఎస్60 క్రాస్ కంట్రీ ని 2015 డెట్రాయిట్ మోటర్ షోలో ప్రదర్శించింది మరియూ ఇప్పుడు ఈ స్వీడిష్ కారు తయారిదారి ఈ వాహనాన్ని 2016 మొదటి భాగంలో మార్కెట్ లోకి తీసుకు వస్తాము అని ధృవీకరించారు.

ఈ ఎస్60 క్రాస్ కంట్రీ లో మామూలు సెడాన్ ల కంటే మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్ ని కలిగి ఉంది. ఎప్పుడైనా ఒక్క సారి ఆఫ్-రోడింగ్ కి వెల్లాలి అని అనుకునే ఔత్సాహికులకు ఇందులో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టము ఉండటం ఉపయోగకరం. ఇందులో రైడ్ హైట్ అడ్జస్టింగ్ ఎగుడు దిగుడు రోడ్ల పై ఉపయోగపడుతుంది.

Volvo S60
 
ప్రపంచవ్యాప్తంగా ఈ స్వీడిష్ క్రాస్-సెడాన్ కి ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఇంకా ఫోర్ వీల్ డ్రైవ్ ఆప్షన్ ని కలిగి ఉంటుంది. కాకపోతే, మన మార్కెట్ కి ఇది 5-సిలిండర్ల 2.4-లీటర్ డీజిల్ 4 ఇంజిను ఉండి ఇది 178bhp శక్తిని విడుదల చేస్తుంది. ఈ క్రాస్ వర్షన్ కి ఎస్60 సెడాన్ కంటే 65mm అధిక గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. 

ఈ ఎస్60 సెడాన్ కి సన్-రూఫ్, హీటెడ్ ఫ్రంట్ సీట్లు, రివర్స్ పార్కింగ్ క్యామెరా మరియూ శాటిలైట్-నావిగేషన్ సిస్టము ఉంటాయి. ఇవి ఇంతకు మునుపటి ఎస్60 కి కూడా ఉన్నాయి. ఈ కారు రూ. 50 లక్షల ధర ఉండవచ్చును. ఇది మునుపటి ఎస్60 సెడాన్ కంటే 5 నుండి 10 లక్షలు అధికం.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Volvo ఎస్60 2015-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience