ఈ వివరణాత్మక గ్యాలరీలో 5 Door Mahindra Thar Roxx వివరాలు
మహీంద్రా థార్ రోక్స్ కోసం ansh ద్వారా ఆగష్టు 14, 2024 10:51 pm ప్రచురించబడింది
- 412 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఇది కొత్త 6-స్లాట్ గ్రిల్, ప్రీమియం లుకింగ్ క్యాబిన్, పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లు అలాగే అనేక ఆధునిక ఫీచర్లను పొందుతుంది.
5-డోర్ల మహీంద్రా థార్ రోక్స్ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత విడుదల చేయబడింది మరియు దీని ధరలు రూ. 12.99 లక్షల నుండి ప్రారంభమవుతాయి (పరిచయ, ఎక్స్-షోరూమ్). 3-డోర్ వెర్షన్‌తో పోలిస్తే థార్ యొక్క పెద్ద వెర్షన్ కొద్దిగా భిన్నంగా కనిపించే ముందు భాగం, రెండు అదనపు డోర్లు, వైట్ క్యాబిన్ మరియు అనేక కొత్త ఫీచర్‌లను పొందుతుంది అలాగే ఇది మరింత శక్తివంతమైన పవర్‌ట్రెయిన్‌లతో వస్తుంది. మీకు ఇంకా థార్ రోక్స్‌ని చూసే అవకాశం రాకుంటే, మీరు ఈ వివరణాత్మక గ్యాలరీలో దాన్ని తనిఖీ చేయవచ్చు.
ఎక్స్టీరియర్
ముందువైపు, థార్ రోక్స్ కొత్త 6-స్లాట్ గ్రిల్‌తో నలుపు మరియు రౌండ్ LED హెడ్‌ల్యాంప్‌లతో C-ఆకారపు DRLలతో రూపొందించబడింది.
బంపర్, ఫాగ్ ల్యాంప్స్ మరియు ఇండికేటర్లు కూడా కొద్దిగా సవరించబడ్డాయి. అయితే, వీల్ ఆర్చ్‌లు 3-డోర్ వెర్షన్ లాగానే ఉంటాయి.
సైడ్ భాగం నుండి, మీరు థార్ యొక్క ఎలాంగేటెడ్ పొడవు గురించి ఒక ఆలోచనను పొందుతారు మరియు మీరు రెండు అదనపు డోర్లు, సి-పిల్లర్ మౌంటెడ్ నిలువు వెనుక డోర్ హ్యాండిల్స్ మరియు మెటల్ సైడ్ స్టెప్‌ను కూడా గమనించవచ్చు.
ఇది 19-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌ను కూడా పొందుతుంది.
వెనుకవైపు డిజైన్‌లో, C-ఆకారపు ఇన్‌సర్ట్‌లతో కూడిన LED టెయిల్ లైట్లు, టెయిల్‌గేట్-మౌంటెడ్ స్పేర్ వీల్ మరియు చంకీ బంపర్ ఉన్నాయి.
ఇంటీరియర్
ఇది డ్యూయల్-టోన్ నలుపు మరియు లెథెరెట్ ప్యాడింగ్ అలాగే కాపర్ స్టిచింగ్‌తో డాష్‌బోర్డ్‌ను పొందుతుంది. డ్యాష్‌బోర్డ్‌లో రౌండ్ AC వెంట్స్, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఉన్నాయి.
ముందు సీట్లు తెల్లటి లెథెరెట్ అప్హోల్స్టరీని పొందుతాయి మరియు అవి వెంటిలేషన్ ఫంక్షన్‌తో కూడా అందించబడతాయి. ఈ సీట్లు బ్యాక్‌రెస్ట్‌లో "థార్" అనే పేరు కూడా ఉంటుంది.
వెనుక సీట్లు కూడా తెల్లటి అప్హోల్స్టరీతో సమానమైన ఫినిషింగ్ ను పొందుతాయి మరియు అవి కప్‌హోల్డర్‌లతో కూడిన సెంటర్ ఆర్మ్‌రెస్ట్‌తో వస్తాయి.
ఫీచర్లు & భద్రత
డ్యూయల్ 10.25-అంగుళాల స్క్రీన్‌లు మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు కాకుండా, థార్ రోక్స్ వెనుక AC వెంట్‌లు, హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్ అలాగే వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్‌తో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌ను కూడా పొందుతుంది.
మహీంద్రా థార్ రోక్స్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్లను పనోరమిక్ సన్‌రూఫ్‌తో అందిస్తోంది, అయితే దిగువ శ్రేణి వేరియంట్‌లు సింగిల్-పేన్ యూనిట్‌ను పొందుతాయి.
భద్రత పరంగా, ఇది 6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్ హోల్డ్ మరియు డీసెంట్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) అలాగే 360-డిగ్రీ కెమెరాను పొందుతుంది. మహీంద్రా అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ మరియు అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి లెవల్ 2 ADAS (అధునాతన డ్రైవర్ సహాయ వ్యవస్థలు) ఫీచర్‌లతో థార్ రోక్స్‌ను కూడా అందిస్తోంది.
పవర్ ట్రైన్
మహీంద్రా థార్ రోక్స్‌ను రెండు ఇంజన్ ఎంపికలతో అందిస్తుంది: 2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ (161 PS మరియు 330 Nm), మరియు 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ (152 PS మరియు 330 Nm).
ఈ రెండు ఇంజన్లు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందించబడతాయి.
3-డోర్ వెర్షన్ లాగానే, 5-డోర్ థార్ రోక్స్ కూడా రేర్ వీల్ డ్రైవ్ మరియు ఫోర్-వీల్ డ్రైవ్ సెటప్‌లతో వస్తుంది.
అంచనా ధర & ప్రత్యర్థులు
5-డోర్ల మహీంద్రా థార్ రోక్స్ ధరలు రూ. 12.99 లక్షల నుండి ప్రారంభమవుతాయి (పరిచయ, ఎక్స్-షోరూమ్), మరియు వేరియంట్ వారీగా ధరలు త్వరలో వెల్లడి చేయబడతాయి. ఇది 5-డోర్ల ఫోర్స్ గూర్ఖాకి ప్రత్యక్ష ప్రత్యర్థి, మారుతి జిమ్నీకి పెద్ద మరియు మరింత ప్రీమియం ప్రత్యామ్నాయంగా పరిగణించబడుతుంది.
ఆటోమోటివ్ ప్రపంచం నుండి తక్షణ అప్‌డేట్‌లను పొందడానికి కార్దెకో వాట్సప్ ఛానెల్‌ని అనుసరించండి.
మరింత చదవండి : థార్ రోక్స్ ఆన్ రోడ్ ధర