2024 Kia Sonet Faceliftని మీ సమీప డీలర్‌షిప్ వద్ద తనిఖీ చేయండి
కియా సోనేట్ కోసం shreyash ద్వారా జనవరి 11, 2024 12:05 pm సవరించబడింది
- 696 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
కొత్త కియా సోనెట్ యొక్క బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి, దీని ధరను జనవరి మధ్య నాటికి వెల్లడించవచ్చు.
కియా సోనెట్ ఫేస్ లిఫ్ట్ ముందే ఆవిష్కరించబడింది మరియు దీని ధర జనవరి మధ్య నాటికి వెల్లడించవచ్చు. వినియోగదారులు అధికారిక విడుదలకు ముందు రూ.25,000 టోకెన్ అమౌంట్ చెల్లించి ఈ SUV కారును బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2024 కియా సోనెట్ డీలర్షిప్లకు రావడం ప్రారంభమయ్యింది, మీరు మీ సమీప షోరూమ్ను సందర్శించి నిశితంగా చూడవచ్చు.
చిత్రంలో కనిపిస్తున్నది 2024 కియా సోనెట్ యొక్క టాప్ GTX+ మోడల్. టెక్ లైన్, GT లైన్ (చిత్రంలో ఉన్న విధంగా), X-లైన్ అనే మూడు వేరియంట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఫ్రంట్ ఫ్యాసియా డిజైన్ లో అప్ గ్రేడ్ చేయబడింది మరియు ఇందులో పొడవైన ఫాంగ్ ఆకారంలో LED DRLలు అందించబడ్డాయి. వీటితో పాటు బంపర్, ఫాగ్ ల్యాంప్స్ ను కూడా అప్ గ్రేడ్ చేశారు.
ఇది కూడా చదవండి: ఎలివేట్ SUV, సిటీ సెడాన్ ధరలు పెంచిన హోండా ఎలివేట్
సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, 2024 కియా సోనెట్ కొత్త అల్లాయ్ వీల్స్ మినహా పాత మోడల్ మాదిరిగానే కనిపిస్తుంది. కొత్త సోనెట్ వెనుక భాగంలో, ఇప్పుడు కనెక్టెడ్ LED టెయిల్లైట్లు మరియు కొత్త బంపర్లు అందించబడ్డాయి.
ఫేస్ లిఫ్ట్ కియా సోనెట్ యొక్క డ్యాష్ బోర్డ్ లేఅవుట్ మారలేదు, అయినప్పటికీ అప్ గ్రేడ్ గా, దీనికి కొత్త క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్ మరియు కొత్త అప్ హోల్ స్టరీ ఇవ్వబడ్డాయి. ఇందులో 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. కొత్త సోనెట్ లో మునుపటి మాదిరిగానే సింగిల్-ప్యాన్ సన్రూఫ్ మరియు వైర్లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.
ప్రయాణికుల భద్రత పరంగా ఇందులో ఆరు ఎయిర్ బ్యాగులు, 360 డిగ్రీల కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఇందులో లెవెల్ 1 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) కూడా ఉంది, దీని కింద లేన్-కీప్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్ మరియు బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.
ఇది కూడా చదవండి: 2024 లో విడుదలకు ముందే మళ్ళీ కనిపించిన స్కోడా ఎన్యాక్ EV
చిత్రంలో ఉన్నది, డీలర్షిప్కు వచ్చిన సోనెట్ డీజిల్-ఆటోమేటిక్ వేరియంట్. ఇది 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్తో పనిచేస్తుంది మరియు 116 PS శక్తిని మరియు 250 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది మూడు ట్రాన్స్మిషన్ ఎంపికలతో లభిస్తుంది: 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6-స్పీడ్ iMT (క్లచ్లెస్ మాన్యువల్) మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇతర ఇంజిన్ ఎంపికలలో 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో జతచేయబడిన 1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ (83 PS / 115 Nm) మరియు 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్తో జతచేయబడిన (120 PS / 172 Nm) 6-స్పీడ్ iMT (క్లచ్లెస్ మాన్యువల్) లేదా 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్ మిషన్ తో (DCT) అందించబడుతుంది.
ఆశించిన ధర & ప్రత్యర్థులు
2024 కియా సోనెట్ ధర రూ.8 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవచ్చు. ఇది టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ మరియు మహీంద్రా XUV300 వంటి మొడళ్ళతో పోటీ పడనుంది.
మరింత చదవండి : కియా సోనెట్ ఆటోమేటిక్