• English
  • Login / Register

5 చిత్రాలలో 2023 Tata Harrier డార్క్ ఎడిషన్ؚ సంపూర్ణ వివరణ

టాటా హారియర్ కోసం ansh ద్వారా అక్టోబర్ 25, 2023 12:51 pm ప్రచురించబడింది

  • 79 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

టాటా హ్యారియర్ డార్క్ ఎడిషన్ భారీ అలాయ్ వీల్స్ ఎంపికతో పూర్తి నలుపు ఇంటీరియర్ మరియు ఎక్స్‌టీరియర్‌ను కలిగి ఉంటుంది

2023 Tata Safari Dark Edition

2023 టాటా హ్యారియర్ ఫేస్ؚలిఫ్ట్ ఇటీవల విడుదలైంది మరియు డిజైన్, ఫీచర్‌లు మరియు భద్రతతో సహా అనేక మెరుగుదలలతో వచ్చింది, అయితే డార్క్ ఎడిషన్ ఎంపిక ఒకటి మాత్రం అలాగే ఉంది. నవీకరించిన ఈ SUV ఇప్పటికీ పూర్తి-నలుపు రంగుతో వస్తుంది మరియు దీన్ని మా వివరణాత్మక గ్యాలరీలో మీరు పరిశీలించవచ్చు. 

ఫ్రంట్

2023 Tata Harrier Dark Edition Front

డార్క్ హ్యారియర్ నలుపు రంగు గ్రిల్, నలుపు రంగు బంపర్ మరియు నలుపు రంగు స్కిడ్ ప్లేట్ؚతో పూర్తి నలుపు రంగు ఎక్స్ؚటీరియర్ؚను కలిగి ఉంటుంది. కేవలం టాటా లోగో మాత్రమే నలుపు రంగులో కాకుండా క్రోమ్ కోటింగ్‌తో వస్తుంది. 

ఇది కూడా చూడండి: సరికొత్త టాటా కర్వ్ కూపే డిజైన్ؚను వివరించే తాజా రహస్య చిత్రాలు 

సైడ్

2023 Tata Harrier Dark Edition Side

సైడ్ ప్రొఫైల్ కూడా అదే నలుపు ట్రీట్మెంట్ؚను పొందింది. రూఫ్ రైల్స్, ORVMలు మరియు డోర్ హ్యాండిల్ؚలు నలుపు రంగు వేయబడి ఉన్నాయి మరియు ఇక్కడ హ్యారియర్ అక్షరాలు క్రోమ్ ఫినిష్ కలిగి ఉన్నాయి. ముందరి డోర్ వద్ద #డార్క్ బ్యాడ్జింగ్ؚను కూడా పొందింది.

2023 Tata Harrier Dark Edition Alloy Wheel

డార్క్ ఎడిషన్ؚతో, పూర్తి నలుపు రంగు అలాయ్ వీల్స్ؚను పొందవచ్చు ఇవి రెండు సైజులలో లభిస్తాయి. లోయర్-స్పెక్ డార్క్ ఎడిషన్ వేరియెంట్ؚలో 18-అంగుళాల అలాయ్ వీల్స్, టాప్-స్పెక్ వేరియెంట్ؚలు 19-అంగుళాల వీల్స్ؚ ఉంటాయి. 

డ్యాష్ؚబోర్డ్

2023 Tata Harrier Dark Edition Dashboard

ఎక్స్ؚటీరియర్ విధంగానే, ఇంటీరియర్ కూడా నలుపు రంగు థీమ్ؚతో వస్తుంది. డ్యాష్ؚబోర్డు మూడు నలుపు లేయర్‌లతో వస్తుంది, ఇందులో ఒకటి కార్బన్ ఫైబర్ వంటి ఫినిష్ؚను కలిగి ఉంటుంది. సాధారణ వేరియెంట్ؚలలో ఇది విభిన్న రంగు ఎంపికలతో వస్తుంది.

2023 Tata Harrier Dark Edition Centre Console

డోర్‌లు, గ్రాబ్ హ్యాండిల్ؚలు మరియు సెంటర్ కన్సోల్ కూడా పియానో నలుపు రంగులో వస్తాయి.

ఇది కూడా చదవండి: పాత సఫారీ రెడ్ డార్క్ ఎడిషన్, 2023 టాటా సఫారీ డార్క్ ఎడిషన్ؚకు ఉన్న తేడాలు ఇవే

సీట్ؚలు

2023 Tata Harrier Dark Edition Rear Seats

డార్క్ ఎడిషన్ సీట్లు నలుపు మరియు బూడిద రంగులో త్రికోణ డిజైన్ ఎలిమెంట్‌లతో వస్తాయి. ఇదే నమూనాను వెనుక వైపు సీట్లలో కూడా చూడవచ్చు. 

ధర 

టాటా హ్యారియర్ ధర రూ.15.49 లక్షలు మరియు రూ.27.35 లక్షల మధ్య (పరిచయ, ఎక్స్-షోరూమ్) ఉంది మరియు డార్క్ ఎడిషన్ మిడ్-స్పెక్ ప్యూర్+ S వేరియెంట్‌తో ప్రారంభం అవుతుంది, దీని ధర రూ.19.99 లక్షలుగా ఉంది (పరిచయ, ఎక్స్-షోరూమ్). నవీకరించిన హ్యారియర్, మహీంద్రా XUV700, MG హెక్టార్ మరియు జీప్ కంపాస్ వంటి వాటితో పోటీని కొనసాగిస్తుంది. 

మరింత చదవండి: టాటా హ్యారియర్ డిజిల్  

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Tata హారియర్

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience