క్విడ్ ని కొనుగోలు చేస్తున్నారా? ఇక్కడ మీరు తెలుసుకోవలసినది ఏమిటి

రెనాల్ట్ క్విడ్ 2015-2019 కోసం manish ద్వారా సెప్టెంబర్ 11, 2015 04:17 pm సవరించబడింది

జైపూర్: చాలా రోజులుగా ఎదురు చూస్తున్న రెనాల్ట్ క్విడ్ వివరాలు బహిర్గతం చేశారు మరియు అవి ఏ మాత్రం నిరాశ పరచలేదు. ఈ కారు ఎస్యువి స్టైలింగ్ వంటి లక్షణాలను మరియు అధిక గ్రౌండ్ క్లియరన్స్ ని కలిగి ఉంది. ఇది నగరాలలో మరియు గతుకుల రోడ్లపై డ్రైవింగ్ ని చాలా సులభం చేస్తుంది. ఎస్యువి డ్రైవర్ వైఖరి మంచి ప్రత్యక్షత అందించేందుకు సహాయపడుతుంది.

బాహ్య భాగాలు:

. దీనిలో సి - ఆకారపు క్రోమ్ పూత గల క్లస్టర్ ముందరి భాగంలో మరియు వెనుక భాగంలో చిన్న బూట్ వంపు ఇవన్నీ కూడా క్విడ్ కి బలమైన మరియు అద్భుతమైన ప్రదర్శనను జోడిస్తున్నాయి.


. దీనిలో సొగసైన క్లాడింగ్ యొక్క రూపం లో ఫ్రెంచ్ యొక్క డిజైన్ కనిపిస్తుంది. చెక్కిన కండరాల భుజాలు, చదునైన విండ్స్క్రీన్ మరియు అమర్చబడియున్న రూఫ్ స్పాయిలర్ కారు ద్రవత్వములను మరియు ఉద్యమం యొక్క స్ఫూర్తిని నిర్వహించేలా చేస్తుంది.

క్విడ్ అంతర్గత లక్షణాలు:

. రెనాల్ట్ క్విడ్ చాలా సహజమైన మరియు యవ్వన శ్రేణి లక్షణాలను కలిగి ఉంది. ఆర్ ఎక్స్ టి వేరియంట్ యొక్క డాష్బోర్డ్ విభాగంలో మొదటి సారిగా టచ్స్క్రీన్ సమాచార వ్యవస్థను కలిగి ఉంది మరియు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మీద చాలా వరకు క్రోమ్ చేరికలు ఉన్నాయి. ఈ 7 అంగుళాల టచ్ స్క్రీన్ వ్యవస్థ మీడియా నావిగేషన్ లక్షణాలను కలిగి ఉంది.
. ఆప్ష్నల్ ఆర్ ఎక్స్ ఇ మరియు దాని కంటే ఎక్కువ వేరియంట్స్ యొక్క వినోద వ్యవస్థ వాయిస్ గైడెన్స్, బ్లూటూత్ ఆడియో స్ట్రీమింగ్ & హ్యాండ్స్ ఫ్రీ టెలీఫోనీ, యుఎస్బి మరియు ఆక్స్ - ఇంపోర్ట్స్ వంటి లక్షణాలను కలిగి ఉంది. మీడియా వ్యవస్థ కూడా స్పీడ్ సెన్సింగ్ వాల్యూమ్ నియంత్రణలు కలిగి ఉంది.


. ఆర్ ఎక్స్ఎల్ మరియు ఆర్ ఎక్స్ టి వేరియంట్ సీట్లు, బూడిద నలుపు మరియు ఎరుపు స్పోర్టి లెథర్ తో కప్పబడి ఉంటాయి. ఆర్ ఎక్స్ఎల్ రెనాల్ట్ "ఇంటెన్స్ రెడ్" గా పిలవబడుతుంది మరియు ఆర్ ఎక్స్ టి "ఛాంపియన్ రెడ్" గా పిలవబడుతుంది. రెనాల్ట్ యొక్క " ఎర్గో స్మార్ట్ కాబిన్" ఆడంబరంగా ఉంటుందనే భావన కల్పిస్తుంది మరియు లోపల నిర్మాణ నాణ్యతతో ముగ్ధులయ్యేలా చేస్తుంది.
. అధనంగా, క్విడ్ 4 వే సర్దుబాటు డ్రైవర్ సీటుతో పరిపూర్ణ డ్రైవింగ్ ని అందిస్తుంది.

క్విడ్ మూడు సెట్లు గ్లోవ్ కంపార్ట్మెంట్స్ తో కలిపి చాలా నిల్వా స్థలాలని కలిగి ఉంది. ఈ కారు ఆకట్టుకునే 300 లీటర్ల బూట్ స్పేస్ ను కలిగి ఉంది. దీని సామర్ధ్యాన్ని 1,115 లీటర్లు వరకు విస్తరించవచ్చు. దీని వలన ఈ వాహనం దూరపు ప్రయాణాలకు అనుగుణంగా ఉంటుంది. క్విడ్ పవర్ సాకెట్ ని కూడా కలిగి ఉంది.

క్విడ్ 3 సిలిండర్ ఇంజిన్ తో 799cc స్థానభ్రంశాన్ని అందిస్తూ 54bhp శక్తిని మరియు 72Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 180mm హద్దుకొనే గ్రౌండ్ క్లియరెన్స్ ని అందిస్తుంది. డ్రైవర్ ఆప్ష్నల్ గా ఎయిర్బాగ్ ని కలిగి ఉన్నారు. అలానే డిజిటల్ ఇన్స్టృమెంటల్ క్లస్టర్ అన్ని వేరియంట్స్ కి ప్రామాణికంగా అందించబడుతుంది. దీనిలో ఇతర భద్రతా లక్షణాలైన సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, ముందు డిస్క్ బ్రేక్లు, హై మౌంట్ స్టాప్ ల్యాంప్ మరియు వినిపించే పార్కింగ్ బ్రేక్ హెచ్చరిక కూడా అందుబాటులో ఉన్నాయి.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన రెనాల్ట్ క్విడ్ 2015-2019

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience