• English
  • Login / Register

క్రేటాను కొనుగోలు చేస్తున్నారా? విడుదలకు ముందే నిర్ణయించుకోండి!

జూలై 14, 2015 12:29 pm raunak ద్వారా ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: భారతదేశం యొక్క టాప్ రెండు ప్రయాణీకుల కార్ల తయారీ కంపెనీలు దేశం యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ క్రాస్ ఓవర్స్ విభాగంలోకి ప్రవేశించడం కోసమై క్రేటా మరియు ఎస్-క్రాస్ లను విడుదల చేయనున్నరు. మీరు క్రేటా కోసం మనసు పారేసుకుంటే, మీరు ఈ వ్యాసం చదవడం అవసరం.

క్రేటా గురించి తెలిసినంత వరకు,  మారుతి మొదటి క్రాస్ఓవర్ అయిన ఎస్-క్రాస్ తో పాటు రెనాల్ట్ డస్టర్, ఫోర్డ్ ఈకోస్పొర్ట్ కి కూడా ధీటుగా నిలుస్తోంది. అందం విషయానికి వస్తే ఇది రాబోయే ఎస్-క్రాస్ లాగా చప్పిడి డిజైనుతో రాదు. నిజానికి, ఇది పెద్ద సోదరుడు శాంతా-ఫే నుండి వారసత్వంగా పోలికలను తెచ్చుకున్నట్టుగా కనిపిస్తోంది.

దీనికి ప్రొజెక్టర్లు మరియు ఎలీడీ డే టైం రన్నింగ్ లైట్స్ ఉన్నాయి ( హ్యుందాయ్ చివరి జెన్ ఐ 20 తో ఉప-10 లక్షల విభాగంలో డీఆరెల్స్ ని ప్రవేశపెట్టింది అని గుర్తుంచుకోండి). ఇది వజ్రం-కట్ మిశ్రమాలతో ఉన్న ఒక పెద్ద 17-అంగుళాల వీల్ మీద సవారీ చేస్తుంది. ఇతర హ్యుండై వాహనాల లాగానే దీనిలో కూడా లోపల భాగాన ఎన్నో ఉపకరణాలు నిండి ఉన్నాయి. ఒక పెద్ద టచ్స్క్రీన్ ఇంఫొటెయిన్మెంట్ సిస్టం కి అంతర్నిర్మిత మెమరీ, బ్లూటూత్ వంటి ఇతర ఆడియో సిస్టమ్ ఎంపికలు తో పాటుగా మరొక చిన్న టచ్స్క్రీన్ కూడా వస్తుంది. వీటితో పాటు ఎన్నో సాధారణ హ్యుందాయ్ విషయాలు దీనికి ఉపయోగకరంగా ఉంటాయి. నెక్సా షోరూం లలో ఎస్-క్రాస్ ని రీటెయిల్ చేయనున్నరు కనుక వచ్చే వారాలలో 30 డీలర్లు మారుతీ కి ఉండవచు కాని హ్యుండై కి కూడా పెద్ద డీలర్షిప్ నెట్వర్క్ ఉంది అనడంలో అతిసయోక్తి లేదు. హ్యుందాయ్ డీలర్ అందుబాటు మరియు సేవ నెట్వర్క్ రెండిటిలో ఫోర్డ్ మరియు రెనాల్ట్ లను మించినది. అంతేకాక, హ్యుందాయ్ పునఃవిక్రయం విలువ కూడా ఎక్కువ మరియు మారుతి తరహా స్థాయిలోనే కొంతవరకు ఉంది.

ఈ ఉత్పత్తి ఎన్నో ప్రమాణాలతో వస్తొంది. కానీ మీరు ధర విషయంలో ఆలోచించే వారు అయితే దీని ఆఖరి ధర మరియూ నిర్వహణ ఖర్చుల బట్టి మీ నిర్ణయం ఉండవచ్చును.సాధారణంగా హ్యుండై కి వారి అన్ని ఉత్పత్తులపై అధిక ధర పెట్టే రీతి ఉన్నందు వలన, దీనికి కూడా అలాగే వెల్లడించే అవకాశం ఉంది. కాని మనము క్రేటా యొక్క విడుదలకై 21 జులై వరకు వేచి వుండాల్సిందే. చూస్తూనే ఉండండి కార్దేఖో!

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience