మళ్ళీ గూడచర్యానికి గురి అయిన బుగట్టి చిరోన్
ఆగష్టు 12, 2015 10:46 am అభిజీత్ ద్వారా ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: చాలా రోజులుగా ఎదురుచూస్తున్న హైపర్కార్, బుగట్టి యొక్క చిరోన్ మళ్ళీ లాస్ ఏంజిల్స్ లో ఒక విమానాశ్రయం వద్ద గుర్తుపట్టడానికి వీలులేకుండా గూడచర్యం అయ్యింది. ఈ వాహనాన్ని పెబల్ బీచ్ వద్ద ఒక ఆటో షోలో ప్రదర్శించనున్నారు. అంతేకాకుండా, ఈ కారును సంభావ్య కొనుగోలుదారులకు మాత్రమే ప్రదర్శించనున్నారు.
ఈ కారు బారీ ముసుగు తో ఉండటం వలన దీని డిజైన్ గురించి చెప్పడం చాలా కష్ట్టం. కానీ, ఒక విషయం ఏమిటంటే ఈ కారువెయ్రోన్ కంటే చాలా స్పోర్టిగా మరియు డైనమిక్ గా ఉంటుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం.
చిరోన్ (ఈ పేరు ను ఇంకా దృవీకరించలేదు) అదే డబ్ల్యూ 168 లీటర్ ఫోర్ టర్బో ఇంజన్ తో వచ్చే అవకాశాలు ఉన్నాయి.అంతేకాకుండా, ఈ ఇంజన్, ఒక విద్యుత్ మోటార్ సిస్టమ్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 1500పిఎస్ పవర్ ను అదే విధంగా 1500 ఎన్ ఎం గల పీక్ టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.మరోకచెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే ఈ వాహనం యొక్క త్వరణం విషయానికి వస్తే, ఈ కారు 0 కె ఎం పి హెచ్ నుండి 100 కెఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 2 సెకన్ల సమయం పడుతుంది. అదే విధంగా మరోవైపు, ఈ వాహనం 450 కె ఎం పి హెచ్వేగాన్ని వేరుకోగలుగుతుంది. వెయ్రోన్ ఎసెస్ డబ్ల్యూ ఆర్ ఈ కంటే ఎక్కువ వేగం అని చెప్పవచ్చు. ఎందుకంటే, ఈ వెయ్రోన్ఎసెస్ డబ్ల్యూ ఆర్ ఈ వాహనం అత్యధికంగా 415 కె ఎం పి హెచ్ వేగాన్ని మాత్రమే చేరుకోగలుగుతుంది
ఈ కారు ను అధికారికంగా 2016 వ సంవత్సరం మద్య లో ప్రారంబించేదుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే, దీనియొక్క కాన్సెప్ట్ మోడల్ ను మాత్రం దీని కంటే ముందుగానే ప్రదర్శించనున్నారు.
వెయ్రాన్ చాలా కాలం అత్యధిక వేగంతో ముందంజలో ఉంది. కానీ ఈ చిరాన్, ఆ స్థానాన్ని ఆక్రమించేసింది. కానీ కోఇంగ్సెగ్రెజెరా వంటి కార్లు సమర్థవంతమైనవిగా వెలువడ్డాయి. సూపర్ కార్లను, రూపొందించేవారు ప్రామాణిక అంశాలను దృష్ట్టి లోపెట్టుకొని రూపొందించాలి.
0 out of 0 found this helpful