ADAS ఫీచర్‌తో నవీకరించబడిన టాటా హ్యారియర్, సఫారీలకు ప్రారంభమైన బుకింగ్ؚలు
టాటా హారియర్ 2019-2023 కోసం sonny ద్వారా ఫిబ్రవరి 17, 2023 01:08 pm ప్రచురించబడింది
- 55 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
వీటి నవీకరించబడిన ఫీచర్‌ల జాబితాలో సరికొత్త ఇన్ఫోటైన్ؚమెంట్ టచ్ؚస్క్రీన్ చాలా పెద్దగా అందించబడింది.
-
ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించిన విధంగా హ్యారియర్, సఫారీ వాహనాలు ఫీచర్ నవీకరణలను పొందనున్నాయి.
-
కొత్త ADAS సాంకేతికత ఫీచర్‌ల జాబితాలో ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ ఉన్నాయి.
-
కొత్త 10.25-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ టచ్‌స్క్రీన్, మరింత నాణ్యమైన ఏడు-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే ఇందులో ఉన్నాయి.
-
ఈ 2-లీటర్ డీజిల్ ఇంజన్- మాన్యువల్, ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ రెండిటితో కొనసాగుతుంది.
-
రెండు SUVల ధరలు మార్చిలో ప్రకటిస్తారని ఆశిస్తున్నాము.
2023లో టాటా హ్యారియర్, సఫారి SUVలు మరిన్ని ఫీచర్ నవీకరణలు పొందనున్నాయి, ఇందులో చాలా ఫీచర్‌లను ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించారు. లాంచ్ తేదీని ఇంకా వెల్లడించలేదు కానీ రూ.30,000 ముందస్తు ధరను చెల్లించి నవీకరించబడిన ఈ SUVలను ప్రస్తుతం బుక్ చేసుకోవచ్చు.
సంబంధించినవి: ఆటో ఎక్పో 2023లో టాటా హ్యారియర్, సఫారీలలో పరిచయం చేసిన 5 కొత్త ఫీచర్‌లు
టాటా SUVలలో కొత్తగా వచ్చినవి ఏమిటి?
2023లో హ్యారియర్, సఫారీ వాహనాలలో తీసుకువచ్చిన అతి పెద్ద మార్పు ADASను జోడించడం, దీనికి తోడుగా ఫీచర్‌లؚలో ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్, హై బీమ్ అసిస్ట్, రేర్ కొలిజన్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్ కూడా ఉన్నాయి. 360-డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరాతో భద్రత పరంగా కూడా మెరుగుదలను తీసుకువచ్చింది.
మధ్యస్థ పరిమాణం కలిగిన ఈ SUV- పాత 8.8 అంగుళాల యూనిట్ స్థానంలో కొత్త 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్ؚమెంట్ సిస్టమ్, నవీకరించబడిన ఏడు-అంగుళాల డిజిటల్ TFT డ్రైవర్ డిస్ప్లే వంటి ఇతర అదనపు ఫీచర్‌లు అందించబడ్డాయి. ఈ కొత్త స్క్రీన్‌లు ఇప్పటికే హ్యారియర్ మరియు సఫారీల క్యాబిన్ؚను మరింతగా మెరుగుపరుస్తున్నాయి. మరోవైపు, ప్రత్యేక ఎడిషన్ వేరియెంట్‌లో ఇప్పటికే వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్‌లు, వైర్ؚలెస్ అండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ؚప్లే, వైర్ؚలెస్ ఛార్జింగ్ మరియు పూర్తి డిస్క్ బ్రేకులు వంటి సౌకర్యాలను అందిస్తుంది.
సుపరిచితమైన పవర్ؚట్రెయిన్ؚలు
ప్రస్తుతానికి ఈ టాటా టాప్ SUVలు, 170PS, 350Nm పవర్, టార్క్‌లను అందించే 2-లీటర్ డీజిల్ ఇంజన్ؚతో కేవలం డీజిల్ వెర్షన్‌లో మాత్రమే అందిస్తున్నాయి. ఇవి ఆరు-స్పీడ్‌ల మాన్యువల్, ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్‌లతో జత చేయబడ్డాయి. అయితే, తాజా ఉద్గారాలు మరియు RDE నిబంధనలను అనుగుణంగా ఇంజన్ؚను నవీకరించవచ్చు, E20 ఫ్లెక్స్ ఫ్యూయల్ؚకు అనుగుణంగా కూడా ఉండవచ్చు.
డిజైన్ మార్పుల కోసం వేచి ఉండాలి
2023లో హ్యారియర్, సఫారీలు మరింత సాంకేతికత, ఫీచర్‌లతో నవీకరించబడవచ్చు, కానీ సరికొత్త లుక్ ఈ నవీకరణలో భాగంగా లేదు. లుక్ పరంగా గణనీయమైన మార్పులతో 2024లో మరొక వెర్షన్ అందుబాటులోకి వస్తుంది అని ఆశిస్తున్నాము. సరికొత్త ముందు, వెనుక భాగం డిజైన్‌లు, ఆటో ఎక్స్ؚపో 2023లో టాటా హ్యారియర్ EV కాన్సెప్ట్ؚలో ప్రదర్శించారని భావిస్తున్నాము.
ప్రారంభ తేదీ మరియు అంచనా ధరలు
నవీకరించబడిన టాటా SUVలు, ముఖ్యంగా టాప్ వేరియంట్‌లు ప్రస్తుత ధరల కంటే అధిక ధరతో ఈ మార్చిలో మార్కెట్ؚలోకి ప్రవేశించవచ్చని అంచనా. హ్యారియర్ ప్రస్తుత ధర రూ.15 లక్షల నుంచి 22.6 లక్షల వరకు ఉంది, సఫారి ధర రూ.15.65 లక్షల నుంచి 24.01 లక్షల వరకు ఉంది (రెండూ ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధరలు).
ఇక్కడ మరింత చదవండి: టాటా హ్యారియర్ డీజిల్
0 out of 0 found this helpful