రెనాల్ట్ క్విడ్ యొక్క బుకింగ్స్ ప్రత్యేక ఎంపిక గల నగరాలలో తెరవబడ్డాయి
ఆగష్టు 26, 2015 02:11 pm manish ద్వారా సవరించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
దీపావళి రాబోతుండగా, మిగతా ఆటో తయారీదారులలాగానే రెనాల్ట్ కూడా ఈ పండుగ కాలాన్ని దృష్టిలో పెట్టుకుని అడుగు వేస్తున్నారు. ఇందుకొరకు, రెనాల్ట్ వారు ఒక దిగువ శ్రేని క్రాస్ ఓవర్ అయిన క్విడ్ ని విడుదల చేయనున్నారు. కొన్ని నగరాలలో, డీలర్షిప్ లు బుకింగ్స్ ని మొదలు పెట్టారు మరియూ ఈ ధరలు నగరాన్ని మరియూ డీలర్ ని బట్టి రూ.20,000 నుండి మొదలుకొని రూ.50,000 వరకు ఉంటున్నాయి.
ఈ ఫ్రెంచ్ ఆటో తయారీదారి దిగువ శ్రేని క్రాస్ ఓవర్ హ్యాచ్బ్యాక్ తో భారతదేశం లో మొట్టమొదటి సారిగా అడుగు పెట్టబోతున్నారు. చూడటానికే కాదు, ఈ క్రాస్ ఓవర్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వంటి అంశాలు కూడా ఎస్యూవీ లాగానే ఉన్నాయి. రూపం విషయం లో అయితే, ఈ క్విడ్ ఎంతో ధృఢంగా, అందమైన ఫెండర్స్, పొడుచుకు వచ్చే ముందు వైపు బంపర్, చరల పై కప్పు మరియూ బానెట్ కలిగి ఉంది.
అంతర్ఘతాలు కూడా బాహ్య రూపం తో పోటీగా ఉన్నాయి. పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మధ్య భాగం లో ఉండే ఎయిర్ కండిషనర్, పవర్ విండోస్ కంట్రోల్స్ మరియూ పైకి పెట్టబడిన ఎయిర్ వెంట్స్ ఉన్నాయి. ఈ డిజిటల్ ఇంఫోటెయిన్మెంట్ సిస్టము మొట్టమొదటి సారిగా అందించబడుతుంది కానీ ఇది కేవలం ఉన్నత శ్రేని ట్రిం లో మాత్రమే లభ్యం అవుతుంది. ఈ రెనాల్ట్ క్విడ్ లో బూట్ స్పేస్ కూడా అధికంగా ఉంటుంది. ఒక 6 అంగుళాల ఇంఫొటెయిన్మెంట్ సిస్టము యూఎస్బీ మరియూ ఆక్స్-ఇన్ కనెక్టివిటీతో ఉంటుంది. రెనాల్ట్ వారు క్విడ్ కి ఒక 800సీసీ పెట్రోల్ ఇంజిను అమర్చి మాన్యువల్ ట్రాన్స్మిషను తో జత చేశారు. పుకార్ల ప్రకారం, ఒక పెద్ద 1.0-లీటర్ వెర్షన్ మరియూ ఆటోమాటిక్ ట్రాన్స్మిషను తో పాటుగా భవిష్యత్తు లో అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.
డీలర్స్ ప్రకారం, క్విడ్ యొక్క డెలివరీలు సెప్టెంబరు నెల ఆఖరు లోగా ప్రారంభం అవుతాయి. కానీ దీని గురించి కానీ విడుదల గురించి ఎటువంటి అధికారిక ప్రకటన తెలియరాలేదు. ఈ కారు దాదాపుగా రూ.3 నుండి 4 లక్షల (ఎక్స్-షోరూం) వరకు ఉండే అవకాశం ఉంది.