కొత్త లోగోతో గర్వంగా వస్తున ్న బిఎండబ్ల్యూ యొక్క మినీ
జూన్ 26, 2015 03:30 pm అభిజీత్ ద్వారా ప్రచురించబడింది
- 11 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: బీఎండబ్ల్యూ యొక్క ఉపసంస్థ అయిన మినీ, తమ లోగో లో మరియు కంపెనీ వ్యూహలలో మార్పులు చేసి పునః సృష్టించడానికి ప్రయత్నిస్తోంది. ఈ సందర్భంగా బి ఎం డబ్ల్యూ ఎజి యొక్క బోర్డు నిర్వహణ సభ్యుడు, మినీ మరియు రోల్స్ రాయిస్ కంపనీ బాధ్యతాయుత అధికారి, బీఎండబ్ల్యూ మోటార్ మరియు ఆఫ్టర్ సేల్స్ అధ్యక్షుడు మిస్టర్ పీటర్ స్క్వార్ జెంబాయెర్ మాట్లాడుతూ తమ బ్రాండ్ అభివృద్ధి ప్రణాళికలను గురించి వివరించారు. ఈ ప్రకటన న్యూ మినీ క్లబ్ మ్యాన్ యొక్క వరల్డ్ ప్రీమియర్ వద్ద జరిగింది. భారతదేశం లో, ఈ కారు యొక్క అమ్మకాలు బాగా విస్తరిస్తున్నాయి. ఇది చాల పేరు ఉన్న బ్రాండ్ అంతేకాకుండా వీటి అమ్మకాలు పెగుతుండటంతో మిని యొక్క పొర్ట్ఫోలియో కూడా బాగా పెరిగింది. ఇటీవల విడుదల అయిన మినీ కూపర్ ఎస్ కూడా వేగంతో అంతటా విస్తరిస్తోంది.
కొత్త లోగో మామూలుగా బోల్డ్ బ్లాక్ బోర్డర్ తో తయారు చేయబడి ఉంటుంది. ఈ మినీ పేరు, ఒక సర్కిల్ లో బిగించబడి ఉంటుంది, దీని చుట్టూ రెక్కల వలే గీతతో రాబోతుంది.
మిస్టర్ పీటర్ స్క్వార్ జెంబాయెర్ మాట్లాడుతూ "1959 లో దీనిని స్థాపించినప్పటి నుండి బ్రాండ్ ఎల్లప్పుడూ కొత్త భావాలతో ప్రేరణ మరియు మక్కువ తో నిలిచింది, అది ఎప్పుడూ మారదు. ఈ యొక్క కొత్త మినీ క్లబ్ మ్యాన్, పునరుద్దరించబడిన మా బ్రాండ్ తత్వశాస్త్రం యొక్క చిహ్నం అని అన్నారు. మేము భవిష్యత్తులో ప్రారంభించే బలమైన పాత్రలతో కూడిన ఐదు కోర్ మోడల్స్ పైన దృష్టి సారించాము. ఇప్పటివరకు మాకు మేమే మా కొత్త భావాలతో మరియు కొత్త వ్యాపార ప్రాంతాల్లో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాము. మేము బ్రాండ్ యొక్క దృశ్యమాన గుర్తింపుని అభివృద్ధి చేస్తాము. ప్రీమియం కాంపాక్ట్ తరగతి లో మా ఆఫర్లను విస్తరణ చేస్తున్నాము. ఇది కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి మరియు ఆసక్తిగల మినీ అభిమానుల కోసం బాగా ఉపయోగపడుతుంది. ఈ సమగ్ర పునరీకరణకు మాకు వీలుగా మినీ బ్రాండ్ యొక్క ప్రత్యేక విజయగాథ కొనసాగుతుందని నేను నమ్ముతున్నాను." అని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుత సంవత్సరంలో ఈ బ్రాండ్ విశేషమైన పెరుగుదలను ఎదుర్కొంటోంది మరియు మొదటి అర్థ సంవత్సరంలోనే ఇది 1,63,000 కు పైగా రిటైల్ యూనిట్లతో రికార్డ్ సృష్టించింది. ఈ మినీ యొక్క చరిత్రలో ఇది అత్యుత్తమ జూన్ మాసం అవుతుందని, ఆ నికర వృద్ధి కంటే 20% ఎక్కువగా ఆదాయాన్ని సూచిస్తుందని మిస్టర్ పీటర్ అన్నారు.మినీ 2001 లో తిరిగి పునఃప్రారంభించబడింది, అది ఎప్పటికప్పుడు మునుపటి సంవత్సరం కంటే మెరుగైనదిగా కొత్తదనంతో 2001 నుంచి పెరుగుతూ వస్తుంది.