1.71 కోట్లు వద్ద భారతదేశంలో ప్రారంభించబడిన బిఎండబ్లు ఎం6 గ్రాన్ కూప్ (లోపల గ్యాలరీ)
బిఎండబ్ల్యూ ఎం సిరీస్ కోసం nabeel ద్వారా అక్టోబర్ 05, 2015 04:07 pm ప్రచురించబడింది
- 20 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
బిఎండబ్లు దాని సరికొత్త ఎం6 గ్రాన్ కూప్ ని 1.71 కోట్ల వద్ద భారతదేశంలో ప్రారంభించింది. కారు ముంబై లో బిఎండబ్లు యొక్క మొదటి ఎం స్టూడియో, ఇన్ఫినిటీ కార్స్ లో ప్రారంభించబడింది. ఇది దేశంలో మొట్టమొదటి బిఎండబ్లు షోరూం. ఇది ఎం పనితీరు గల కార్లకు అంకితం చేయబడినది. తదుపరి బిఎండబ్లు యొక్క ఎం వెర్షన్ లో ఎక్స్5 ఎం మరియు ఎక్స్6 ఎం కార్లు ఈ నెల తరువాత విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎం6 వాహనం ఒక సిబియు యూనిట్ మరియు భారతదేశంలో ఎం స్టూడియో ద్వారా అమ్మకాలు జరుగుతున్నాయి.
560hp శక్తిని బిఎండబ్లు పాత వాహనం అందించగా, ప్రస్తుత వాహనం 4.4 లీటర్, ఎం ట్విన్ టర్బో 8 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ తో 552bhp శక్తిని మరియు 680Nm టార్క్ ని అందిస్తుంది మరియు సెవెన్ స్పీడ్ డ్యుయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ ద్వారా శక్తిని వెనుక చక్రాలకు అందిస్తుంది. ఈ వాహనం 0 నుండి 100Kmph చేరుకునేందుకు 4.2 సెకెన్ల సమయం తీసుకోగా, గరిష్టంగా 250kmph వేగాన్ని చేరుకోగలదు. దీని మైలేజ్ సామర్ధ్యం 10.1 km / l మరియు 232 గ్రా / కిలోమీటర్ల co2 ఉద్గారాలను విడుదల చేస్తుంది. కారు స్పోర్ట్ మరియు సౌకర్యం కొరకు రెండు ఎం డ్రైవ్ బటన్లను స్టీరింగ్ వీల్ పై కలిగి ఉంది.
ఎం6 గ్రాన్ కూప్ మొదట 2014 లో ప్రారంభించబడింది, ఇప్పుడు లోపల మరియు వెలుపల కొన్ని ట్వీక్స్ తో వస్తుంది. బాహ్యభాగంలో ఎం బ్యాడ్జింగ్ తో డబుల్ బార్ కిడ్నీ గ్రిల్, కొత్త అనుకూల ఎల్ఇడి హెడ్లైట్లు, ముందరి భాగంలో పెద్ద గాలి తీసుకునే విభాగం, వెనుక ఆప్రాన్ లో ఇంటిగ్రేటెడ్ డిఫ్యూజర్, కార్బన్ ఫైబర్ పైకప్పు, క్వాడ్ ఎగ్జాస్ట్ పైపులు, 20 అంగుళాల అల్లాయ్ వీల్స్, టెయిల్ లైట్ క్లస్టర్ పైన చిన్న మార్పులు మరియు బూట్ లిడ్ పైన ఎం బ్యాడ్జ్. అలానే లోపలి భాగంలో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పైన ఎం బ్యాడ్జ్, సెంటర్ కన్సోల్ మరియు డోర్ సిల్ వంటి లక్షణాలనుఇ కలిగి ఉంది. అంతేకాకుండా, ఎం స్పోర్ట్ సీట్లు మంచి రేసింగ్ కారు అనుభూతిని అందిస్తాయి. ఈ కారు తొమ్మిది మెటాలిక్ రంగులు ఆల్పైన్ వైట్, బ్లాక్, నీలం, సిల్వర్స్టోన్, స్పేస్ గ్రే, జటోబా, శాన్ మారినో బ్లూ, షకిర్ ఆరెంజ్, సింగపూర్ గ్రే మరియు ఇంపీరియల్ బ్లూ రంగులలో అందుబాటులో ఉంటుంది.
ప్రారంభం గురించి బిఎండబ్లు గ్రూప్ ఇండియా అధ్యక్షుడు, మిస్టర్ ఫిలిఫ్ వోన్ సహర్ మాట్లాడుతూ " ఆకట్టుకునే శక్తి, అద్భుతమైన టెక్నాలజీ మరియు మోటార్ స్పోర్ట్స్ నిజమైన అనుభూతిని ఒకేఒక్క అక్షరం 'ఎం' గా చెప్పవచ్చు. బిఎండబ్లు ఎం6 గ్రాన్ కూప్ ఇప్పటికే శక్తి, డైనమిక్స్, సౌకర్యం మరియు విలాసవంతమైన ఎం నమూనాలతో అత్యుత్తమ ప్రామాణికతను సృష్టించింది. కొత్త బిఎండబ్లు ఎం6 గ్రాన్ కూప్ సమర్ధవంతమైన ఇంజిన్ ని కలిగియుండి తాజా అధ్యనాన్ని సృష్టించబోతుంది. కొత్త బిఎండబ్లు ఎం6 గ్రాన్ కూప్ అధిక పనితనం కలిగిన లగ్జరీ విభాగంలో బిఎండబ్లు ఎం జిఎంబిహెచ్ యొక్క న్యయకత్వన్ని తిరిగి తెస్తుంది.
0 out of 0 found this helpful