Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

అక్టోబర్ؚలో భారతదేశంలో విడుదల కానున్న iX1 ఎలక్ట్రిక్ SUV టీజర్‌ను విడుదల చేసిన BMW

బిఎండబ్ల్యూ ఐఎక్స్1 కోసం ansh ద్వారా సెప్టెంబర్ 22, 2023 08:58 pm ప్రచురించబడింది

డిజైన్ పరంగా X1కు స్వారూపంగా మరియు రెండు ఎలక్ట్రిక్ పవర్ؚట్రెయిన్ؚలతో వస్తుంది

  • ప్రపంచవ్యాప్తంగా రెండు వేరియెంట్‌లలో లభిస్తుంది: eDrive20 మరియు xDrive30.

  • 475 కి.మీ పరిధిని అందించే 64.7kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది

  • 10.7-అంగుళాల టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు పనోరమిక్ సన్ؚరూఫ్ ఉన్నాయి.

  • దీని ధర రూ.60 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ఉండవచ్చని అంచనా.

ఈ సంవత్సరం భారతదేశంలో ప్రవేశపెట్టనున్న BMW iX1 టీజర్‌ను జర్మన్ కారు తయారీదారు విడుదల చేశారు. X1 SUV ఎలక్ట్రిక్ వర్షన్ గత సంవత్సరం జూన్ؚలో అంతర్జాతీయంగా విడుదలైంది, ఇందులో కారు తయారీదారు మూడవ-జెన్ X1ను ప్రదర్శించారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ SUV భారతదేశానికి రాబోతుంది. ఇప్పటి వరకు మనకు తెలిసిన విషయాలు:

డిజైన్

iX1 డిజైన్ పూర్తిగా X1కు సారూప్యంగా ఉంటుంది. భారీ క్లోజ్డ్-ఆఫ్ గ్రిల్ؚతో నిటారైన ముందు భాగం, LED DRLను కలిగి ఉన్న నాజూకైన LED హెడ్ؚలైట్ؚలు మరియు క్రోమ్ ఇన్సర్ట్ؚలతో పెద్ద బంపర్ؚను కలిగి ఉంటుంది. పక్క వైపు ఉండే బ్లూ ఇన్సర్ట్‌లను మినహాయించి, దీని ప్రొఫైల్ దాదాపు సాధారణ X1కు సమానంగా ఉంటుంది, అవే అలాయ్ వీల్ ఎంపికలతో (17-అంగుళాల నుండి 21-అంగుళాల యూనిట్లు) వస్తుంది. దీని వెనుక భాగంలో స్పాయిలర్, L-అకారపు టెయిల్ ల్యాంప్ؚలు మరియు స్కిడ్ ప్లేట్ؚతో భారీ బంపర్ ఉన్నాయి.

X1 నుండి వేరుగా కనిపించేలా, BMW క్రోమ్ ఎలిమెంట్ల చుట్టూ బ్లూ ఇన్సర్ట్ؚలను జోడించింది మరియు రేర్ ప్రొఫైల్ “iX1” బ్యాడ్జింగ్ؚను పొందుతుంది.

iX1లోపల, లేయర్డ్ మరియు డ్రైవర్-ఓరియెంటెడ్ డ్యాష్ؚబోర్డ్ؚతో డ్యూయల్-టోన్ నలుపు మరియు గోధుమరంగు క్యాబిన్‌తో వస్తుంది. నాజూకైన AC వెంట్ؚలు, డ్యూయల్-ఇంటిగ్రేటెడ్ డిస్ప్లే సెట్అప్, మరియు ఫ్లోటింగ్ సెంట్రల్ టన్నల్ؚను కలిగి ఉంది.

ఫీచర్‌లు

గ్లోబల్ మోడల్ 10.7-అంగుళాల టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ؚప్లే, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, పనోరమిక్ సన్ؚరూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు మెమరీ మరియు మసాజ్ ఫంక్షన్ؚతో ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లతో వస్తుంది. ఇది కూడా అనేక ఎయిర్ బ్యాగ్ؚలు, రేర్ పార్కింగ్ కెమెరా, పార్క్ అసిస్ట్ మరియు బ్రేక్ ఫంక్షన్ మరియు ఫ్రంట్-కొలిజన్ వార్నింగ్ؚతో క్రూయిజ్ కంట్రోల్ వంటి డ్రైవర్ అసిస్ట్ ఫీచర్ؚలు కూడా ఉన్నాయి.

ఇది కూడా చదవండి: విడుదల అయిన BMW 2 సీరీస్ గ్రాన్ కూపే M పర్ఫార్మెన్స్ ఎడిషన్

బ్యాటరీ ప్యాక్ మోటార్

iX1, అంతర్జాతీయంగా రెండు వేరియెంట్‌లలో అందించబడుతుంది: eDrive20 మరియు xDrive30, ఇవి రెండూ 64.7kWh బ్యాటరీ ప్యాక్ؚతో అందిస్తున్నారు. మొదటి వాహనం ఫ్రంట్-వీల్ డ్రైవ్ సింగిల్ మోటార్ సెట్అప్ؚతో, 204PS మరియు 250NM టార్క్‌ను విడుదల చేస్తుంది, రెండవది డ్యూయల్ మోటార్ ఆల్-వీల్-డ్రైవ్ సెట్అప్ؚతో వస్తుంది, వీటి మిశ్రమ అవుట్ؚపుట్ 313PS మరియు 494Nm ఉంటుంది. ఈ సెట్అప్ؚతో, iX1 WLTP-క్లెయిమ్ చేసిన పరిధి 475కిమీగా ఉంది. భారతదేశానికి ప్రత్యేకమైన మోడల్ؚతో ఏ పవర్ؚట్రెయిన్ వస్తుందో BMW నిర్ధారించలేదు.

విడుదల, ధర పోటీదారులు

BMW భారతదేశంలో iX1ను ఈ సంవత్సరం అక్టోబర్ؚలో విడుదల చేయవచ్చు మరియు దీని ధర రూ.60 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ఉంటుందని అంచనా. మార్కెట్‌లో వచ్చిన తరువాత, ఇది వోల్వో XC40 రీఛార్జ్ؚతో నేరుగా పోటీ పడుతుంది.

Share via

Write your Comment on BMW ఐఎక్స్1

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది ఎలక్ట్రిక్ కార్లు

  • పాపులర్
  • రాబోయేవి
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర