Choose your suitable option for better User experience.
  • English
  • Login / Register

డిసెంబర్ 15 నుంచి ప్రారంభంకానున్న భారత్ NCAP క్రాష్ టెస్ట్

నవంబర్ 02, 2023 06:21 pm ansh ద్వారా ప్రచురించబడింది

  • 504 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

టాటా, హ్యుందాయ్, మారుతీ సుజుకీ వంటి పలు బ్రాండ్లకు చెందిన 30కి పైగా కార్లను భారత్ NCAP క్రాష్ టెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది.

Tata Safari Crash Test

  • ఇటీవల గ్లోబల్ NCAPలో టెస్ట్ చేయబడిన టాటా హారియర్, సఫారీ ఫేస్లిఫ్ట్లను భారత్ NCAPలో కూడా క్రాష్ టెస్ట్ చేయనున్నారు.

  • మారుతికి చెందిన 3 కార్లు, హ్యుందాయ్ కు చెందిన 3 కార్లు, మహీంద్రాకు చెందిన 4 కార్లను క్రాష్ టెస్ట్ చేయనున్నారు. 

  • క్రాష్ టెస్ట్ లో, ప్రతి కారుకు ఐదు టెస్ట్ లు చేయబడతాయి: ఫ్రంట్ ఇంపాక్ట్, సైడ్ ఇంపాక్ట్, సైడ్ పోల్ ఇంపాక్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు పాదచారుల రక్షణ.

  • ప్రతి కారుకు అడల్ట్ మరియు చైల్డ్ ప్రొటెక్షన్ రేటింగ్స్, మోడల్ పేరు, వేరియంట్ పేరు మరియు టెస్ట్ సంవత్సరంతో కూడిన స్టిక్కర్ ఇవ్వబడుతుంది.

BNCAP అని కూడా పిలువబడే భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ను 2023 ఆగస్టు చివరలో ప్రకటించారు. ఇది అక్టోబర్ 1 నుండి అధికారికంగా అమలులోకి వస్తుందని ప్రకటించినప్పటికీ, భారత్ NCAP డిసెంబర్ 15 నుండి భారతీయ కార్ల క్రాష్ టెస్ట్లను ప్రారంభిస్తుందని నివేదికలు వచ్చాయి.  ఈ సంస్థ పరీక్ష తరువాత ప్రతి కారుకు రేటింగ్ ఇస్తుంది. వయోజన ప్రయాణీకుల రక్షణ, బాల ప్రయాణీకుల రక్షణ మరియు భద్రతా సహాయక ఫీచర్ యొక్క పనితీరు ఆధారంగా ఈ రేటింగ్ ఇవ్వబడుతుంది.

ఏ కార్లను టెస్ట్ చేస్తారు?

Tata Harrier Crash Test

నివేదికల ప్రకారం, భారత్ NCAP మూడు డజన్లకు పైగా కార్లకు క్రాష్ టెస్టులు నిర్వహించనుంది. ఏయే కార్లను పరీక్షిస్తారనే జాబితా ఇంకా వెల్లడి కానప్పటికీ, కొత్తగా విడుదల చేసిన టాటా హారియర్, సఫారీ ఫేస్ లిఫ్ట్  కూడా ఈ పరీక్షలో భాగం అవుతాయని ఈ సంస్థ అధికారులు చెబుతున్నారు.

Skoda Kushaq Crash Test

ఏ కార్లు క్రాష్ టెస్ట్ చేయబడతాయో పేర్లు కన్ఫర్మ్ కాలేదు కానీ, కొన్ని మాస్ మార్కెట్ కంపెనీల కార్లకు క్రాష్ టెస్టులు చేయనున్నట్లు మాకు సమాచారం అందింది. మారుతి నుంచి 3, హ్యుందాయ్ నుంచి 3, మహీంద్రా నుంచి 4 కార్లను భారత్ NCAP క్రాష్ టెస్ట్ చేయనుంది. రెనాల్ట్,  స్కోడా మరియు వోక్స్వాగన్ వంటి యూరోపియన్ కార్ల తయారీ సంస్థలు తమ కార్లకు క్రాష్ టెస్టులు చేయించుకోవడానికి ఇంకా సంప్రదింపులు జరపలేదని ఈ సంస్థ అధికారులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: అక్టోబర్ 2023 లో విడుదల అయిన అన్ని కార్లు, ఈ పండుగ సీజన్ లో ఎంచుకోవడానికి చాలా కార్లు అందుబాటులో ఉన్నాయి.

క్రాష్ టెస్ట్ ల కోసం, ఈ సంస్థ ప్రతి కారు యొక్క బేస్ వేరియంట్ యొక్క మూడు యూనిట్లను తీసుకుంటుంది.

టెస్టింగ్ పరామితులు

Mahindra Scorpio N Crash Test

భారత్ NCAP టెస్టింగ్ పారామీటర్లు గ్లోబల్ NCAPని పోలి ఉంటాయి. ఫ్రంటల్ ఇంపాక్ట్, సైడ్ ఇంపాక్ట్, సైడ్ పోల్ ఇంపాక్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, పాదచారుల భద్రతా టెస్ట్ అనే 5 కీలక పరీక్షలను చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్షల ఫలితాల ఆధారంగా, కారుకు వయోజన ప్రయాణీకుల రక్షణ (AOP), బాల ప్రయాణీకుల రక్షణ (COP) కోసం పాయింట్లు ఇవ్వబడతాయి.

ఈ పాయింట్లు తరువాత స్టార్స్ గా మార్చబడతాయి, 0 నుండి 5 వరకు రేటింగ్ ఇవ్వబడుతుంది. కార్ల యొక్క సమగ్ర భద్రతా రేటింగ్ కి స్టార్స్ ఇవ్వబడతాయి. భారత్ NCAP ద్వారా క్రాష్ టెస్ట్ చేయబడిన అన్ని కార్లకు వాటి వయోజన మరియు పిల్లల భద్రతా రేటింగ్ లతో పాటు మోడల్ పేరు, వేరియంట్ పేరు మరియు పరీక్ష సంవత్సరం నమోదు చేసే స్టిక్కర్ ఇవ్వబడుతుంది. భారత్ NCAP పరీక్షలు తప్పనిసరి కానప్పటికీ, కార్ల తయారీ సంస్థలు అధిక రేటింగ్ ఆశిస్తూ తమ మోడళ్లను క్రాష్ టెస్ట్ చేయించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

కారుకు 3 స్టార్ల కంటే ఎక్కువ రేటింగ్ ఇవ్వడానికి, భారత్ NCAP కారుకు 6 ఎయిర్బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు ఫ్రంట్ సీట్బెల్ట్ రిమైండర్ వంటి కొన్ని ముఖ్యమైన భద్రతా ఫీచర్లను తప్పనిసరి చేసింది. ప్రతి స్టార్ కి కారుకు రావాల్సిన కనీస పాయింట్లను ఇక్కడ చూడండి.

వయోజన ప్రయాణీకుల రక్షణ 

 

బాల ప్రయాణీకుల రక్షణ

 

స్టార్ రేటింగ్

స్కోర్

స్టార్ రేటింగ్

స్కోర్

5 స్టార్

27

5 స్టార్

41

4 స్టార్

22

4 స్టార్

35

3 స్టార్

16

3 స్టార్

27

2 స్టార్

10

2 స్టార్

18

భవిష్యత్తు ప్రణాళికలు

టెస్టింగ్ నిబంధనలను ఎప్పటికప్పుడు నవీకరించాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. భారత్ NCAP తన పరామితులలో రేర్ క్రాష్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్ టెస్ట్ ను కూడా చేర్చనుంది. రాబోయే కాలంలో, మెరుగైన మొత్తం భద్రతా రేటింగ్ కొరకు ఈ సంస్థ కొన్ని ఎంపిక చేయబడ్డ ADAS ఫీచర్లను (లేన్ డిపార్చర్ వార్నింగ్, బ్రేక్ అసిస్ట్ మరియు అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్) తప్పనిసరి చేస్తుంది. 

ఇది కూడా చదవండి: హోండా ఎలివేట్ పెట్రోల్ CVT వర్సెస్ మారుతి గ్రాండ్ విటారా AT: రియల్ వరల్డ్ పెర్ఫార్మెన్స్ పోలిక

భారత్ NCAP క్రాష్ టెస్ట్ లో మీరు ఏ కారును పరీక్షించాలని అనుకుంటున్నారు? కింద కామెంట్స్ సెక్షన్ లో తెలియజేయండి.

మూలం

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience