బెంట్లీ కాంటినెంటల్ వాహన లోపలి భాగాల తయారీలో భారతదేశం నుండి పురాతన కాలం నాటి రాతిపలక ని ఉపయోగించింది.
published on జనవరి 11, 2016 07:59 pm by manish కోసం బెంట్లీ కాంటినెంటల్
- 10 సమీక్షలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
బ్రిటీష్ లగ్జరీ వాహన తయారీదారులు మరియు దీని ప్రాతినిద్య నిర్మాణ దారులు ముల్లినేర్ వారి కాంటినెంటల్ నమూనాలు లోలోన నవీకరించటం జరిగింది. ఈ లోపలి భాగాల ప్రత్యేకత ఏమిటంటే దీని భాగాల తయారీలో ప్రత్యేకమయిన రాయిని ఉపయోగించారు. ఇందులో ఉపయోగించ బడినటువంటి రాయి రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి సేకరించ బడింది. ఈ కారులోని భాగాలు తయారీలో ఖనిజ శిల అయినటువంటి పలక రాయి ని ఉపయోగించారు . ఈ రాతిపలక 200 సంవత్సరాల కు పూర్వం ఉన్నటువంటిది.
ఈ ఖనిజ రాతి పలక తో తయారు చేసిన లోపలి భాగాలు స్వచ్చంగా , 0.1mm సన్నని పొర తో కప్పబడి ఉండి అతి పారదర్శకంగా ఉంటుంది. బెంట్లీ యొక్క లబ్ది దాయకమయిన వినియోగదారులు అంతర్గత పరికరాల కోసం రంగులని ఎంచుకునే ఆప్షన్స్ ని కలిగి ఉంటాయి . రాక్ క్యూరింగ్ ద్వారా ఫైబర్గ్లాస్ రెసిన్ తో దీనిని సాధించ వచ్చును. ఈ రంగు ఎంపికలు ఏమిటనగా ఎరుపు టెర్రా, తెలుపు, గెలాక్సీ మరియు రాగి రంగులు.
ముల్లినేర్ ఆపరేషన్స్ డైరెక్టర్ జియోఫ్ డౌడింగ్ మాట్లాడుతూ , " బెంట్లీ వినియోగ దారుల ప్రసంసలు అందుకునే దిశగా వివిధ రకాల పదార్దాలని అన్వేషిస్తూ మన్నికయిన పరికరాలని తయారు చేయాలని చూస్తుంది" అన్నారు ."ఈ స్టోన్ వేనీర్స్ ని ప్రాధమికంగా వినియోగ దారులకి ఒక విలాసవంతమయిన మరియు వైవిధ్యమయిన పదార్దాలు అందించాలని మాత్రమే మొదలుపెట్టాము" అని కుడా జోడించారు.
భారతదేశంలో బెంట్లీ యొక్క వేనీర్స్ ఎప్పుడు ప్రవేశపెట్టబడుతాయో ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం అధికారికంగా ప్రకటించబడలేదు. ఈ ప్రత్యేక రాతి పలక తో తయారు చేయబడిన లోపలి భాగాలు కలిగిన వేనీర్స్ కేవలం బెంట్లీ యొక్క కొన్ని నమూనాలలో మాత్రమే అందుబాటులో ఉంటాయి.
ఇది కుడా చదవండి ;
లాస్ ఏంజిల్స్ కి వెళుతున్న బెంట్లీ బెంటేగా
- Renew Bentley Continental Car Insurance - Save Upto 75%* with Best Insurance Plans - (InsuranceDekho.com)
- Best Health Insurance Plans - Compare & Save Big! - (InsuranceDekho.com)
0 out of 0 found this helpful