మొదటి బెంట్లి బెంటెగా CREWE ఫాక్టరి నుండి బయటకు వచ్చింది
బెంట్లీ బెంటెగా 2015-2021 కోసం raunak ద్వారా డిసెంబర్ 01, 2015 02:36 pm ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
కార్ తయారీసంస్థ బెంట్లి తన సరికొత్త SUV బెంటెగా ని మొదటిసారి తమ ప్రధాన కార్యాలయం CREWE,యు.కె నుండి బయటికి తీసుకువచ్చింది.జనవరి 2016నుండి బెంట్లి బెంటెగా డెలివరి ప్రారంభం అవుతుందని సంస్థ తెలిపింది. బెంట్లి సంస్థ £840 మిలియన్ పెట్టుబడితో బెంటెగా తయారుచేయబడింది మరియు ఇప్పుడు CREWE లో ఉన్న తమ ప్రధాన ఉత్పత్తి కేంద్రం పూర్తి సామర్ధ్యం తో పనిచేస్తుందని కంపెని తెలిపింది.
“బెంట్లి బెంటెగా మిగతా అన్ని SUVల కంటె కొత్తగా,SUV పదానికి ఒక కొత్త నిర్వచనంగా,లగ్జరికి బెంచ్ మార్క్ గా నిలుస్తుంది.” అని ఛైర్మన్ అండ్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ బెంట్లి మోటార్స్, వోల్ఫ్గ్యాంగ్ దుర్హీమర్ తెలిపారు.
బెంటెగా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన SUV గా తయారు చేయబడింది. దీనికి అవసరమైన శక్తి 6.0-లిటర్ వ్12 ట్విన్- టర్బో చార్జ్ పెట్రోల్ ఇంజన్ నుండి అందుతుంది. దీని మోటార్ 6,000RPM వద్ద 608PS శక్తిని మరియు 900 NM యొక్క టార్క్ ని, కనిష్టంగా 1,250RPM వద్ద మరియు గరిష్టంగా 4,500RPM వద్ద ఉత్పత్తి చేస్తుంది. దీని ఇంజన్ 8-స్పీడ్ ఆటొమెటిక్ గేర్ బాక్స్ తో కలపబడింది. ఈ భారీ శక్తి వలన వాహనం 0 నుండి 100 km/hr వేగాన్ని 4.1 సెకెన్లలో చేరుకుంటుంది మరియు గరిష్టంగా 301 వేగాన్ని చేరుకోగలదు.
Uk ప్రధాన మంత్రి డేవిడ్ కామెరూన్ మాట్లాడుతూ: " మొదటి బెంట్లి బెంటెగా CREWE ఉత్పత్తి కేంద్రం నుండి బయటకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. బెంట్లి ఈ వాహనమును మార్కెట్ లోకి తీసుకురావడం తన అసాధారణమైన కృషిని మరియు తన ఉన్నత స్తానాన్ని తెలుపుతుంది. ప్రతిష్టాత్మకమైన బెంటెగా CREWE ఫాక్టరిలో £800 మిలియన్ పెట్టుబడితో పాటు £9.5 మిలియన్ రీజినల్ గ్రోత్ ఫండ్ ను ఏర్పాటు చేయగలిగింది. అంతే కాకుండ ఈ ఫాక్టరి వందల సంఖ్యలో నైపుణ్యమైన ఉద్యోగాలను కల్పించి ఆ ప్రాంతానికి మరియు అక్కడ ఉత్పత్తి కి తోడ్పడింది. బెంట్లి CREWE లో అందరికి శుభాకాంక్షలు.ఇది ఇక్కడ ఉండే వారందరికి గర్వకారమైన విషయం."
0 out of 0 found this helpful