2015 ఫ్రాంక్ఫర్ట్ మోటర్ షో: ప్రపంచపు అత్యంత వేగవంతమైన ఎస్యూవీ అయిన బెంట్లీ బెంటేగా ఇక్కడకి వస్తోంది

సెప్టెంబర్ 16, 2015 05:52 pm bala subramaniam ద్వారా ప్రచురించబడింది

  • 14 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఇది ఎస్యూవీ ల పండుగ. బెంట్లీ వారు వారి మొట్టమొదటి ఎస్యూవీ అయిన బెంట్లీ బెంటేగా ని 2015 ఫ్రాంక్ఫర్ట్ మోటర్ షో లో ఆవిష్కృతం చేశారు. ఈ బ్రిటీషు లగ్జరీ కారు తయారీదారి ప్రకారం ఈ బెంటేగా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మరియూ విలాసవంతమైన ఎస్యూవీ. బెంటేగా యొక్క సరికొత్త ట్విన్-టర్బో చార్జ్డ్ 6.0-లీటర్ వ్12 ఇంజిను 608 ప్స్ శక్తి ని మరియూ 900న్మ్ టార్క్ ని విడుదల చేస్తుంది. ఈ శక్తి అంతా ఈ ఎస్యూవీ 0 నుండి 100 కీ.మీ గంటకు ప్రయాణం 4.1 సెకనుళ్ళో చేయగలదు. గరిష్ట వేగం గంటకి 301 కీ.మీ లు.

బెంట్లీ బెంటేగా కి పెద్ద మేట్రిక్స్ గ్రిల్లు , బీ-ఆకారపు వింగ్ వెంట్స్, నాలుగు రౌండ్ ఎలీడీ హెడ్ ల్యాంప్స్, టైల్ ల్యాంప్స్ తో 'బీ' ఆకారపు వెలుగు ఉన్న గ్రాఫిక్, పనొరామిక్ గ్లాస్ రూఫ్ మరియూ అల్లోయ్ వీల్స్ 20 నుండి 22 అంగుళాలు వంటి లక్షణాలు ఉన్నాయి. అంతర్గతాలలో చేతి కళ గల లెదర్ ని అమర్చబడి ఉంటుంది. మీరు అయితే నాలుగు సీట్లు లేదా ఐదు సీట్ల అమరిక ని ఎంపిక చేసుకోవచ్చును. ఇందులో అన్ని సీట్లకి కుట్టూ వర్కు మరియూ డైమండ్ డిజైన్ కలిగిన భుజాలను కలిగి ఉంటాయి.

మీరు నాలుగు సీట్ల అమరికను ఎంపిక చేసుకుంటే, రెండు విడి విడి సీట్లకి 18-విధాల అడ్జస్ట్మెంట్ తో పాటుగా మసాజ్ మరియూ వెంటిలేషన్ సదుపాయం తో పాటుగా ఫుట్ రెస్ట్లు కూడా ఉంటాయి. ముందు వైపు సీట్లకి 22-విధాల అడ్జుస్ట్మెంట్లు తో పాటుగా కుషను మరియూ బ్యాక్ రెస్ట్ ఇచారు. ఏడు సీట్ల అమరిక త్వరలోనే అందుబాటులోకి తెస్తారు.

లోపల, ఈ కారు కి 8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇంఫొటెయిన్మెంట్ సిస్టము కి నావిగేషన్ టెక్నాలజీ, ఒక 60 జీబీ హార్డ్ డ్రైవ్, 30 భాషల ఎంపిక కూడా కలదు. రేర్ భాగాన, ప్యాసెంజర్స్ కి బెంట్లీ ఎంటర్టెయిన్మెంట్ ట్యాబ్లెట్ - రిమూవెబుల్ 10.2 అంగుళాల ఆండ్రాయిడ్ డివైస్ తో 4 జీ, వైఫై మరియూ బ్లూటూత్ తో శ్రమ లేని, వేగవంతమైన కనెక్టివిటీ ని పొందగలరు. మూడు వివిధ సౌండ్ సిస్టంస్ ని అందిస్తున్నారు - బెంట్లీ స్టాండర్డ్ ఆడియో, బెంట్లీ సిగ్నేచర్ ఆడియో మరియూ బెంట్లీ ప్రీమియం ఆడియో కి నైం ని అందిస్తున్నారు. చివరగ పేర్కొన్నది 1,950 వాట్ల వద్ద అత్యంత శక్తివంతమైన సిస్టము. దీనికి 18 స్పీకర్లు మరియూ సూపర్-ట్వీటర్స్ ని అందించారు.

ఈ బెంటేగా కి సరి కొత్త 6.0-లీటర్ ట్విన్-టర్బో వ్12 టీఎసై ఇంజిను దాదాపుగా 6,000rpm వద్ద 608ప్స్ ని మరియూ 1,250 నుండి 4,500rpm వద్ద 900Nm ని విడుదల చేస్తుంది. ఇది డైరెక్ట్ మరియూ ఇండైరెక్ట్ ఫ్యుయెల్ ఇంజెక్షన్ ని కలిగి ఉంది. ఇందు చేత ఈ కారు గొప్ప సామర్ధ్యంతో ఆకట్టుకుంటుంది. ఈ ఇంజిను 292 g/Kw చొ2 ని విడుదల చేస్తుంది. ఈ మోటరు కి ఎనిమిది-స్పీడ్ ఆటోమాటిక్ గేర్ బాక్స్ అమర్చబడి ఉంది. ఎక్కువ సామర్ధ్యం తో, క్లీన్ టెక్నాలజీ డీజిల్ మరియూ ప్లగ్-ఇన్ హైబ్రీడ్ మోటర్లు తరువాత అందించడం జరుగుతుంది.

ఈ ఎస్యూవీ తత్వానికి సంబంధించి ఈ బెంటేగా కి బెంట్లీ డ్రైవ్ డైనమిక్స్ మోడ్ కి ఉన్నటువంటి  వెడల్పాటి ఆన్ మరియూ ఆఫ్-రోడ్ డ్రైవ్ సెట్టింగ్స్ తో దాదాపుగా ఎనిమిది మోడ్లు ఉంటాయి, బెంట్లీ డైనమిక్ రైడ్ (ఎలక్ట్రికల్లీ యాక్టివేటెడ్ 48వ్ యాక్టివ్ రోల్ కంట్రోల్), ఎలక్ట్రిక్ పవర్-అస్సిస్టెడ్ స్టీరింగ్ (ఈపీఏఎస్) మరియూ రెస్పాన్సివ్ ఆఫ్-రోడింగ్ సెట్టింగ్ కలిగి ఉంటుంది.

ఇతర డ్రైవ్ అస్సిస్ట్ సిస్టంస్ లో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ (ఏసీసీ) తో స్టాప్ & గో, ప్రెడిక్టివ్ ఏసీసీ మరియూ ట్రాఫిక్ అస్సిస్ట్, ట్రాఫిక్ సైన్ రెకగ్నిషన్, రేర్ క్రాసింగ్ ట్రాఫిక్ వార్నింగ్, టాప్ వ్యూ, నాలుగు క్యామెరా ల డిస్ప్లే చూపించే ఒక సిస్టము, పార్క్ అస్సిస్ట్, ఎలక్ట్రానిక్ నైట్ విజన్ మరియూ హెడ్-అప్ డిస్ప్లే.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience